Viral Video: తగ్గేదే లే అంటూ ఆటో పైకి ఎక్కాడు.. కట్ చేస్తే.. దిమ్మతిరిగే షాకిచ్చిన పోలీసులు.. వీడియో వైరల్..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. డైరెక్టర్ సుకుమార్ కాంబోలో వచ్చిన పుష్ప బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఇందులో హీరో పుష్ప రాజ్ మ్యానరిజం ప్రేక్షకులు అట్రాక్ట్ అయ్యారు..

Viral Video: తగ్గేదే లే అంటూ ఆటో పైకి ఎక్కాడు.. కట్ చేస్తే.. దిమ్మతిరిగే షాకిచ్చిన పోలీసులు.. వీడియో వైరల్..
Viral
Follow us
Rajitha Chanti

|

Updated on: Jun 28, 2022 | 8:59 PM

సాధారణంగా సినిమాల్లో హీరో స్టైల్ ఫాలో అయ్యే వారు చాలా మంది ఉంటారు.. ముఖ్యంగా బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాల్లో హీరో మ్యానరిజంకు కుర్రాళ్లు తెగ అట్రాక్ట్ అవుతారు.. హెయిర్ స్టైల్.. డ్రెస్సింగ్ అంటూ తెగ హడావిడి చేస్తుంటారు.. ఇక సినిమాలో హీరో చేసినట్టుగా.. నిజ జీవితంలోనూ స్టంట్స్ చేసి ప్రాణాల మీదకు తెచ్చుకుంటారు.. ఇలాంటి ఘటనలు ఇప్పటికే చాలా ఎక్కువగా జరిగిన సందర్భాలున్నాయి.. తాజాగా పుష్ప స్టంట్ చేసిన యువకుడికి పోలీసులు దిమ్మతిరిగే షాకిచ్చారు.. అదెంటీ..అని ఆలోచిస్తున్నారా ? అయితే అసలు విషయం తెలుసుకుందాం..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. డైరెక్టర్ సుకుమార్ కాంబోలో వచ్చిన పుష్ప బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఇందులో హీరో పుష్ప రాజ్ మ్యానరిజం ప్రేక్షకులు అట్రాక్ట్ అయ్యారు.. ముఖ్యంగా తగ్గేదే లే అంటూ బన్నీ చెప్పే డైలాగ్ తెగ ఫేమస్.. క్రికెటర్స్, సెలబ్రెటీస్ సైతం ఈ డైలాగ్ ఆటిట్యూడ్‏ను ఫాలో అయిపోయారు.. ఇక అలాగే ఓ యువకుడు కూడా తగ్గేదే లే అంటూ అల్లు అర్జున్ లెవల్లో చెప్పేసాడు.. మాములుగా చెప్తే కిక్కెముంది అనుకున్నాడో ఏమో.. ఏకంగా ఆటో రూఫ్ ఎక్కి మరీ ఈ తగ్గేదే లే అంటూ స్టంట్ చేశాడు.. అంతే పోలీసులు ఇచ్చిన షాక్‏కు నేలమీదకు చేరాడు..

వివరాల్లోకెలితే.. నారాయణఖేడ్ మండల్ ర్యాలమడుగు గ్రామానికి చెందిన మాదిగి సాయిలు కు చెందిన ఆటో… నారాయణఖేడ్ పట్టణంలో పబ్లిక్ రద్దీగా ఉండే ప్రాంతంలో ఆటోను డేంజరస్ గా నడపడమే కాక దాని పైన ఓ యువకుడు నిలబడి పుష్ప స్టైల్లో వీడియో చిత్రీకరించుకున్నాడు.. ఈ వీడియో వాట్సాప్ లో తన స్నేహితులకు పంపగా తెగ వైరల్ అయింది.. ఇక అది కాస్త పోలీసులకు తెలియడంతో రూ.1635 ఫైన్ పోలీసులు విధించారు.. రద్దీగా ఉండే రోడ్లపైన ఆటోను తోలుతూ ఆటో పైన యువకుడు ప్రమాదకరంగా నిలబడి తగ్గేదేలే అన్న రీతిలో యాక్షన్ చేయడంతో రోడ్డు వెంబడి వెళ్లే ప్రజలు ఇదేంపోయే కాలం అని అంటున్నారు. ఇకపై ఎవరైనా ఇలాంటి వాటికి పాల్పడితే సీరియస్ యాక్షన్ ఉంటుందని నారాయణఖేడ్ పోలీసులు తెలిపారు..

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.