AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video : స్మార్ట్ క్లాస్‌లో భోజ్‌పురి పాటలు.. అశ్లీల డ్యాన్స్‌లు చూస్తూ ఎంజాయ్‌ చేస్తున్న విద్యార్థులు,ఉపాధ్యాయులు

సోషల్ మీడియాలో ఓ పాఠశాలకు సంబంధించిన ఒక వీడియో వైరల్ అవుతోంది..అందులో స్మార్ట్ క్లాస్‌లో 'అశ్లీల' భోజ్‌పురి పాటలు ప్లే చేయబడుతున్నాయి..ఆ వీడియో చూస్తూ...ఉపాధ్యాయులు మాత్రమే కాదు.. విద్యార్థులు కూడా ఆ పాటను చూస్తూ ఎంజాయ్‌ చేస్తున్నారు.

Viral Video : స్మార్ట్ క్లాస్‌లో భోజ్‌పురి పాటలు.. అశ్లీల డ్యాన్స్‌లు చూస్తూ ఎంజాయ్‌ చేస్తున్న విద్యార్థులు,ఉపాధ్యాయులు
Smart Class
Jyothi Gadda
|

Updated on: Jun 28, 2022 | 8:53 PM

Share

Viral Video: బీహార్‌లో విద్యావ్యవస్థ ఎంత అధ్వాన్నంగా ఉందో అందరికీ తెలిసిందే. చాలా పాఠశాలల్లో చదువుల పేరుతో పిల్లల భవిష్యత్తుతో ఆటలాడుకుంటున్నారు. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు ప్రతి పాఠశాలలో స్మార్ట్ క్లాస్ లు ఏర్పాటు చేస్తున్నారు. కానీ బీహార్‌లో ఉపాధ్యాయులు దాన్ని అధ్వాన్నంగా మార్చేస్తున్నారు. సోషల్ మీడియాలో బీహర్‌లోని ఓ పాఠశాలకు సంబంధించిన ఒక వీడియో వైరల్ అవుతోంది..అందులో స్మార్ట్ క్లాస్‌లో ‘అశ్లీల’ భోజ్‌పురి పాటలు ప్లే చేయబడుతున్నాయి..ఆ వీడియో చూస్తూ…ఉపాధ్యాయులు మాత్రమే కాదు.. విద్యార్థులు కూడా ఆ పాటను చూస్తూ ఎంజాయ్‌ చేస్తున్నారు. ఈ వీడియో ఛప్రాలోని ప్రభుత్వ పాఠశాల నుండి వచ్చినట్టుగా తెలిసింది.. ఈ వీడియో బీహార్ విద్యావ్యవస్థను మరోసారి బట్టబయలు చేసింది.

వైరల్‌ అవుతున్న వీడియోలో…క్లాస్‌లోని బెంచ్‌పై చాలా మంది విద్యార్థులు కూర్చుని ఉన్నారు. టీచర్‌ కూడా వెనుక కుర్చీలో హాయిగా కూర్చుని స్మార్ట్ క్లాస్‌లో ప్లే అవుతున్న భోజ్‌పురి పాటను ఆస్వాదిస్తున్నారు. ఈ వీడియోను ఓ విద్యార్థి క్లాస్‌లోనే కూర్చొని చిత్రీకరించడంతో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో దరియాపూర్ బ్లాక్‌లోని బార్వే పర్సౌనా పంచాయతీలో ఉన్న రామ్ ఆశిష్ బిగ్నేశ్వర్ హైస్కూల్ లో జరిగిన ఘటనగా తెలిసింది. మెరుగైన విద్యాబోధన కోసం పాఠశాలల్లో స్మార్ట్‌ తరగతులు ఏర్పాటు చేసినప్పటికీ, ఇక్కడ ఉపాధ్యాయులు, విద్యార్థులు వేర్వేరుగా టీవీ స్క్రీన్‌లకు ఏర్పాట్లు చేసుకున్నారు.

ఇవి కూడా చదవండి

విద్యార్థులకు మంచి విద్యాబుద్దులు నేర్పించాల్సిన పాఠశాలలో ఇలాంటి అశ్లీల చిత్రాలు చూపిస్తున్న టీచర్ల పట్ల నెటిజన్లు మండిపడుతున్నారు. వీడియో చూసిన నెటిజన్లు  తీవ్ర ఆ గ్రహంతో కామెంట్లు పెడుతున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

బంగ్లాదేశ్‌లో ఇద్దరు హిందువుల హత్య.. భారత్‌ మాస్ వార్నింగ్‌!
బంగ్లాదేశ్‌లో ఇద్దరు హిందువుల హత్య.. భారత్‌ మాస్ వార్నింగ్‌!
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
ఎందుకు విక్రమ్ ఇలా చేశావ్.. బెట్టింగ్‌కు అలవాటు పడి..
ఎందుకు విక్రమ్ ఇలా చేశావ్.. బెట్టింగ్‌కు అలవాటు పడి..
ప్రపంచంలో న్యూ ఇయర్ వేడుకలు ఫస్ట్ ఎక్కడ జరుగుతాయో తెలుసా..?
ప్రపంచంలో న్యూ ఇయర్ వేడుకలు ఫస్ట్ ఎక్కడ జరుగుతాయో తెలుసా..?
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో
5 ఏళ్లలో 1027 శాతం.. రూ. 1 లక్షకు లాభమెంతో తెలిస్తే మైండ్ బ్లాంకే
5 ఏళ్లలో 1027 శాతం.. రూ. 1 లక్షకు లాభమెంతో తెలిస్తే మైండ్ బ్లాంకే
పెళ్లి సింపుల్‌గా..రిసెప్షన్‌ ఘనంగా..ఏకంగా వెయ్యిమంది వంటవాళ్లతో
పెళ్లి సింపుల్‌గా..రిసెప్షన్‌ ఘనంగా..ఏకంగా వెయ్యిమంది వంటవాళ్లతో
JEE Main 2026 అడ్మిక్‌ కార్డుల విడుదల తేదీ ఇదే.. డైరెక్ట్‌ లింక్‌
JEE Main 2026 అడ్మిక్‌ కార్డుల విడుదల తేదీ ఇదే.. డైరెక్ట్‌ లింక్‌