Kasivinda Plant : చెన్నంగి చెట్టుతో బోలెడు ప్ర‌యోజ‌నాలు.. రహస్యం తెలిస్తే అస‌లు విడిచిపెట్టరు..

రెయినీ సీజన్‌ మొదలైంది...వర్షంకాలం అంటేనే చాల మందికి భయం. ఎందుకంటే ఈ సీజన్ లో జలుబు, దగ్గు, జ్వరం వంటి సమస్యలు తరచూ వెంటాడుతుంటాయి. ఇక, జలుబు, జ్వరంతో బాధపడుతున్న వారికి ఏదీ తినలనిపించదు. ఎన్నో ఔష‌ధ‌ గుణాల‌ను క‌లిగిన చెన్నంగిలో..

Kasivinda Plant : చెన్నంగి చెట్టుతో బోలెడు ప్ర‌యోజ‌నాలు.. రహస్యం తెలిస్తే అస‌లు విడిచిపెట్టరు..
Kasivinda Plant
Follow us
Jyothi Gadda

|

Updated on: Jun 28, 2022 | 7:49 PM

Kasivinda Plant :  రెయినీ సీజన్‌ మొదలైంది…వర్షంకాలం అంటేనే చాల మందికి భయం. ఎందుకంటే ఈ సీజన్ లో జలుబు, దగ్గు, జ్వరం వంటి సమస్యలు తరచూ వెంటాడుతుంటాయి. ఇక, జలుబు, జ్వరంతో బాధపడుతున్న వారికి ఏదీ తినలనిపించదు. ఏదీ తిన్నా కూడా నాలుకకు సహించదు..నోరంతా చేదుగా, ఏ మాత్రం రుచిలేకుండా ఉంటుంది. దాంతో తినాలనే కోరిక కూడా పోతుంది. ఇలాంటి సమస్యను ఓ ఆకు కూరతో చేసే పచ్చడి పొగోడుతుంది. అదే చెన్నంగి ఆకు.. దీన్నే కసివింద అని కూడా అంటారు..చెన్నంగి ఆకులతో పచ్చడి చేసుకుని తింటే..నోటికి రుచిస్తుంది. జ్వరం వచ్చి న వాళ్లకి ఈ చట్నీ తిరిగి రుచి తెలిసేలా చేస్తుంది. ఇంకా చెన్నంగి ఆకులు ఆహారంలో చేర్చి తింటే కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం…

ముందుగా చెన్నంగి ఆకులతో తయారు చేసే చట్నీ గురించి తెలుసుకుందా.. ముందుగా చెన్నంగి ఆకుల్ని తీసుకుని శుభ్రంగా కడిగిపెట్టుకోవాలి. దానికి సరిపడ కాస్తంత చింతపండు, ఎండుమిర్చి, జీలకర్ర, అల్లం, వెల్లుల్లి అన్నింటిని వేరువేరుగా వేయించుకుని సరిపడ ఉప్పువేసి అన్నింటినీ కలిసి పచ్చడి మిక్సిలో పట్టుకోవాలి. ఈ పచ్చడితో జ్వరం, ఆహారం సహించని వారికి పెడితే త్వరగా కోలుకుంటారు. మిక్సీలో కంటే ఈ పచ్చడిని రోటిలో చేస్తే పచ్చడి మరింత రుచిగా ఉంటుంది. అంతేకాదు.. ఈ చెట్టు ప్రతిభాగం ఎన్నో ఔష‌ధ గుణాలను క‌లిగి ఉండి మ‌న‌కు వ‌చ్చే అనేక ర‌కాల వ్యాధుల‌ను న‌యం చేయ‌డంలో ఉప‌యోగ‌ప‌డుతుంది. ఇకపోతే, చెన్నంగి ఆకుతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు పరిశీలించినట్టయితే..

ఎన్నో ఔష‌ధ‌ గుణాల‌ను క‌లిగిన చెన్నంగిలో చిన్న క‌సివింద‌, పెద్ద క‌సివింద అని రెండు ర‌కాల చెట్లు ఉంటాయి. దీనిని చిన్న చెన్నంగి, పెద్ద చెన్నంగి అని కూడా పిలుస్తారు..చిన్న చెన్నంగిని ఉప‌యోగించి క‌డుపులో ఉండే వ్య‌ర్థాల‌ను బ‌య‌ట‌కు పంపించ‌వ‌చ్చ‌ని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. క‌సివింద చెట్టు ర‌సం చేదుగా ఉండి వేడిని క‌లిగిస్తుంది. వాతాన్ని, విషాన్ని హ‌రించే శ‌క్తి ఈ క‌సివింద చెట్టుకు ఉంది. గాయాల‌ను, వ్ర‌ణాల‌ను, చ‌ర్మ రోగాల‌ను న‌యం చేయ‌డంలో ఈ మొక్క ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది.

ఇవి కూడా చదవండి

క‌సివింద చెట్టు ఆకుల‌ను వెన్న‌తో నూరి చ‌చ్చుబ‌డిన ప‌క్ష‌వాత భాగాల‌పైన ప్ర‌తిరోజూ మ‌ర్ద‌నా చేయ‌డం వ‌ల్ల అవి పూర్వ స్థితికి చేరుకుంటాయి. క‌సివింద ఆకుల‌ను, వేరు బెర‌డును ఎండ‌బెట్టి పొడిలా చేసుకుని నిల్వ చేసుకోవాలి. ఈ పొడికి తేనెను క‌లిపి లేప‌నంగా రాసుకోవ‌డం వ‌ల్ల అనేక ర‌కాల చ‌ర్మ వ్యాధులు, గాయాలు, వ్ర‌ణాలు త‌గ్గుతాయి. క‌సివింద గింజ‌ల‌ను దోర‌గా వేయించి పొడిలా చేసుకోవాలి. ఈ పొడిని క‌షాయంలా చేసుకుని అందులో త‌గిన‌న్ని పాలు, కండ‌చ‌క్కెర క‌లిపి కాఫీ లా తాగుతూ ఉంటే స‌మ‌స్త మూత్ర రోగాలు త‌గ్గుతాయి. ర‌క్తం కూడా శుద్ధి అవుతుంది.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

జాతకంలో గురు దోషమా.. గురువారం ఈ పరిహారాలు చేసి చూడండి..
జాతకంలో గురు దోషమా.. గురువారం ఈ పరిహారాలు చేసి చూడండి..
ఇంటర్‌ పరీక్షల ఫీజు తుది గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
ఇంటర్‌ పరీక్షల ఫీజు తుది గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
ట్రావిస్ హెడ్ 2.0.. భారత బౌలర్ల బెండ్ తీసిన 19 ఏళ్ల కుర్రాడు
ట్రావిస్ హెడ్ 2.0.. భారత బౌలర్ల బెండ్ తీసిన 19 ఏళ్ల కుర్రాడు
ఇవాళ సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల భేటీ
ఇవాళ సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల భేటీ
మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..