Viral Video: కారెక్కిన పాము.. రెండు గంటలపాటు ముప్పు తిప్పలు.. చివరకు ఏమైందంటే..?
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని ఎర్రగడ్డ కాలనీలో ఓ మురికి కాలువ పక్క నుంచి వచ్చిన ( జర్రిపోతు) పాము.. పక్కనే అగి ఉన్న కారు టైర్ పక్క నుంచి కార్ డీజిల్ టాంక్ వద్దకు చేరింది.
Snake Hulchal in Nagarkurnool: నాగర్ కర్నూల్ జిల్లాలో ఓ పాము హల్ చల్ చేసింది.. అత్యవసర పని ఏముందో ఏమో కానీ ఓ పాము ఏకంగా కారు ఎక్కింది.. డ్రైవింగ్ కోసం కాదు.. వెళ్లేందుకు సరైన ప్లేస్ దొరకకపోవడంతో పాము కారులోకి వెళ్లింది. చివరకు పామును కారు దించడానికి రెండు గంటలకు పైగా కష్టపడ్డారు. అతికష్టం మీద పామును పట్టుకోవడంతో కారు యజమానితోపాటు.. అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ షాకింగ్ ఘటన నాగర్ కర్నూల్ జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లా కేంద్రంలోని ఎర్రగడ్డ కాలనీలో ఓ మురికి కాలువ పక్క నుంచి వచ్చిన ( జర్రిపోతు) పాము.. పక్కనే అగి ఉన్న కారు టైర్ పక్క నుంచి కార్ డీజిల్ టాంక్ వద్దకు చేరి అక్కడే తిష్టవేసింది. దీంతో కార్ లోపలికి వెళ్లిన పామును బయటకు తీయడానికి ఎన్నో రకాల పాట్లు పడ్డారు. సౌండ్స్ చేస్తూ, కట్టెలతో కార్ వద్ద కొడుతూ.. అయినప్పటికీ ఫలితం లేక పొగ పెట్టారు. అయినప్పటికీ.. పాము మాత్రం కారు లోపలి నుంచి బయటకు రాలేదు.
చివరకు.. హౌసింగ్ బోర్డు కాలనీలో పాములు పట్టే ఓ యువకుడిని పిలిపించారు. దీంతో అతను హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నాడు. వచ్చినా కానీ మరో గంటపాటు శ్రమించాల్సి వచ్చింది. చివరకు అతికష్టం మీద కారు నుంచి పామును పట్టుకున్నారు. అనంతరం పామును అడవిలోకి వదిలి వేదిలేయడంతో ఈ కథ సుఖాంతం అయింది.
వైరల్ వీడియో..
అయితే.. పాము కార్ లోపలికి వెళ్లిందన్న విషయం అంతటా తెలియడంతో.. దానిని చూడటానికి ప్రజలు కూడా పెద్ద ఎత్తున చేరుకున్నారు. ఓ వైపు పామును పట్టుకోవడం, మరోవైపు జనం గుమిగూడటంతో ఎర్రగడ్డ కాలనీలో సందడి నెలకొంది.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..