Viral Video: రోడ్డు పక్కన గుర్తు తెలియని డెడ్ బాడీ? భయపడిన జనాలు.. పోలీసులకేమో మైండ్ బ్లాంక్!
రోడ్డు పక్కనే ఉన్న చెట్ల కింద తెల్లటి వస్త్రంలో మృతదేహం ఉంది. అందరూ నిశ్శబ్దంగా ఉన్నారు. జనమంతా హడలిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు..
ప్రస్తుతం ఎక్కడ చూసినా నేరాలు పెరిగిపోతున్నాయి. హత్యలు, దొంగతనాల ఘటనలు మీరూ చాలానే విని ఉంటారు. పాడుబడ్డ ఇల్లు, రద్దీ రోడ్డు, నిర్మానుష్యమైన ప్రాంతం.. ఇలా ప్రతీది క్రైమ్ స్పాట్స్‌గా మారిపోతున్నాయి. ఇలాంటి వార్తలు తరచూ సోషల్ మీడియాలో వస్తూనే ఉన్నాయి. తాజాగా ఆ కోవకు చెందిన ఓ న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది. అదేంటో చూస్తే మీరూ షాక్ అవుతారు.
వైరల్ వీడియో ప్రకారం.. ఓ రోడ్డు పక్కన చెట్ల కింద తెల్లటి వస్త్రం చుట్టి మృతదేహం ఉన్నట్లు మీరు చూడవచ్చు. ముందుగా దాన్ని ఎవరూ పట్టించుకోకపోయినా.. క్రమేపీ అక్కడ చాలామంది గుమిగూడారు. ఏమై ఉంటుందని అనుకుంటూ.. ఆ మృతదేహం చుట్టూ పదుల సంఖ్యలో జనాలు వచ్చి చేరారు. సమాచారం అందుకున్న పోలీసులు కాసేపటికి అక్కడికి వచ్చారు. ఇంతవరకు బాగానే ఉంది కదూ.. అయితే సినిమాలో అసలు ట్విస్ట్ ఇప్పుడే వస్తుంది. అందరికీ షాక్ కలిగేలా కప్పిన ఆ తెల్లటి వస్త్రం తీసి ఓ వ్యక్తి లేచి కూర్చుంటాడు. దీనితో అక్కడంతా నిశ్శబ్దం చోటు చేసుకుంది. అసలేం జరుగుతోందా అని అక్కడున్న వారికి అర్ధం కాలేదు.
ప్రస్తుతం ఈ విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీనిపై నెటిజన్లు వరుసపెట్టి ఫన్నీ కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు. లేట్ ఎందుకు మీరూ ఓసారి వీడియోపై లుక్కేయండి.