AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Stress Study: పురుషులు, మహిళల్లో ఎక్కువగా ఒత్తిడికి గురైయ్యేది ఎవరంటే..?

భారత దేశంలో మానసికంగా ఎక్కువగా ఒత్తిడికి గురయ్యే వారి గురించి.. యువర్ దోస్ట్ అనే సంస్థ అధ్యయనం చేసింది. ఈ అధ్యయనంలో షాక్ గురి చేసే నిజాలు వెల్లడయ్యాయి. సాధారణంగా మహిళల కంటే పురుషులే ఎక్కువగా కష్ట పడతారు. వారే ఎక్కువగా మానసికంగా ఒత్తిడికి గురవుతారని అందరూ అనుకుంటారు. కానీ ఇది తప్పు. పురుషుల కంటే స్త్రీలే ఎక్కువగా మానసిక ఒత్తిడికి గురవుతున్నారని..

Stress Study: పురుషులు, మహిళల్లో ఎక్కువగా ఒత్తిడికి గురైయ్యేది ఎవరంటే..?
Viral News
Chinni Enni
| Edited By: Janardhan Veluru|

Updated on: Jul 22, 2024 | 3:32 PM

Share

భారత దేశంలో మానసికంగా ఎక్కువగా ఒత్తిడికి గురయ్యే వారి గురించి.. యువర్ దోస్ట్ అనే సంస్థ అధ్యయనం చేసింది. ఈ అధ్యయనంలో షాక్ గురి చేసే నిజాలు వెల్లడయ్యాయి. సాధారణంగా మహిళల కంటే పురుషులే ఎక్కువగా కష్ట పడతారు. వారే ఎక్కువగా మానసికంగా ఒత్తిడికి గురవుతారని అందరూ అనుకుంటారు. కానీ ఇది తప్పు. పురుషుల కంటే స్త్రీలే ఎక్కువగా మానసిక ఒత్తిడికి గురవుతున్నారని యువర్ దోస్ట్ అనే సంస్థ తేల్చింది. దేశ వ్యాప్తంగా ఉద్యోగం చేసే 5 వేల మందిపై ఈ సర్వే నిర్వహించారు.

పురుషులతో పోల్చితే ఆఫీసుల్లో పని చేసే మహిళలు ఎక్కువగా ఒత్తిడికి గురవుతున్నారని సర్వే ప్రతి నిధులు వెల్లడించారు. సర్వే చేసిన వారిలో 72.2 శాతం మంది మహిళలు ఇబ్బంది పడుతున్నారని.. కానీ మగవారిలో 53 శాతం మంది ఉన్నారని వెల్లడించారు. మహిళల్లో ఒత్తిడికి కారణాలు పేర్కొంటూ.. సరైన గుర్తింపు లేకపోవడం, తోటి ఉద్యోగులతో ఎక్కువగా కలవలేకపోవడం, ప్రతీ దానికి భయ పడటం, అనుమానంగా ఉండటం వంటి విషయాలు బయటకు వచ్చాయి. ఇంట్లో బాధ్యతలు, పనులు, పిల్లల కారణంగా కూడా స్ట్రెస్‌కి గురవుతున్నారు.

పురుషులతో పోల్చితే వారి కంటే 30 శాతం అధికంగా మంది మహిళలు ఈ సమస్యలు ఎదుర్కొంటున్నట్లు సర్వేలో వెల్లడైంది. వీటి వలన మహిళల్లో కూడా అనారోగ్య సమస్యలు కూడా ఎక్కువైనట్లు తేలింది. డయాబెటీస్, బీపీ, అధిక బరువు, అధిక కొలెస్ట్రాల్, ఊబకాయం, సరైన సమయం ఉండక పోవడం, గుండె జబ్బులు వంటి సమస్యలు వస్తున్నాయి.

అదే విధంగా ఉద్యోగుల ఎమోషనల్ వెల్ నెస్ స్టేట్ నివేదిక ప్రకారం.. 21 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉన్న 64.42 శాతం మహిళా ఉద్యోగులు అత్యంత ఒత్తిడికి గురవుతున్నారు. 31.40 సంవత్సరాల మధ్య ఉన్న కార్మికులు 59.81 శాతం, 41 – 50 ఏళ్ల మధ్యలో వారు 53 శాతం టెన్షన్‌కి గురవుతున్నారని నివేదికలో వెల్లడైంది. అంతే కాకుండా వర్క్ ప్లేస్‌లో కూడా మార్పులు కూడా మహిళల ఆరోగ్యం, మానసిక ఒత్తిడిపై ప్రభావం చూపిస్తుంది. ఇలా పురుషుల కంటే ఆడవారే ఎక్కువగా స్ట్రెస్‌కి గురవుతున్నట్లు తేలింది.