AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: మేమూ షాపింగ్‌ చేస్తాం.. పెంపుడు మేకలతో ఎస్కలేటర్ ఎక్కి.. మాల్‌కి వెళ్లిన మహిళ..

సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌X లో ఒక పోస్ట్ ఇప్పుడు వేగంగా వైరల్ అవుతోంది. ఒక మాల్‌లో రెండు మేకలను యాక్సిలరేటర్‌పై ఎక్కిస్తున్న ఒక గ్రామీణ మహిళకు సంబంధించిన ఈ వీడియో విడుదలైనప్పటి నుండి వేలాది వ్యూస్‌ సంపాదించింది. ఈ వీడియోను 117.9K కంటే ఎక్కువ మంది వినియోగదారులు చూశారు. లైకులు, కామెంట్లు, షేర్లు చేస్తూ హోరెత్తించారు. చాలా మంది కామెంట్ల ద్వారా వారి స్పష్టమైన దిగ్భ్రాంతికరమైన ప్రతిచర్యలను వ్యక్తం చేశారు. ఇంతకీ ఈ వీడియోలో జరిగింది ఏంటో ఇక్కడ చూద్దాం..

Viral Video: మేమూ షాపింగ్‌ చేస్తాం.. పెంపుడు మేకలతో ఎస్కలేటర్ ఎక్కి.. మాల్‌కి వెళ్లిన మహిళ..
Goats At Mall
Jyothi Gadda
|

Updated on: Oct 01, 2025 | 1:44 PM

Share

సోషల్ మీడియాలో ఎప్పుడు ఏది వైరల్ అవుతుందో ఊహించడం అసాధ్యం. ప్రస్తుతం ఒక వింత సంఘటన నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది. ఇందులో ఒక గ్రామీణ మహిళ మేకలను మాల్‌కు తీసుకెళ్తు్న్న దృశ్యం కనపడింది. అంతే కాదు, ఆమె వాటిని యాక్సిలరేటర్ ఎక్కించే ప్రయత్నం చేసింది. ఆ తర్వాత ఏమి జరిగిందో వైరల్ అవుతోంది. ఈ వీడియో పాతదే అయినప్పటికీ, ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రజలు జంతువుల పట్ల చూపించే ప్రేమే దీన్ని ఇంతగా వైరల్ చేస్తోంది.

ఈ వీడియోను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌లో official__sudhir__raja__100k అనే యూజర్, Xలో @ArshadK96995026 షేర్ చేశారు. ఈ వీడియోలో ఒక మహిళ చీరకట్టుతో అందంగా కనిపిస్తుంది. ఆమె రెండు చేతుల్లో బరువుగా ఉన్న రెండు సంచులు పట్టుకుని ఉంది. అంతేకాదు.. తన రెండు మేకలను కూడా తాడుతో బంధించి పట్టుకుని ఉంది. ఈ గెటప్‌లో ఆమె ఓ షాపింగ్‌మాల్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. అక్కడ ఆమె ఎస్కలేటర్‌ ఎక్కింది.. ఆపై తన మేకలను కూడా ఎక్కించుకోవడానికి ప్రయత్నిస్తుంది. అవి కూడా ఎస్కలేటర్‌ ఎక్కి పై అంతస్తుకు వెళ్తున్నాయి. ప్రజలు ఆమెను వింతగా చూస్తున్నారు. ఆమె కూడా నవ్వుతుంది. ఆమె అమాయకత్వం ప్రజల దృష్టిని ఆకర్షించింది.

ఇవి కూడా చదవండి

ఈ వీడియోలో మేకలు లిఫ్ట్ ఎక్కడానికి భయపడుతున్నట్లు కనిపిస్తోంది. కానీ, ఆమె వాటి మెడకు కట్టిన తాడు సహాయంతో వాటిని తన దగ్గరకు లాగింది. చివరికి వాటిని లిఫ్ట్ పైకి ఎక్కిస్తుంది. అక్కడున్నవారంతా అది ఆశ్చర్యపోయారు. అక్కడ ఉన్న చాలా మంది నవ్వుతున్నారు. ఈ వీడియో పాట్నా జంక్షన్ నుండి వచ్చినట్లు చెబుతారు. అయితే, ఈ వైరల్ వీడియోకు సంబంధించిన వాస్తవాలను ప్రజలు మాత్రం నిర్ధారించలేకపోయారు.

వీడియో ఇక్కడ చూడండి..

X లో పోస్ట్ చేయబడిన ఈ వీడియో ఇప్పుడు వేగంగా వైరల్ అవుతోంది. పోస్ట్ చేసినప్పటి నుండి వేలాది మంది వినియోగదారులు వీడియోను చూశారు. 117.9K కంటే ఎక్కువ మంది ఈ వీడియోను చూశారు. చాలా మంది షాకింగ్‌ కామెంట్స్‌తో స్పందించారు. కొంతమంది వినియోగదారులు ఈ సంఘటనను ఫన్నీగా అభివర్ణించారు. మరికొందరు ఇలా చేయడం ప్రమాదకరమని అన్నారు. ఈ వీడియోపై వ్యాఖ్యానిస్తూ ఇది బీహార్ సోదరా.. ఇక్కడ ఏదైనా సాధ్యమే అని రాశాడు. మరొకరు స్పందిస్తూ.. కుక్క మాల్‌కు వెళ్ళగలిగితే, మేక ఎందుకు వెళ్ళకూడదు? అని రాశారు. చాలా మంది ఈ వీడియోపై స్పందిస్తూ.. బీహార్ నుండి వచ్చిన మేకలు మాత్రమే ఇలాంటి ప్రయాణం చేయగలవు అని రాశారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

నేను ఇప్పుడు తెలంగాణ వాన్ని: వెంకయ్య నాయుడు
నేను ఇప్పుడు తెలంగాణ వాన్ని: వెంకయ్య నాయుడు
అమ్మాయికి మొగుడు... అత్తకు యముడు... ఏకంగా గొంతు కోసి..
అమ్మాయికి మొగుడు... అత్తకు యముడు... ఏకంగా గొంతు కోసి..
గురు, శుక్రుల అనుకూలత.. ఆ రాశుల వారికి హద్దుల్లేని సంపద ఖాయం..!
గురు, శుక్రుల అనుకూలత.. ఆ రాశుల వారికి హద్దుల్లేని సంపద ఖాయం..!
మెస్సీ వచ్చిన ఆ రోజు కోల్‌కతా స్టేడియంలో ఏం జరిగింది ?
మెస్సీ వచ్చిన ఆ రోజు కోల్‌కతా స్టేడియంలో ఏం జరిగింది ?
కొత్త ఏడాది ఈ రాశుల వారి కుటుంబాల్లో భారీగా శుభ కార్యాలు..!
కొత్త ఏడాది ఈ రాశుల వారి కుటుంబాల్లో భారీగా శుభ కార్యాలు..!
రైతన్నలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇకపై నేరుగా ఇంటికే యూరియా!
రైతన్నలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇకపై నేరుగా ఇంటికే యూరియా!
టీ20 వరల్డ్ కప్ టికెట్‌ను మెస్సీకి బహూకరించిన ఐసీసీ ఛైర్మన్ జై షా
టీ20 వరల్డ్ కప్ టికెట్‌ను మెస్సీకి బహూకరించిన ఐసీసీ ఛైర్మన్ జై షా
సమాధులే ఇంటి దేవతలు.. ఏపీలోని ఈ వింత గ్రామం గురించి మీకు తెలుసా
సమాధులే ఇంటి దేవతలు.. ఏపీలోని ఈ వింత గ్రామం గురించి మీకు తెలుసా
కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.20 లక్షల వరకు లోన్.. పొందండిలా..
కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.20 లక్షల వరకు లోన్.. పొందండిలా..
ఈ ఫొటోలో ఒక టాలీవుడ్ హీరోయిన్ కూడా ఉంది.. గుర్తు పట్టండి చూద్దాం
ఈ ఫొటోలో ఒక టాలీవుడ్ హీరోయిన్ కూడా ఉంది.. గుర్తు పట్టండి చూద్దాం