AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: స్వదేశీ టీ చేసిన విదేశీ కోడలు .. ఒక అందమైన పొరపాటుతో వీడియో వైరల్..

వైరల్ అవుతున్న వీడియోలో.. జూలీ తన భర్త కోసం టీ తయారు చేస్తూ వంటగదిలో నిలబడి ఉంది. ఇంతలో ఆమె భర్త ఈ దృశ్యాన్ని కెమెరాలో బంధించడానికి వచ్చాడు. ఆమె భర్త వీడియో రికార్డింగ్ చేస్తుండగా.. ఇద్దరూ ఒకరినొకరు ఆటపట్టించుకుంటూ ఉన్నారు.

Viral Video: స్వదేశీ టీ చేసిన విదేశీ కోడలు .. ఒక అందమైన పొరపాటుతో వీడియో వైరల్..
Tea Making Video
Surya Kala
|

Updated on: Apr 03, 2023 | 3:17 PM

Share

ప్రేమకు ఎల్లలు ఉండవు. పేద గొప్ప అనే బేధాలుండవు. యువతీయువకుల మధ్య  ప్రేమకు హద్దులు ఉండవని.. ఎవరూ బంధించలేరని అంటారు. గత కొన్ని ఏళ్లుగా భారతీయ యువతీయువకులు తమ మనసుకు నచ్చిన మది మెచ్చిన విదేశీ యువతీయువకులను ప్రేమించి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుంటున్నారు. దీంతో అనేక భారతీయ కుటుంబాల్లో విదేశీ కోడళ్లు, విదేశీ కోడళ్లు ఉంటున్నారు. కొన్ని పరిచయాలు ఆన్ లైన్ జరిగితే.. మరికొన్ని పరిచయాలు ఉద్యోగాలు చేసే సమయంలో జరుగుతున్నాయి. అయితే తాజాగా ఓ విదేశీ కోడలకు చెందిన ఓ వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. భారతదేశానికి చెందిన యువకుడిని ప్రేమించి పెళ్లి చేసుకున్న ఓ జర్మనీ యువతి దేశీ స్టైల్‌లో తనను తాను మలచుకుంది .

వైరల్ అవుతున్న ఈ వీడియోలో కనిపిస్తున్న యువతి పేరు జూలీ శర్మ. భారతీయ వ్యక్తిని వివాహం చేసుకుంది. రెండేళ్లుగా రాజస్థాన్ లోని జైపూర్‌లో నివస్తోంది. జూలీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో  తరచుగా వీడియోలు షేర్ చేస్తూ ఉంటుంది. ఆమెకు ఇంటర్నెట్‌లో మంచి  ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియోకు 3.3 మిలియన్లకు పైగా లైక్‌లు వచ్చాయంటే జూలీ ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఏ రేంజ్ లో ఉందో అర్ధం చేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

వైరల్ అవుతున్న వీడియోలో.. జూలీ తన భర్త కోసం టీ తయారు చేస్తూ వంటగదిలో నిలబడి ఉంది. ఇంతలో ఆమె భర్త ఈ దృశ్యాన్ని కెమెరాలో బంధించడానికి వచ్చాడు. ఆమె భర్త వీడియో రికార్డింగ్ చేస్తుండగా.. ఇద్దరూ ఒకరినొకరు ఆటపట్టించుకుంటూ ఉన్నారు. అయితే టీ మరిగిపోతుంది. అది గమనించిన జూలీ భర్త ఆమెను హెచ్చరించాడు. ఆ తర్వాత జూలీ మనోహారంగా చిరునవ్వు నవ్వుతూ తన తప్పును దాచడానికి ప్రయత్నిస్తూ.. భర్తని చిన్నగా కొట్టడానికి ట్రై చేసింది. అప్పుడు అతను జూలీ కి అందకుండా పరిగెత్తాడు.

ఈ ఫన్నీ వీడియోను నమస్తేజూలీ అనే ఖాతా ద్వారా  ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. చాలా మంది యూజర్లు ఈ వీడియో చాలా ఫన్నీగా ఉందని అంటున్నారు. ఈ విదేశీ మహిళ ఎంత అందంగా ఉందో .. భారతీయ సంప్రదాయాన్ని అనుసరిస్తూ.. పెద్ద బొట్టు చీరకట్టుతో అలరిస్తుంది అని కామెంట్ చేశారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వైరల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..