AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఛీ.. ఛీ.. నువ్వేం ఆఫీసర్‌వి.. తల్లి చనిపోయిందని చెబితే ఏమన్నాడో తెలుసా..?

ఆఫీస్ లో సీనియర్ అధికారులకు తమ కింద పని చేసే ఉద్యోగులంటే లోకువ అని.. ఉద్యోగుల పట్ల అమానుషంగా ప్రవర్తిస్తారని.. ముఖ్యంగా ఏదైనా సందర్భంలో సెలవు అడిగినప్పుడు అయితే ఉద్యోగమా.. సెలవా అనే కండిషన్ పెడతారనే వార్తలు తరచుగా వైరల్ అవుతూనే ఉన్నాయి. అయితే ఇప్పుడు ఒక బ్యాంక్ సీనియర్ ఆఫీసర్ తన కింద ఉద్యోగి తల్లి మరణించింది సెలవు ఇవ్వమని అడిగినప్పుడు.. చెప్పిన సమాధానం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఈ మెయిల్ స్క్రీన్ షాట్ చూసి నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఛీ.. ఛీ.. నువ్వేం ఆఫీసర్‌వి.. తల్లి చనిపోయిందని చెబితే ఏమన్నాడో తెలుసా..?
Viral News
Surya Kala
|

Updated on: Sep 30, 2025 | 3:00 PM

Share

ఒక బ్యాంక్ సీనియర్ అధికారి తన అధికారాన్ని దుర్వినియోగం చేయడమే కాదు అమానవీయ ప్రవర్తనకు పాల్పడ్డారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంతర్గత ఇమెయిల్ స్క్రీన్ షాట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిని చూసిన నెటిజన్లు సీనియర్ మేనేజర్‌ తీరుని తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఈ ఇమెయిల్‌లో ఒక బ్యాంక్ ఉద్యోగి ఆర్‌బిఐకి ట్యాగ్ చేశాడు. యూకో బ్యాంక్ చెన్నై జోనల్ హెడ్ ఆర్.ఎస్. అజిత్‌పై వెంటనే చర్య తీసుకోవాలని డిమాండ్ చేశాడు. ఈ ఇమెయిల్‌లో ఏముందో తెలిస్తే మీరు కూడా షాక్ తింటారు.

చెన్నై జోనల్ హెడ్ తన కింద పని చేసే బ్యాంకు ఉద్యోగుల పట్ల క్రూరంగా, అమానవీయంగా ప్రవర్తిస్తారని ఆ మెయిల్ ఆరోపిస్తోంది. అతని ప్రవర్తన విషపూరితమైనది, నియంతృత్వంతో కూడుకున్నదని చెబుతున్నారు. జోనల్ హెడ్ దగ్గర పని చేసే వాతావరణం భయం భయంగా ఉంటుందని.. నిరంతరం వేధింపులతో సాగుతుందని ఉద్యోగి ఆరోపిస్తున్నాడు. తమ హెడ్ సాటి ఉద్యోగులను కనీసం ఉద్యోగస్తుల కూడా చూడడాని.. తన కింద పని చేసే వారిగా.. తనకు లోబడి ఉన్నట్లుగా ఉద్యోగస్తులను చూస్తాడు. ఉద్యోగులను అవమానిస్తాడని పేర్కొన్నాడు. ఎవరైనా సెలవు అడిగితే సెలవు అభ్యర్థనని పట్టించుకోడని.. సెలవు ఇవ్వడంటూ ఆరోపిస్తున్నాడు. అంతేకాదు ఏ ఉద్యోగికి ఏ సందర్భంలో సెలవు రిజెక్ట్ చేశాడో కూడా పేర్కొన్నాడు.

ఇవి కూడా చదవండి

ఒక ఉద్యోగి తల్లి ఐసియులో ఉన్నప్పుడు.. సెలవు ఇచ్చే ముందు తిరిగి ఎప్పుడు వచ్చావో ఖచ్చితంగా చెప్పమని అధికారి అడిగారని ఉద్యోగి అనేక సందర్భాలను ఉదహరించారు. మరొక సందర్భంలో ఒక ఉద్యోగి తల్లి మరణించినప్పుడు.. అతను సెలవు అడిగితే.. జోనల్ హెడ్ అజిత్ “ప్రతి ఒక్కరి తల్లి చనిపోతుంది. నటించడం మానేయండి.. వాస్తవంలో జీవించండి.. వెంటనే విధుల్లో తిరిగి చేరండి.. లేకపోతే, నేను మీకు LWP మార్క్ చేస్తాను” అని చెప్పాడని ఆరోపించారు.

అదేవిధంగా ఒక బ్రాంచ్ చీఫ్ ఏడాది వయసున్న కుమార్తె ఆసుపత్రిలో చేరినప్పుడు, ఒక అధికారి భార్యకు అత్యవసర పరిస్థితి ఏర్పడినా సెలవు అడిగి అవమానానికి గురయ్యారని.. దీంతో వారు తమ కుటుంబ అత్యవసర పరిస్థితుల కంటే ఆఫీసుకి రావడానికే ప్రాధాన్యత ఇవ్వాల్సి వచ్చిదని చెప్పాడు.

ఆన్‌లైన్‌లో వైరల్ అవుతున్న ఈ పోస్ట్ ప్రజలను ఆగ్రహానికి గురిచేసింది, క్రమశిక్షణ ముసుగులో జరుగుతున్నా క్రూరత్వాన్ని చాలామంది ఖండించారు. ఆఫీసర్ ప్రవర్తన చాలా క్రూరంగా, ఆమోదయోగ్యం కానిదిగా ఉందని అభివర్ణించారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆర్థిక సేవల విభాగం , ఆర్థిక మంత్రిత్వ శాఖతో సహా నియంత్రణ అధికారులను ట్యాగ్ చేస్తూ.. తక్షణ చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. అయితే ప్రస్తుతం, యుకో బ్యాంక్, దాని చెన్నై జోనల్ ఆఫీసు ఈ ఆరోపణలపై స్పందించలేదు. అధికారికంగా ఎటువంటి ప్రకటన జారీ చేయలేదు.

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..