AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch: గుడ్లతో వేస్తున్న రోడ్లు.. వందేళ్లైనా చెక్కుచెదరవట..! వీడియోలు వైరల్‌.. ఎక్కడంటే..

గుడ్లు మంచి పౌషికాహారం. అందుకే ప్రతిరోజు ఒక గుడ్డు తినమని పోషకాహార నిపుణులు, వైద్యులు చెబుతుంటారు. అయితే, కొంతమంది వాటిని ఉడకబెట్టి తింటారు. మరికొందరు వాటితో ఆమ్లెట్‌, కర్రీ చేసుకుని తింటారు. కానీ గుడ్లను రోడ్లు నిర్మించడానికి ఉపయోగించవచ్చని మీరు ఎప్పుడైనా విన్నారా? అవును, మేము తమాషా చేయడం లేదు. గుడ్లతో తయారు చేసిన రోడ్డుకు మరే ఇతర సిమెంట్‌, కాంక్రీట్‌ రోడ్డు పోటీగా ఉండలేదని పేర్కొంటూ సోషల్ మీడియాలో అనేక పోస్ట్‌లు వైరల్ అవుతున్నాయి.

Watch:  గుడ్లతో వేస్తున్న రోడ్లు.. వందేళ్లైనా చెక్కుచెదరవట..! వీడియోలు వైరల్‌.. ఎక్కడంటే..
Eggshell Powder In Concrete
Jyothi Gadda
|

Updated on: Sep 30, 2025 | 2:48 PM

Share

మన దేశంలో చాలా చోట్ల రోడ్లు నిర్మించగానే కూలిపోవడం, గుంతలమయంగా మారటం మనం చూస్తుంటాం. కానీ చైనా రోడ్లు.? అవి ఏళ్ల తరబడి ఒక్క పగులు కూడా లేకుండా మెరుస్తాయి! రహస్యం ఏమిటి అంటే.. గుడ్లు! అవును, మీరు చదివింది నిజమే. సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్న వీడియోలు ఇదే చెబుతున్నాయి. చైనీస్ ఇంజనీర్లు గుడ్డు పెంకులను మెత్తని పొడిగా రుబ్బి కాంక్రీట్ మిశ్రమంలో కలుపుతారని, దీనివల్ల రోడ్లు సూపర్ స్ట్రాంగ్‌గా ఉంటాయని పేర్కొంటున్నాయి. ఈ వార్త ఆశ్చర్యకరమైనది మాత్రమే కాదు, పర్యావరణ దృక్కోణం నుండి కూడా విప్లవాత్మకమైనది. కానీ, ఇది కేవలం వైరల్ వార్తనా..? లేదంటే వాస్తవమా? పూర్తి డిటెల్స్‌ ఇక్కడ చూద్దాం..

#EggRoadChina అనేది Instagram, TikTok వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ట్రెండ్ అవుతోంది. గుడ్లను రోడ్లపైకి విసిరి ఆపై వాటిపై రోడ్డును నిర్మిస్తున్నట్లు చూపించే వీడియో ఇక్కడ వైరల్‌ అవుతోంది. వారి అధ్యయనాల ప్రకారం.. గుడ్డు పెంకుల్లో కాల్షియం కార్బోనేట్ ఉంటుంది. ఇది సిమెంట్‌ను బలపరుస్తుంది. పగుళ్లను నివారిస్తుంది. ఈ చైనీస్ ఆవిష్కరణ కొత్తదేమీ కాదు. బీజింగ్ విశ్వవిద్యాలయంలోని శాస్త్రవేత్తలు గుడ్డు పెంకు పొడి కాంక్రీటు బలాన్ని అనేక రెట్లు పెంచుతుందని చూపించే అధ్యయనాన్ని ప్రచురించారు. ఈ పదార్థం చౌకగా ఉండటమే కాకుండా వ్యర్థాలను కూడా తగ్గిస్తుంది. ఈ వీడియోకు లక్షలాది వ్యూస్‌ వచ్చాయి.

ఇవి కూడా చదవండి

వీడియో ఇక్కడ చూడండి..

View this post on Instagram

A post shared by Totalworld (@totalworld580)

వ్యర్థాలను సరిగ్గా ఉపయోగించడం:

చైనా ప్రతి సంవత్సరం బిలియన్ల కొద్దీ గుడ్లను ఉత్పత్తి చేస్తుంది. వాటి పెంకులు ఒకప్పుడు వ్యర్థాలుగా మారేవి. ఇప్పుడు, వీటిని రోడ్లు నిర్మించడానికి రీసైకిల్ చేస్తున్నారు. ఉదాహరణకు, షాంఘై-పుడాంగ్ ఎక్స్‌ప్రెస్‌వే 50 కిలోమీటర్ల విభాగం ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నిర్మించబడింది. ఇది నిర్వహణ లేకుండానే ఉంది. ఇది ఆ రోడ్డు జీవితాన్ని 30 నుండి 50 సంవత్సరాలకు పెంచిందని చైనా ప్రభుత్వ నివేదికలు సూచిస్తున్నాయి. పర్యావరణ మంత్రిత్వ శాఖ దీనికి గ్రీన్ కన్స్ట్రక్షన్ అవార్డును ప్రదానం చేసింది.

IIT ఢిల్లీలో ప్రొఫెసర్ డాక్టర్ రాజేష్ కుమార్ మాట్లాడుతూ, గుడ్డు పొడి వంటి ఆవిష్కరణలను భారతదేశంలో కూడా అమలు చేయవచ్చు అన్నారు.. మన దేశం ప్రపంచంలోనే అతిపెద్ద గుడ్డు ఉత్పత్తిదారు, ఏటా 1 మిలియన్ టన్నుల గుడ్డు పెంకు వ్యర్థాలను ఉత్పత్తి చేస్తుంది. ఈ గుడ్లను రీసైక్లింగ్ చేయడం వల్ల రోడ్లు బలోపేతం అవుతాయి. కాలుష్యం తగ్గుతుంది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి…

నేను ఇప్పుడు తెలంగాణ వాన్ని: వెంకయ్య నాయుడు
నేను ఇప్పుడు తెలంగాణ వాన్ని: వెంకయ్య నాయుడు
అమ్మాయికి మొగుడు... అత్తకు యముడు... ఏకంగా గొంతు కోసి..
అమ్మాయికి మొగుడు... అత్తకు యముడు... ఏకంగా గొంతు కోసి..
గురు, శుక్రుల అనుకూలత.. ఆ రాశుల వారికి హద్దుల్లేని సంపద ఖాయం..!
గురు, శుక్రుల అనుకూలత.. ఆ రాశుల వారికి హద్దుల్లేని సంపద ఖాయం..!
మెస్సీ వచ్చిన ఆ రోజు కోల్‌కతా స్టేడియంలో ఏం జరిగింది ?
మెస్సీ వచ్చిన ఆ రోజు కోల్‌కతా స్టేడియంలో ఏం జరిగింది ?
కొత్త ఏడాది ఈ రాశుల వారి కుటుంబాల్లో భారీగా శుభ కార్యాలు..!
కొత్త ఏడాది ఈ రాశుల వారి కుటుంబాల్లో భారీగా శుభ కార్యాలు..!
రైతన్నలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇకపై నేరుగా ఇంటికే యూరియా!
రైతన్నలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇకపై నేరుగా ఇంటికే యూరియా!
టీ20 వరల్డ్ కప్ టికెట్‌ను మెస్సీకి బహూకరించిన ఐసీసీ ఛైర్మన్ జై షా
టీ20 వరల్డ్ కప్ టికెట్‌ను మెస్సీకి బహూకరించిన ఐసీసీ ఛైర్మన్ జై షా
సమాధులే ఇంటి దేవతలు.. ఏపీలోని ఈ వింత గ్రామం గురించి మీకు తెలుసా
సమాధులే ఇంటి దేవతలు.. ఏపీలోని ఈ వింత గ్రామం గురించి మీకు తెలుసా
కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.20 లక్షల వరకు లోన్.. పొందండిలా..
కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.20 లక్షల వరకు లోన్.. పొందండిలా..
ఈ ఫొటోలో ఒక టాలీవుడ్ హీరోయిన్ కూడా ఉంది.. గుర్తు పట్టండి చూద్దాం
ఈ ఫొటోలో ఒక టాలీవుడ్ హీరోయిన్ కూడా ఉంది.. గుర్తు పట్టండి చూద్దాం