- Telugu News Photo Gallery Spiritual photos Shani Gochar on diwali 2025 in pisces, these zodiac sign get good luck
Shani Gochar: దీపావళి నాడు తిరోగమనంలో శనీశ్వరుడు.. ఈ మూడు రాశుల భవితవ్యం దేదీప్యమానం..
దీపావళి పండగ సమయంలో ప్రతిచోటా సంతోషకరమైన వాతావరణం కనిపిస్తుంది. అయితే ఈ సంవత్సరం దీపావళి కొన్ని రాశుల వారికి నిజంగా శుభప్రదంగా ఉండబోతోంది. ఎందుకంటే దీపావళి నాడు శని గ్రహం తిరోగమనం కారణంగా కొన్ని రాశుల వారి జాతకంలో గణనీయమైన మార్పులు సంభవిస్తాయి. దీంతో వీరి భవితవ్యం దేదీప్యమానంగా ప్రకాశిస్తుంది. కొత్త ఉద్యోగం, అపారమైన ఆర్థిక లాభం పొందే అవకాశం ఉంది.
Updated on: Sep 30, 2025 | 1:52 PM

వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం గ్రహాలు తమ రారాశులను మార్చుకుంటూ కాలానుగుణంగా ప్రత్యక్షంగా లేదా తిరోగమన కదలికలలో కదులుతాయి. దీని ప్రభావం ప్రపంచంలోని ప్రతి ఒక్కరిపై కనిపిస్తుంది. ఈ ఏడాది దీపావళి పండగ రోజున నవ గ్రహాలలో అత్యంత నెమ్మదిగా కదిలే శనీశ్వరుడు తిరోగమనంలో సంచరిస్తాడు. జ్యోతిష్య శాస్త్రంలో శానీశ్వరుడిని న్యాయమూర్తి, కర్మ ఫలదాత అని అంటారు. ఈనేపధ్యంలో అక్టోబర్ 20న దీపావళి రోజున శనిదేవుడు తిరోగమనంలో మీన రాశిలో సంచరిస్తాడు.

ఈ ఏడాది దీపావళి రోజున శని తిరోగమనంలో ఉండటం వల్ల కొన్ని రాశుల వ్యక్తుల జీవితంలో అదృష్టంలో గణనీయమైన మార్పులు కనిపిస్తాయి. వీరు అపార సంపదను పొందుతారు. దీపావళి నాడు శని తిరోగమనంలో ఉండటం వల్ల ఏ రాశులకు ఎక్కువ ప్రయోజనం చేకూరుతుందో ఈ రోజు తెలుసుకుందాం..

మిథున రాశి: మిథున రాశి వారికి శని తిరోగమనం చాలా శుభప్రదంగా , అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో ఉద్యోగస్తులకు అనేక కొత్త అవకాశాలు లభిస్తాయి. జ్యోతిషశాస్త్రం ప్రకారం శనీశ్వరుడు మిథున రాశిలో, కర్మ గృహంలో తిరోగమనం చెందాడు. అందువల్ల ఈ కాలంలో ఈ రాశికి చెందిన వ్యక్తుల కెరీర్ , వ్యాపారంలో గణనీయమైన పురోగతిని పొందే అవకాశం ఉంది. ఉద్యోగం ప్రయత్నం చేస్తున్నవారికి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. వ్యాపారస్తులు లాభాలను పొందే అవకాశం ఉంది. వీరు గణనీయమైన ఆర్థిక లాభాలను పొందుతారు. జీవితం ఆనందం, శాంతితో నిండి ఉంటుంది.

కుంభ రాశి: ఈ రాశికి చెందిన వారికి శని తిరోగమనం చాలా శుభప్రదంగా, సానుకూలంగా ఉంటుంది. ఈ రాశిలో సంపద , వాక్కులకు నిలయం అయిన స్థానంలో శని తిరోగమనంలో ఉన్నాడు. దీంతో వీరు ఆకస్మిక ఆర్థిక లాభాలను పొందే అవకాశం ఉంది. ఈ సమయంలో వీరి ఆర్థిక పరిస్థితి గణనీయమైన మెరుగుదలలో ఉంటుంది. తమ మాటల ద్వారా ప్రజలను గణనీయంగా ప్రభావితం చేయగలరు. వీరిలో ధైర్యం, శౌర్యం పెరుగుతుంది. వ్యాపారస్తులకు ఈ సమయంలో మంచి ఒప్పందం కుదిరే అవకాశం ఉంది.

మకర రాశి: మకర రాశి వారికి శని తిరోగమనం సానుకూల ఫలితాలను తెస్తుంది. ఈ రాశిలోని మూడవ ఇంట్లో శని తిరోగమనంలో ఉన్నాడు. ఇది వీరి వృత్తి, వ్యాపారానికి గణనీయమైన ప్రయోజనాలను తెస్తుంది. ఈ సమయంలో ఆస్తి లేదా వాహనం కొనాలని ఆలోచిస్తున్న వారికి సులభంగా అవకాశాలను తెస్తుంది. వైవాహిక జీవితంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి ఈ సమయంలో ఇబ్బందులు తీరతాయి. వైవాహిక జీవితం సంతోషంగా మారుతుంది.




