- Telugu News Photo Gallery Spiritual photos Budhaditya yoga on mahanavami 2025 these zodiac signs will get benefits
మహానవమి రోజున అరుదైన గ్రహ సంయోగం.. ఈ మూడు రాశులపై అమ్మ కృప.. స్వర్ణకాలం ప్రారంభం
ఈ ఏడాది నవరాత్రి వేడుకలను పది రోజుల పాటు జరుపుకుంటున్నారు. రేపు (అక్టోబర్ 1, 2025) నవరాత్రిలో తొమ్మిదో రోజు.. దీనిని మహానవమిగా జరుపుకుంటున్నారు. ఈ రోజున దేశవ్యాప్తంగా ఉన్న అమ్మవారి ఆలయాలలో విశేషమైన పూజలను నిర్వహిస్తారు. ఈ రోజున దుర్గాదేవిని పూజించడం వల్ల భక్తులకు ఆనందం, శ్రేయస్సు లభిస్తుందని నమ్ముతారు. అయితే మహా నవమి రోజున అరుదైన గ్రహ సంయోగం ఏర్పడనుంది. దీంతో మూడు రాశులపై అమ్మ విశేషమైన అనుగ్రహం చూపిస్తుంది.
Updated on: Sep 30, 2025 | 5:22 PM

ఈ సంవత్సరం మహానవమిని అక్టోబర్ 1, 2025న జరుపుకోనున్నారు. ఈ రోజున దేశవ్యాప్తంగా ఉన్న అమ్మవారి భక్తులు మండపాల్లో, అమ్మవారి దేవాలయాలలో ప్రత్యేక పూజలను నిర్వహిస్తారు. అయితే ఈ సంవత్సరం, జ్యోతిషశాస్త్ర దృక్పథంలో మహానవమి విశేషమైన రోజు. మహా నవమి రుదైన గ్రహ సంయోగం ఏర్పడనుంది. నవ గ్రహాల రాజు అయిన సూర్యుడు, గ్రహాల యువరాజు బుధుడు కలిసి బుధాదిత్య యోగాన్ని సృష్టిస్తున్నారు.

బుధుడు తన సొంత రాశి అయిన కన్య రాశిలో ఉన్నాడు. దీంతో భద్ర రాజ్యయోగం ఏర్పడింది. అదే సమయంలో ఆనందం, అదృష్టానికి కారణమైన గ్రహం శుక్రుడు కూడా బృహస్పతితో అర్ధకేంద్ర యోగాన్ని ఏర్పరుస్తున్నాడు. తత్ఫలితంగా మహానవమి రోజున ఈ అరుదైన గ్రహాల సంయోగం కారణంగా అమ్మ కృపతో కొన్ని రాశులకు స్వర్ణ కాలం ప్రారంభం అవుతుంది. ఆ అదృష్ట రాశులు ఏమిటో తెలుసుకుందాం.

సింహ రాశి: ఈ సమయం సింహ రాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. పెండింగ్ పనులు పూర్తవుతాయి. కొత్త పరిచయాలతో వ్యాపార ప్రయోజనాలను పొందుతారు. డబ్బులను పొదుపు చేస్తారు. ప్రభావవంతమైన వ్యక్తులతో పరిచయం ఏర్పడి.. కెరీర్‌కు కొత్త దిశానిర్దేశం లబిస్తుంది. ఏ పని చేయడం మొదలు పెట్టినా విజయం సాధిస్తారు. స్నేహితులు, కుటుంబ సభ్యుల మధ్య సంబంధాలు మెరుగుపడతాయి. ఆర్థిక సమతుల్యతను పొందుతారు. వ్యాపారస్తులకు, ఎందులోనైనా పెట్టుబడి పెట్టాలన్నా ఈ సమయం ప్రయోజనకరంగా ఉంటుంది.

కన్య రాశి: కన్య రాశి వారికి ఈ సమయం కొన్ని సానుకూల ఫలితాలతో నిండి ఉంటుంది. ఇంట్లో బయట బంధువుల నుంచి మద్దతు, సహకారం లభిస్తుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వ్యాపారంలో అడ్డంకులను తొలగించడంలో విజయం సాధిస్తారు. ఇంట్లో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. అంతేకాదు కుటుంబ సభ్యులందరూ కలిసి వేడుకలను జరుపుకుంటారు. ఎప్పటి నుంచి రాకుండా చిక్కుల్లో ఉన్న డబ్బు పొందే అవకాశం ఉంది. వాహనం కొనాలనే వీరి కల నెరవేరుతుంది.

మకర రాశి: ఈ సమయం మకర రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. పని తీరు మెరుగుపడుతుంది. వ్యాపారంలో పెద్ద మార్పు ఉంటుంది. ఆఫీసులో ఒక కొత్త ప్రాజెక్టులో భాగం అవుతారు. భవిష్యత్తులో వీరికి ప్రయోజనాలు లభిస్తాయి. ఈ రాశికి చెందిన విద్యార్థులకు కూడా ఈ సమయం ఫలవంతం. పరీక్షలు, పోటీలకు సిద్ధమవడంలో విజయం సాధిస్తారు. త్వరలో మంచి ఫలితాలను పొందుతారు. సంబంధాలలో ప్రేమ ఉంటుంది. శుభవార్త వింటారు.




