Baba Vanga: భయపెడుతున్న బాబా వంగా భవిష్యత్ అంచనాలు.. 2026లో జరిగేది ఇదే..
బల్గేరియాకు చెందిన బాబా వంగా చెప్పిన మాటలు మళ్లీ చర్చనీయాంశంగా మారాయి. గతంలో 9/11 దాడులు, సోవియట్ యూనియన్ విడిపోవడం వంటివి నిజమని చెప్పిన ఆమె, తాజాగా 2026 - 2028 మధ్య జరగబోయే ముఖ్య విషయాలు వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా మూడో ప్రపంచ యుద్ధం వచ్చే అవకాశం ఉందని హెచ్చరించారు. అలాగే, చైనా అమెరికాను అధిగమిస్తుందని, సైన్స్‌లో పెద్ద మార్పులు వస్తాయని చెప్పారు.

బల్గేరియాకు చెందిన బాబా వంగా ప్రపంచంలో చాలా విషయాలు ముందే చెప్పి ప్రసిద్ధి చెందారు. అందుకే ఆమెను బాల్కన్ ప్రాంత నోస్ట్రాడమస్ అని కూడా అంటారు. 1996లో 86 ఏళ్ల వయసులో కన్నుమూసి చాలా సంవత్సరాలు అవుతున్నా, ఆమె చెప్పిన మాటలు ఇప్పటికీ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. 12 ఏళ్ల వయసులో కళ్ళు పోయిన ఆమె, 9/11 దాడులు, సోవియట్ యూనియన్ విడిపోవడం లాంటి పెద్ద విషయాలు నిజమవుతాయని ముందే చెప్పారు. బాబా వంగా అంచనాలు మరోసారి చర్చనీయాంశమయ్యాయి.
తాజాగా బాబా వంగా 2026 సంవత్సరానికి సంబంధించి చేసిన కొత్త అంచనాలు ప్రజల్లో భయాన్ని పెంచుతున్నాయి. బాబా వంగా 2026-2028 మధ్య కాలానికి సంబంధించి అనేక కీలక అంచనాలు వేశారు. రాబోయే సంవత్సరాల్లో ప్రపంచవ్యాప్తంగా మూడో ప్రపంచ యుద్ధం తలెత్తే అవకాశం ఉందని ఆమె అంచనా వేశారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంతో సహా ప్రపంచంలోని అనేక దేశాల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ అంచనా ప్రజలను మరింత భయపెడుతోంది.
ఆర్థికంగా, సైనికపరంగా చైనా దేశం అమెరికాను అధిగమించి అగ్రస్థానానికి చేరుకుంటుందని చెప్పారు. సైన్స్‌లో గణనీయమైన పురోగతి ఉంటుందని బాబా వంగా తెలిపారు. 2026 – 2028 మధ్య ప్రపంచవ్యాప్తంగా ఆకలి సమస్య సమూలంగా అంతమవుతుందని బాబా వంగా అంచనా వేశారు.. ఇది సానుకూల అంశంగా కనిపిస్తోంది.
బాబా వంగా భారతదేశానికి సంబంధించిన కొన్ని భయంకరమైన ప్రకృతి వైపరీత్యాలను కూడా అంచనా వేశారు. దేశంలో తీవ్రమైన వరదలు, కొండచరియలు విరిగిపడటం, రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతాయని ఆమె అంచనా వేశారు. దేశంలోని అనేక ప్రధాన నగరాలు తీవ్రమైన నీటి కొరతను ఎదుర్కొంటాయని, ఇది రాజకీయాలపై కూడా ప్రభావం చూపుతుందని తెలిపారు. బాబా వంగా చెప్పిన ఈ విషయాలు చాలా మందిని ఆలోచింపజేస్తున్నాయి. ఆమె చెప్పినవి నిజమవుతాయా లేదా అనేది కాలమే నిర్ణయించాలి.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..
