YS Sharmila: తెలంగాణలో సమస్యలు లేవని నిరూపిస్తే.. నా ముక్కు నేలకు రాస్తా: వైఎస్ షర్మిల
YS Sharmila Praja Prasthanam Padayatra: తెలంగాణలో వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చేపట్టిన పాదయాత్ర చేవెళ్లనుంచి ప్రారంభమైంది. వైఎస్ విజయమ్మ షర్మిల చేపట్టిన పాదయాత్రను
YS Sharmila Praja Prasthanam Padayatra: తెలంగాణలో వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చేపట్టిన పాదయాత్ర చేవెళ్లనుంచి ప్రారంభమైంది. వైఎస్ విజయమ్మ షర్మిల చేపట్టిన పాదయాత్రను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో వైఎస్ షర్మిల ప్రభుత్వంపై విమర్శలు చేశారు. సీఎం కేసీఆర్ అహంకారం దించేందుకే పాదయాత్ర చేస్తున్నట్లు వైఎస్‌ఆర్‌టీపీ అధినేత్రి షర్మిల ప్రకటించారు. వైఎస్సార్ చేసిన ప్రజాప్రస్థానం పాదయాత్ర ఒక చరిత్ర అని షర్మిల పేర్కొన్నారు. ఇదే చేవెళ్ల నుంచి 18 ఏళ్ల క్రితం వైఎస్సార్ తొలి అడుగు పడిందని గుర్తుచేశారు. తెలంగాణలోని ప్రతి పల్లెకు వస్తానని.. వారితో మమేకం అవుతానని షర్మిల ప్రకటించారు. తెలంగాణలో సమస్యలు లేవని నిరూపిస్తే.. తన ముక్కు నేలకు రాస్తానంటూ షర్మిల పేర్కొన్నారు. తాను మాట్లాడిన తర్వాతే ఉద్యోగాలు గుర్తుకువచ్చాయంటూ షర్మిల పేర్కొన్నారు.
కేసీఆర్ కుటుంబ పాలన అంతానికే ఈ పాదయాత్ర చేస్తున్నట్లు స్పష్టం చేశారు. కేసీఆర్ అవినీతిని బయట పెడతానని.. కేసీఆర్‌కు అమ్ముడుపోయిన కాంగ్రెస్‌ను చీల్చి చెండాడుతానంటూ షర్మిల పేర్కొ్న్నారు. వందల మంది నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్నారని.. కళ్లముందు 1.90లక్షల ఉద్యోగాలు కనిపించినా నోటిఫికేషన్లు లేవంటూ ఆవేదన వ్యక్తంచేశారు. నిరుద్యోగులు హమాలీలుగా మారారని.. ఏడేళ్లలో 30 వేల ఉద్యోగాలు పీకేశారంటూ షర్మిల పేర్కొన్నారు. తెలంగాణలో దళితులపై దాడులు పెరిగాయన్నారు. మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని.. బీసీలకు ప్రభుత్వం ఏం చేసిందో చెప్పాలంటూ పేర్కొన్నారు. నిజంగా తెలంగాణలో సమస్యలు లేకుంటే తన ముక్కు నేలకు రాస్తానని.. సమస్యలుంటే రాజీనామా చేసి దళితుడిని సీఎం చేయాలి అంటూ షర్మిల డిమాండ్ చేశారు. అనంతరం షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్ర ప్రారంభమైంది.
Also Read: