Telangana Police: పోలీసు సేవలపై.. తెలంగాణ విద్యార్థులకు ఆన్‌లైన్ వ్యాస రచన, ఫోటోగ్రఫీ పోటీలు.. ఎంట్రీలు ఇలా పంపండి
విధి నిర్వహణలో ప్రాణాలను అర్పించిన ధైర్యవంతులైన పోలీసులను స్మరించుకుంటూ అక్టోబర్ 21 న తెలంగాణ పోలీస్ శాఖ "పోలీస్ ఫ్లాగ్ డే" జరుపుకుంటోంది.
Police Flag Day: విధి నిర్వహణలో ప్రాణాలను అర్పించిన ధైర్యవంతులైన పోలీసులను స్మరించుకుంటూ అక్టోబర్ 21 న తెలంగాణ పోలీస్ శాఖ “పోలీస్ ఫ్లాగ్ డే” జరుపుకుంటోంది. ఈ సందర్భంగా తెలంగాణ ప్రాంత విద్యార్థులకు ఆన్‌లైన్ వ్యాస రచన, ఫోటోగ్రఫీ పోటీలు నిర్వహించనున్నారు.
తెలంగాణ రాష్ట్ర విద్యార్థులు (8 వ తరగతి నుండి గ్రాడ్యుయేషన్ వరకు) తెలంగాణ పోలీస్ నిర్వహించే ఆన్‌లైన్ వ్యాస రచన పోటీలో( తెలుగు / ఉర్దూ / ఇంగ్లీషులో) పాల్గొనవలసినదిగా ఓ ప్రకటనలో తెలంగాణ పోలీస్ శాఖ కోరింది. అక్టోబర్ 24 తేదీ లోపు విద్యార్థులు వారి వ్యాసాలను సమర్పించాల్సి ఉంటుంది.
వ్యాస రచన అంశం(Topic): “జాతి నిర్మాణంలో పోలీసుల పాత్ర”.
ఇది 3 విభాగాలలో నిర్వహించబడుతుంది. మొదటి విభాగం: 8 నుంచి 10 వ తరగతి విద్యార్థులు రెండవ విభాగం: ఇంటర్మీడియట్ విద్యార్థులు మూడవ విభాగం: డిగ్రీ విద్యార్థులు
మీ వ్యాసాన్ని ఆన్‌లైన్‌లో సమర్పించడానికి క్రింది పద్దతిని(steps) అనుసరించండి:
1. సబ్మిట్ చేయటానికి ఈ క్రింది లింక్‌పై క్లిక్ చేయండి. https://forms.gle/HvF8YAgewvyD3wjA9 2. మీ పేరు, తరగతి మరియు ఇతర వివరాలను నమోదు చేయండి 3. మీ వ్యాసాన్ని పేర్కొన్న ప్రదేశంలో 300 పదాలకు మించకుండా సమర్పించండి.
అలాగే ఫోటోగ్రఫీ పోటీలకు ఎంట్రీలను ఈ దిగువ లింక్ ద్వారా అక్టోబర్ 28 వరకు పంపాలి. పోలీసుల సేవలకు సంబంధించిన ఆకర్షణీయమైన ఫోటోలను ఈ పోటీల్లో పాల్గొనే విద్యార్థులు పంపాలి.
https://forms.gle/uJj58xXN1GQPNjp8A
జిల్లా / కమిషనరేట్‌లో ఎంపిక చేసిన ఉత్తమ మూడు వ్యాసాలకు సంబంధిత పోలీసు సూపరింటెండెంట్ / పోలీసు కమీషనర్లు బహుమతి ప్రదానం చేస్తారు మరియు ఆ వ్యాసాలను సంబంధిత జిల్లా / కమిషనరేట్ అధికారిక సోషల్ మీడియా పేజీలలో పోస్ట్ చేయడం జరుగుతుంది.
అన్ని జిల్లా / కమిషనరేట్ల స్థాయిలలో బహుమతులు గెలుపొందిన వ్యాసాలలో నుండి ఉత్తమ మూడు వ్యాసాలను “రాష్ట్రంలోని మొదటి మూడు ఉత్తమ వ్యాసాలు” గా ఎంపిక చేసి, తెలంగాణ రాష్ట్ర పోలీసు అధికారిక సోషల్ మీడియా పేజీలలో పోస్ట్ చేయటం జరుగుతుంది.
Also Read..