Nallamala Forest: నల్లమల అడవుల్లో అలజడి.. 25 ఏళ్ల యువతి అదృశ్యం.. ఇంతకీ ఆమె ఏమైనట్లు..?
నల్లమల అడవులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి...సలేశ్వరం జాతరలో ఓ మహిళ అదృశ్యం అయ్యింది. లింగమయ్య దర్శనం కోసం కుటుంబ సమేతంగా నాగర్ కర్నూల్ వచ్చిన యువతి హఠాత్తుగా అదృశ్యమైన ఘటన కలకలం రేపుతోంది.
నల్లమల అడవులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి…సలేశ్వరం జాతరలో ఓ మహిళ అదృశ్యం అయ్యింది. లింగమయ్య దర్శనం కోసం కుటుంబ సమేతంగా నాగర్ కర్నూల్ వచ్చిన యువతి హఠాత్తుగా అదృశ్యమైన ఘటన కలకలం రేపుతోంది. కర్నాటకలోని రాయచూర్‌కి చెందిన ప్రవైటు ఉపాధ్యాయురాలు గాయత్రి లింగమయ్య దర్శనం కోసం సలేశ్వరం జాతరకు వచ్చి, తప్పిపోయింది. నల్లమల అటవీ ప్రాంతంలోని సలేశ్వరం జాతరలో పాల్గొని లింగమయ్యను దర్శించుకునేందుకు ప్రైవేట్ టీచర్ గాయత్రి (25) ఈనెల ఆరో తేదీ సాయంత్రం ఏడు గంటల ప్రాంతంలో నల్లమల అడవిలోకి వెళ్ళింది.
నల్లమల కాలినడక మార్గంలో సలేశ్వరం లోయ వైపు వెళుతుండగా హఠాత్తుగా వారికి ఓ పాము ఎదురవడంతో అంతా చెల్లాచెదురయ్యారు. అదే సమయంలో గాయత్రి తమ కుటుంబ సభ్యుల నుంచి విడివడి తప్పిపోయారు. చాలా సేపటికి యువతి మిస్ అయిన విషయాన్ని గుర్తించారు కుటుంబ సభ్యులు. ఆ తర్వత కుటుంబ సభ్యులు చుట్టుపక్కల ప్రాంతమంతటా వెతికినప్పటికీ ఆచూకి లభించలేదు.
అడవి నుంచి బయటికి వచ్చిన తర్వాత కూడా ఆమె కోసం ఏడో తేదీ మధ్యహ్నం 12 గంటల వరకు ఎదురు చూశారు కుటుంబ సభ్యులు. ఎంతకి ఆచూకి లభించకపోవడంతో లింగాల పోలీసులకు ఫిర్యాదు చేశారు కుటుంబ సభ్యులు. ప్రస్తుతం నల్లమల అడవిలో భక్తులెవరూ లేరు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు అధికారులు గాయత్రిని వెతికేందుకు నల్లమల అడవిలోకి వెళ్లారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..