Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ‘కన్నా.. నిద్ర పోరా! అమ్మ ఎగ్జాం రాస్తుంది..’ భార్య గ్రూప్ 3 పరీక్ష రాస్తుంటే నెలల బిడ్డకు భర్త సపర్యలు

రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు గ్రూప్ 3 పరీకలు రెండు షిఫ్టుల్లో జరిగాయి. ఉదయం పేపర్ 1 పరీక్ష, మధ్యాహ్నం పేపర్ 2 పరీక్షలు జరిగాయి. అయితే ఈ పరీక్షలకు యువతతోపాటు కొందరు వివాహితలు కూడా వారి పిల్లలతో హాజరయ్యారు. మహిళలు పరీక్ష రాసేందుకు పరీక్ష కేంద్రంలోకి వెళ్లగా బయట వారి బంధువులు పిల్లలను జాగ్రత్తగా చూసుకున్నారు.. ఇందుకు సంబంధించిన దృశ్యాలు కెమెరాకు చిక్కాయి..

Follow us
G Sampath Kumar

| Edited By: Srilakshmi C

Updated on: Nov 17, 2024 | 6:02 PM

కరీంనగర్‌, నవంబర్‌ 17: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి గ్రూప్ 3 పరీక్షలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఓ పరీక్ష కేంద్రం వద్ద భార్య గ్రూప్ 3 ఎగ్జామ్ రాస్తుంటే.. ఎగ్జామ్ సెంటర్ ఎదుట 10 నెల బిడ్డను ఆమె భర్త నిద్రపుచ్చాడు. శంకర్ అనే వ్యక్తి అకౌంటెంట్‌గా జాబ్ చేస్తున్నాడు. తన భార్య స్వప్న గ్రూపు పరీక్ష రాయడానికి కరీంనగర్‌లోని స్థానిక సిద్ధార్థ పాఠశాలలో సెంటర్ వద్దకు చేరుకుంది. పరీక్ష సమయం కావడంతో 10 నెలల చిన్నారిని భర్త చేతికి అప్పగించి, ఆమె పరీక్ష రాసేందుకు లోపలికి వెళ్లింది. దీంతో దగ్గర్లో ఉన్న ఒక షాపు వద్ద ఉన్న చిన్న గద్దెపై కూర్చొని తమ పది నెలల బాబుని జోకొట్టి నిద్ర పుచ్చుతూ శకంర్‌ కనిపించాడు.

మహిళల కెరీర్ ఎదుగుదలలో భర్త పాత్ర ఎంతో ముఖ్యంగా మారిందనడానికి నిదర్శనమే ఇది అంటూ నెటిజన్లు అభినందిస్తున్నారు. పరీక్ష రాసే వరకు అక్కడే చిన్నారిని తిప్పుతూ ఆడించాడు. సుమారుగా మూడు గంటల పాటు బాబును ఎత్తుకొని కనిపించాడు. పరీక్ష అయిపోయాక.. బాబు తల్లి దగ్గరికి వెళ్లి అతుక్కుపోయాడు. అనంతరం దంపతులు ఇరువురు తమ బుజ్జాయిని తీసుకుని ఇంటికి వెళ్లిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.

తన వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చిన నిర్మాత ఎస్‌‌‌‌‌‌కే‌‌ఎన్..
తన వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చిన నిర్మాత ఎస్‌‌‌‌‌‌కే‌‌ఎన్..
ఏరా.! మీరు మారరా.. రోడ్డుపై లగ్జరీ కార్లతో డెత్ స్టంట్‌లు
ఏరా.! మీరు మారరా.. రోడ్డుపై లగ్జరీ కార్లతో డెత్ స్టంట్‌లు
కాసులు కురిపించిన మల్టీబ్యాగర్ స్టాక్.. రూ. లక్షతో కోటీశ్వరులుగా
కాసులు కురిపించిన మల్టీబ్యాగర్ స్టాక్.. రూ. లక్షతో కోటీశ్వరులుగా
ఆన్‌లైన్‌లో రైలు టిక్కెట్లు ఎందుకు ఖరీదైనవి? మంత్రి సమాధానం!
ఆన్‌లైన్‌లో రైలు టిక్కెట్లు ఎందుకు ఖరీదైనవి? మంత్రి సమాధానం!
గురుకుల విద్యార్థుల ఫైటింగ్‌ వీడియో వైరల్‌.. సీన్ కట్ చేస్తే ప్రి
గురుకుల విద్యార్థుల ఫైటింగ్‌ వీడియో వైరల్‌.. సీన్ కట్ చేస్తే ప్రి
ఆపిల్ నుంచి మరో అతిచౌకైన ఐఫోన్.. భారత్‌, అమెరికా, దుబాయ్‌లో ధరలు?
ఆపిల్ నుంచి మరో అతిచౌకైన ఐఫోన్.. భారత్‌, అమెరికా, దుబాయ్‌లో ధరలు?
ఆ ఇంటి నుంచి ఒక్కసారిగా విచిత్ర అరుపులు.. ఏంటా అని వెళ్లి చూడగా
ఆ ఇంటి నుంచి ఒక్కసారిగా విచిత్ర అరుపులు.. ఏంటా అని వెళ్లి చూడగా
ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు పెంచేందుకు ఆ అధికారి ఏం చేశాడంటే..
ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు పెంచేందుకు ఆ అధికారి ఏం చేశాడంటే..
పెరిగిన మారుతీ డిజైర్ కారు ధర.. ఏ వేరియంట్ కు ఎంతో తెలుసా..?
పెరిగిన మారుతీ డిజైర్ కారు ధర.. ఏ వేరియంట్ కు ఎంతో తెలుసా..?
ప్రియమణి అక్క ఇండస్ట్రీలో తోపు హీరోయినా..!
ప్రియమణి అక్క ఇండస్ట్రీలో తోపు హీరోయినా..!