Telangana: మా అబ్బాయిని మాకు తిరిగి అప్పగించండి.. కొడుకు కోసం తల్లిదండ్రుల ఆవేదన
ఉద్యోగం ఇప్పిస్తామనే పేరుతో ఆశావహులను మోసం చేసి, ఎంతో మందిని కొందరు ప్రలోభపెడుతున్నారు. ఉద్యోగం ఆశ చూపి ట్రావెల్ ఏజెంట్ల ద్వారా భారతదేశానికి చెందిన చాలా మంది యువకులను ప్రలోభపెట్టి థాయ్‌లాండ్‌లోని బ్యాంకాక్‌కు తీసుకువెళుతున్నారు. బోటులో మయన్మార్-కంబోడియా బోర్డర్‌కు తీసుకెళ్లి అక్కడ అనేక కంపెనీలు చెప్పినట్లుగా ఆన్‌లైన్ స్కామ్‌లు చేయాల్సిన పరిస్థితి ఎదుర్కొంటున్నారు.
ఐటీ రంగంలో ఉద్యోగం ఇప్పిస్తామనే పేరుతో ఆశావహులను మోసం చేసి, ఎంతో మందిని ప్రలోభపెడుతున్నారు. ఉద్యోగం వస్తుంది కదా అనే ఆశతో వారి మాయమాటలు నమ్మి యువకులు మోసపోతున్నారు. తీరా అది మోసం అని తెలిశాక అక్కడి నుండి బయటపడలేక చిక్కుల్లో పడుతున్నారు. ఉద్యోగం ఆశ చూపి ట్రావెల్ ఏజెంట్ల ద్వారా భారతదేశానికి చెందిన చాలా మంది యువకులను ప్రలోభపెట్టి థాయ్‌లాండ్‌లోని బ్యాంకాక్‌కు తీసుకువెళుతున్నారు. అక్కడ బ్యాంకాక్ విమానాశ్రయంలో వారిని రిసీవ్ చేసుకుని.. అక్కడి నుండి వారిని థాయిలాండ్‌లోని మే సోట్‌కు తీసుకువెళ్తున్నారు. ఆ తర్వాత వారి నుంచి బోటులో మయన్మార్-కంబోడియా బోర్డర్‌కు తీసుకెళ్లి అక్కడ అనేక కంపెనీలు చెప్పినట్లుగా ఆన్‌లైన్ స్కామ్‌లు చేయాల్సిన పరిస్థితి ఎదుర్కొంటున్నారు.
కర్మ కాలి ఉద్యోగం ఆశతో వారి మాటలు నమ్మి వచ్చామా ఇక అంతే.. వచ్చాక వారు విధించే ఆదేశాలను పాటించకపోతే థర్డ్ డిగ్రీ టార్చర్‌కు గురి చేసి రోజుల తరబడి చీకటి గదిలో ఉంచుతారు. భోజనం కనీసం నీళ్లు కూడా ఇవ్వకుండా నరకం చూపిస్తారు. గత రెండు సంవత్సరాల నుంచి ఇలాంటి ఘటనలకు సంబంధించి అనేక ఫిర్యాదులు ఉన్నప్పటికీ, ఈ మానవ అక్రమ రవాణాను అరికట్టడానికి భారత ప్రభుత్వం ఎటువంటి తీవ్రమైన చర్యలు తీసుకోలేదు. పైగా అలా నమ్మి వెళ్ళినవారు తిరిగి రావాలన్నా, తమను తాము విడిపించుకోవాలన్నా 5000 USD చెల్లించాల్సిన దుస్థితి వచ్చింది. ఎంత కష్టమైనా బయటపడాలి అనుకుంటే మాత్రం ఈ మొత్తం చెల్లించాల్సిందే. లేదా అక్కడే థాయ్‌లాండ్ జైళ్లలో మగ్గుతూ ఉండాల్సిందే. తాజాగా ఇలాంటి ఘటనకు సంబంధించి హైదరాబాద్ నగరానికి చెందిన ఓ కుటుంబం భారత ప్రభుత్వానికి ఓ లేఖ రాసింది. తమ కుటుంబ సభ్యుడిని ఎలాగైనా విడిపించాలని ప్రాధేయపడుతూ ఆవేదన వ్యక్తం చేసింది.