TGPSC Group 4 Final Results: తెలంగాణ గ్రూప్‌ 4 తుది ఫలితాలు విడుదల.. మొత్తం ఎంతమంది సెలక్టయ్యారంటే

తెలంగాణ గ్రూప్ 4 ఫలితాలు ఎట్టకేలకు వచ్చేశాయ్.. గురువారం రాత్రి ఈ మేరకు గ్రూప్ 4 తుది ఎంపిక జాబితాను టీజీపీఎస్సీ తన అధికారిక వెబ్ సైట్ లో విడుదల చేసింది. మొత్తం ఎంత మంది ఎంపికయ్యారంటే..

TGPSC Group 4 Final Results: తెలంగాణ గ్రూప్‌ 4 తుది ఫలితాలు విడుదల.. మొత్తం ఎంతమంది సెలక్టయ్యారంటే
TGPSC Group 4 Final Results
Follow us
Srilakshmi C

|

Updated on: Nov 14, 2024 | 8:06 PM

హైదరాబాద్, నవంబర్‌ 14: తెలంగాణ గ్రూప్ 4 ఫలితాలు గురువారం (నవంబర్‌ 14) రాత్రి విడుదలయ్యాయి. ఫలితాల కోసం గత కొన్ని నెలలుగా ఎదురు చూస్తున్న అభ్యర్ధుల నిరీక్షణకు ఎట్టకేలకు తెరపడింది. మొత్తం 8,084 మంది అభ్యర్థుతో ప్రొవిజినల్ సెలక్షన్‌ లిస్ట్‌ను టీజీపీఎస్సీ వెల్లడించింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపర్చినట్లు కమిషన్‌ ఈ సందర్భంగా తెలిపింది. కాగా మొత్తం 8,180 గ్రూప్‌ 4 పోస్టుల భర్తీకి ఈ నియామక ప్రక్రియ చేపట్టిన సంగతి తెలిసిందే.

తెలంగాణ గ్రూప్ 4 ఫైనల్ లిస్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కాగా మొత్తం 8,180 గ్రూప్ 4 ఉద్యోగాల భర్తీ కోసం డిసెంబర్ 1, 2022వ తేదీన తెలంగాణ సర్కార్ నోటిఫికేషన్‌ జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 9,51,321 మంది అభ్యర్ధులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారు. వీరందరికీ రాత పరీక్ష నిర్వహించిన తర్వాత.. ఈ పరీక్షలో అర్హత సాధించిన వారికి మెరిట్‌ ఆధారంగా జూన్‌ 20 నుంచి ఆగస్టు 31, 2024వ వరకు ధ్రువపత్రాల పరిశీలన చేశారు. ఈ మేరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ తర్వాత తుది ఎంపిక జాబితాను టీజీపీఎస్సీ నేడు ప్రకటించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.