Hyderabad: ఆ పూల దండలను డెలివరీ చేయలేము.. స్పష్టం చేసిన వ్యాపారులు.. కారణం ఏంటంటే..!
Hyderabad: హైదరాబాద్ లాంటి నగరంలో అపార్ట్మెంట్, గేటెడ్ కమ్యూనిటీ కల్చర్ ఎక్కువగా ఉంటుంది. దీంతో తప్పుగా డెలివరీ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయని భావించి ఈ నిర్ణయం తీసుకున్నారు వ్యాపారులు.
హైదరాబాద్ లో ఏది కావాలన్న నిమిషాల్లో డోర్ డెలివరి ద్వారా పోందోచ్చు. నెయిల్ కట్టర్ నుండి హెయిర్ కట్టర్ వరకు.. అన్ లైన్ తో పాటుగా, ఆఫ్‌లైన్‌లోనూ డోర్ డెలివరి ద్వారా పోందవచ్చు. కాని ఒక్క ఐటేం కావాలంటే మాత్రం అక్కడికి వెళ్లి స్వయంగా తీసుకోవాల్సిందే. ఎందుకంటే అది సెంటిమెంట్ తో కూడుకున్న వ్యవహరం అని ఈ నిర్ణయం తీసుకున్నారట.. అసలు ఏంటా స్టోరి..?
ఎక్కడైన సంతాపం తెలపడానికి తరుచుగా ఉపయోగిస్తుంటారు రీథ్ గా పిలిచే రౌండ్ గార్లండ్. ఇది కొన్ని సందర్బాల్లో ముఖ్యమైన నాయకులు, వ్యక్తులు చనిపోయిన శ్రద్దాంజలి ఘటించే సమయంలో నివాళులు అర్పించే సమయంలో వీటిని రెగ్యూలర్ గా చూస్తుంటాం. ముఖ్యంగా దేశ సైనికులకు గౌరవంగా నివాళులు అర్పించే సమయంలో పార్థివ దేహాలపై ఉంచి నివాళులు అర్పిస్తూ ఉంటారు. ఇప్పుడు దీని వ్యాపారులు రీథ్‌ను డెలివరి చేయలేం అని చేపుతన్నారట. ఈ నిర్ణయం ప్రకారం, సంతాప సూచకంగా ఉపయోగించే రీథ్ గార్లండ్ తప్పుగా డెలివరీ అయితే, అది మానసికంగా నెగెటివ్ ప్రభావం చూపవచ్చని ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఆత్మీయ వ్యక్తిని కోల్పోయినప్పుడు సంతాపం తెలపడానికి వేళ్లే క్రమంలో పూల దండలు, రీథ్ గార్లండ్‌లు అనేవి సంతాపం, సానుభూతికి సూచికలుగా పని చేస్తాయి. అలాంటివి తప్పుగా డెలివరీ జరిగితే అది ఆ వ్యక్తులను ఇబ్బందికి గురి చేసే ప్రమాదం ఉంటుందని ఈ నిర్ణయం తీసుకున్నారట. ఇక హైదరాబాద్ లాంటి నగరంలో అపార్ట్మెంట్, గేటెడ్ కమ్యూనిటీ కల్చర్ ఎక్కువగా ఉంటుంది. దీంతో తప్పుగా డెలివరీ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయని భావించి ఈ నిర్ణయం తీసుకున్నారు వ్యాపారులు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి