TG SSC 10th Exams: పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల ఫీజు గడువు పొడిగింపు.. ఎప్పటివరకంటే

వచ్చే ఏడాది మార్చిలో జరగనున్న పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు సంబంధించిన ఫీజు గడువును తాజాగా పాఠశాల విద్యాశాఖ పొడిగించింది. గతంలో ఉచ్చిన ప్రకటన మేరకు రేపటితో గడువు ముగియనుంది. అయితే దీనిని మరో 10 రోజుల పాటు పొడిగిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది..

TG SSC 10th Exams: పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల ఫీజు గడువు పొడిగింపు.. ఎప్పటివరకంటే
TG SSC 10th Exams
Follow us
Srilakshmi C

|

Updated on: Nov 17, 2024 | 4:54 PM

హైదరాబాద్‌, నవంబర్‌ 17: తెలంగాణ రాష్ట్రంలో 2024-25 విద్యా సంవత్సరానికి వచ్చే ఏడాది మార్చిలో జరిగే పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లింపులు జరుగుతున్న సంగతి తెలిసిందే. గతంలో వెలువడిన షెడ్యూల్‌ ప్రకారం ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా నవంబర్‌ 18వ తేదీలోగా పరీక్షల ఫీజు చెల్లించేందుకు అవకాశం ఇచ్చారు. ఈ మేరకు రేపటితో గడువు ముగియనుంది. అయితే ఈ గడువును పొడిగిస్తూ రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ తాజాగా ప్రకటన జారీ చేసింది. ఈ ప్రకటన మేరకు ఫీజు గడువును నవంబర్‌ 28వ తేదీ వరకు పొడిగించినట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుడు ఎ కృష్ణారావు తెలిపారు.

రూ.50 నుంచి రూ.500 ఆలస్య రుసుంతో డిసెంబరు 21వ తేదీ వరకు ఫీజు చెల్లించడానికి గడువు ఇచ్చింది. పరీక్షల ఫీజును రూ.125గా నిర్ణయించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన విద్యార్థులు పట్టణాల్లో కుటుంబ వార్షిక ఆదాయం రూ.24 వేలు, గ్రామీణ ప్రాంతాల్లో అయితే రూ.20 వేలలోపు ఉన్నట్లయితే వారంతా ఆదాయ ధ్రువపత్రం సమర్పించాలని, ఇటువంటి వారందరికీ పరీక్ష ఫీజు నుంచి మినహాయింపు వర్తిస్తుందని ఆయన తెలిపారు. ఈ ఏడాది పదో తరగతి పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా 5.25 లక్షల మందికిపైగా విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్న సంగతి తెలిసిందే.

తెలంగాణ పోలీస్‌ బ్యాడ్జి మారిందోచ్‌.. కొత్తది ఇదే

తెలంగాణ పోలీస్‌ బ్యాడ్జిల్లో మార్పులు చేస్తూ రాష్ట్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకు ‘టీఎస్‌’గా ఉన్న బ్యాడ్జిలను ‘టీజీ’గా మార్చుతూ కొత్త బ్యాడ్జిలను తీసుకువచ్చారు. ఈ మేరకు హోంశాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శి రవిగుప్తా ఆదేశాలు జారీ చేశారు. సివిల్, ఏఆర్, టీఎస్‌ఎస్‌పీ, ఎస్‌ఏఆర్‌ సీపీఎల్, పీటీవో విభాగాలకు సంబంధించి కానిస్టేబుల్‌ నుంచి నాన్‌కేడర్‌ ఎస్పీల వరకు ప్రస్తుతం అందరికీ ‘టీఎస్‌పీ’గా ఉన్న పీక్‌ క్యాప్‌ మోనోగ్రామ్‌ను ఇకపై ‘టీజీపీ’గా ఉండాలని మార్చారు. అలాగే ఇప్పటివరకు ‘తెలంగాణ స్టేట్‌ పోలీస్‌’గా ఉన్న లోగోను ‘తెలంగాణ పోలీస్‌’గా మార్చారు. అలాగే టీఎస్‌ఎస్‌పీ షోల్డర్‌బ్యాడ్జిని టీజీఎస్‌పీగా, టీఎస్‌పీ షోల్డర్‌బ్యాడ్జిని టీజీపీగా, టీఎస్‌పీఎస్‌ షోల్డర్‌ బ్యాడ్జిని టీజీపీఎస్‌గా మార్చారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే