TGPSC Group 3 Exam: ప్రశాతంగా ముగిసిన టీజీపీఎస్సీ గ్రూప్‌ 3 పరీక్షలు.. కేవలం సగం మందే హాజరు!!

టీజీపీఎస్సీ గ్రూప్‌ 3 పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. మొత్తం 3 పేపర్లకు ఈపరీక్షలు జరిగాయి. అయితే దాదాపు ఐదున్నర లక్షల మంది పరీక్షలకు దరఖాస్తు చేసుకుంటే..వీరిలో కేవలం సగం మంది మాత్రమే పరీక్షలకు హాజరుకావాడం విశేషం. ఇంత భారీగా హాజరు ఎందుకు తగ్గిందనే దానిపై సర్వత్రా చర్చ సాగుతోంది..

TGPSC Group 3 Exam: ప్రశాతంగా ముగిసిన టీజీపీఎస్సీ గ్రూప్‌ 3 పరీక్షలు.. కేవలం సగం మందే హాజరు!!
TGPSC Group 3 Exam
Follow us
Srilakshmi C

|

Updated on: Nov 18, 2024 | 2:09 PM

హైదరాబాద్‌, నవంబర్ 12: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా టీజీపీఎస్సీ గ్రూప్‌ 3 పరీక్షలు ఆది, సోమ వారాలు ప్రశాంతంగా జరిగాయి. మొత్తం 3 పేపర్లకు ఈ పరీక్షలు జరిగాయి. నవంబనఖ 17న ఉదయం సెషన్‌లో 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పేపర్‌ 1 పరీక్ష, అదేరోజు మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పేపర్‌ 2 పరీక్ష జరిగింది. ఇక నవంబర్‌ 18న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పేపర్‌ 3 పరీక్ష నిర్వహించడంతో మూడు పేపర్లకు పరీక్షలు పూర్తయ్యాయి. మొత్తం 1,365 గ్రూప్‌ 3 సర్వీసు పోస్టుల భర్తీకి గానూ ఈ రాతపరీక్షలు నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 1,401 కేంద్రాల్లో ఈ పరీక్షలు జరిగాయి. అయితే రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 5,36,400 మంది అభ్యర్ధులు గ్రూప్ 3కి దరఖాస్తు చేయగా.. వారిలో పేపర్‌ 1 పరీక్షకు 2,73,847 మంది, పేపర్‌ 2 పరీక్షకు 2,72,173 మంది హాజరయ్యారు. అంటే తొలిరోజు మొత్తం కలిపి 50.7 శాతం హాజరు నమోదైందని టీజీపీఎస్సీ తెలిపింది.

పేపర్‌ 1 ప్రశ్నపత్రంలో నిర్ణీత సమయంలోగా అన్ని సమాధానాలు గుర్తించేందుకు సమయం సరిపోలేదని కొందరు అభ్యర్థులు వాపోయారు. మధ్యాహ్నం జరిగిన పేపర్‌ 2 పరీక్ష ప్రశ్నపత్రం మధ్యస్థంగా ఉందని వివరించారు.

పేపర్‌ 1 పరీక్షలో ఆస్కార్‌ అవార్డుపై ఓ ప్రశ్న రావడం గమనార్హం. ఆస్కార్‌ అవార్డు-2024కు నామినేట్‌ చేయబడిన డాక్యుమెంటరీ చలనచిత్రం ‘టు కిల్‌ ఎ టైగర్‌’ (To Kill a Tiger)’ దర్శకుడు ఎవరు? అనేదే ఆ ప్రశ్న.. ఇందుకు ఆర్‌. మహదేవన్‌, నిఖిల్‌ మహాజన్, కార్తీకి గొన్సల్వ్స్‌, నిషా పహుజ ఆప్షన్లు ఇచ్చారు. సరైన సమాధానం.. నిషా పహుజ

ఇవి కూడా చదవండి

ఇలా కొన్ని ప్రశ్నలు నేరుగా సమాధానం గుర్తించేవిగా ఉండగా, మరికొన్ని లోతైన విశ్లేషణలతో కూడుకున్నవిగా ఉన్నట్లు తెలిపారు. గ్రూప్‌ 3 పరీక్ష పేపర్‌ 1, 2 ప్రశ్నపత్రాలు మధ్యస్థంగా ఉందని అభ్యర్థులు, నిపుణులు పేర్కొన్నారు. లాజికల్‌ రీజనింగ్‌, అనలిటికల్‌ ఎబిలిటీ, డేటా ఇంటర్‌ప్రిటేషన్‌ మినహా.. మిగిలిన అంశాల్లో ప్రశ్నలు చాలావరకు నేరుగానే అడిగారని తెలిపారు. కఠినస్థాయితో పాటు సులభ స్థాయి ప్రశ్నలు తక్కువగా, మధ్యస్థంగా ఉండే ప్రశ్నలు ఎక్కువగా వచ్చాయని తెలిపారు. ఈ రోజు జరిగిన పరీక్షకు ఎంత మంది అభ్యర్ధులు హాజరయ్యారనే విషయం ఇంకా తెలియరాలేదు.

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.