AP Constable Physical Test: ‘వారిని కూడా కానిస్టేబుల్ దేహదారుఢ్య పరీక్షకు అనుమతించండి’ హైకోర్టు ఆదేశం

కానిస్టేబుల్‌ పోస్టుల నియామక ప్రక్రియకు సంబంధించిన తాజాగా రాష్ట్ర హైకోర్టు కీలక ఆదేశాలు జారీచేసింది. త్వరలోనే దేహదారుఢ్య పరీక్షలకు హోంగార్డు అభ్యర్ధులందరికీ అనుమతి ఇవ్వాలంటూ పోలీసు నియామక బోర్డును ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది..

AP Constable Physical Test: 'వారిని కూడా కానిస్టేబుల్ దేహదారుఢ్య పరీక్షకు అనుమతించండి' హైకోర్టు ఆదేశం
Constable Physical Tests
Follow us
Srilakshmi C

|

Updated on: Nov 17, 2024 | 4:05 PM

అమరావతి, నవంబర్‌ 17: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో కానిస్టేబుల్‌ ఎంపిక ప్రక్రియలో గత రెండేళ్లుగా నత్తనడకన కొనసాగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా రాష్ట్రంలో అధికారం చేపట్టిన కూటమి సర్కార్‌ కానిస్టేబుల్‌ నియామక ప్రక్రియ వీలైనంత త్వరగా పూర్తి చేయాలని యోచిస్తుంది. ఇందుకు సంబంధించి త్వరలోనే దేహదారుఢ్య పరీక్షలు కూడా నిర్వహించనున్నారు. అయితే తమను ప్రత్యేక కేటగిరీగా పరిగణించాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించిన హోంగార్డు అభ్యర్థులకు ఊరట లభించింది. వారిని కూడా దేహదారుఢ్య పరీక్షకు అనుమతించాలని పోలీసు నియామక బోర్డును ఆదేశిస్తూ న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌ సుబ్బారెడ్డి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు.

పోలీసు కానిస్టేబుల్‌ ప్రిలిమినరీ పరీక్షలో తమను జనరల్‌ కేటగిరీ అభ్యర్థులుగా పేర్కొనడంతో అర్హత మార్కులు సాధించలేక పోయామని పేర్కొంటూ పలువురు హోంగార్డు అభ్యర్ధులు హైకోర్టులో వ్యాజ్యాలు దాఖలు చేశారు. వీటిని ఇటీవల కోర్టు ఎదుట విచారణకు వచ్చాయి. ఇదే సమస్యపై మరో వందమందికి పైగా హోంగార్డులు కూడా హైకోర్టులో వ్యాజ్యాలు దాఖలుచేశారు. పోస్టుకు ఎంపిక అయ్యేందుకు సాధారణ అభ్యర్థులకు నిర్ణయించిన మార్కులనే తమకు వర్తింపజేయడం తగదని తమ పిటిషన్లలో పేర్కొన్నారు. తమకు ప్రత్యేక మెరిట్‌లిస్ట్‌ తయారు చేసేలా పోలీసు నియామక బోర్డును ఆదేశించాలని వారంతా కోరారు. దీంతో వీటన్నింటినీ పరిశీలించిన కోర్టు పోటీపడుతున్న హోంగార్డులను దేహదారుఢ్య పరీక్షకు అనుమతించాలని పోలీసు నియామక బోర్డుకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

తెలంగాణ TG M.Ed. & M.P.Ed వెబ్‌ కౌన్సెలింగ్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

తెలంగాణ ఎంఈడీ, ఎంపీఈడీ తుది విడత కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల.. రిజిస్ట్రేషన్లు ప్రారంభం

తెలంగాణలో ఎంఈడీ, ఎంపీఈడీ ప్రవేశాలకు సంబంధించి తుది విడత కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ ఇటీవల విడుదలైంది. నవంబర్‌ 15వ తేదీ నుంచి కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్‌ ప్రారంభమవగా.. నవంబర్ 18వ తేదీతో అందుకు గడువు పూర్తవుతుంది. నవంబర్ 19, 20 తేదీల్లో వెబ్ ఆప్షన్లకు నమోదు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. నవంబర్ 20వ తేదీన వెబ్ ఆప్షన్లను ఎడిట్ చేసుకోవచ్చు. నవంబర్ 22వ తేదీ సీట్ల కేటాయింపు ఉంటుంది. సీట్లు పొందిన అభ్యర్థులంతా నవంబర్ 26వ తేదీలోగా ఆయా కాలేజీల్లో స్వయంగా రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది.

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.