AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య.. మళ్లీ ఏం తెలియనట్లు తెగ ఏడ్చింది.. కట్ చేస్తే..

మహబూబాబాద్ జిల్లాలో సంచలనం సృష్టించిన హెల్త్ సూపర్వైజర్ పార్థసారథి హత్య మిస్టరీ ఎట్టకేలకు వీడింది.. మృతుడి భార్యే మర్డర్ స్కెచ్ వేసినట్లుగా పోలీసులు నిర్ధారించారు. ఆ కిలాడీ లేడితోపాటు ఆమె ప్రియుడు ప్రభుత్వ ఉపాధ్యాయుడిని కటకటాల్లోకి పంపారు.. అంతేకాకుండా సుపారీ గ్యాంగ్ లో ముగ్గురిని అరెస్ట్ చేశారు.. హత్యకు ఐదు లక్షల డీల్ కుదుర్చుకొని అతికిరాతకంగా చంపినట్లు పోలీసులు నిర్ధారించారు.

Telangana: ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య.. మళ్లీ ఏం తెలియనట్లు తెగ ఏడ్చింది.. కట్ చేస్తే..
Crime News
G Peddeesh Kumar
| Edited By: Shaik Madar Saheb|

Updated on: Apr 04, 2025 | 9:21 PM

Share

మహబూబాబాద్ జిల్లాలో సంచలనం సృష్టించిన హెల్త్ సూపర్వైజర్ పార్థసారథి హత్య మిస్టరీ ఎట్టకేలకు వీడింది.. మృతుడి భార్యే మర్డర్ స్కెచ్ వేసినట్లుగా పోలీసులు నిర్ధారించారు. ఆ కిలాడీ లేడితోపాటు ఆమె ప్రియుడు ప్రభుత్వ ఉపాధ్యాయుడిని కటకటాల్లోకి పంపారు.. అంతేకాకుండా సుపారీ గ్యాంగ్ లో ముగ్గురిని అరెస్ట్ చేశారు.. హత్యకు ఐదు లక్షల డీల్ కుదుర్చుకొని అతికిరాతకంగా చంపినట్లు పోలీసులు నిర్ధారించారు.. వివాహేతర సంబంధమే ఈ విషాద కథకు కారణమని.. వెల్లడించారు. ఈ మేరకు ఐదుగురిని అరెస్టు చేసి కటకటాల వెనక్కి నెట్టారు.

అసలేం జరిగిందంటే..

మహబూబాబాద్ శివారు భజనతండా వద్ద ఈ హత్య జరిగింది.. ఒంటరిగా బైక్ పై వస్తున్న వ్యక్తిని అతి కిరాతకంగా గొడ్డళ్లతో నరికి చంపారు.. ప్లాన్ ప్రకారం మార్గ మధ్యలో కాపుకాసిన దుండగులు బైక్ పై వెళ్తున్న హెల్త్ సూపర్వైజర్ పార్థసారథిని నరికి చంపారు. హత్య అనంతరం పోలీసులు అక్కడికి చేరుకుని వివరాలను సేకరించారు. మృతుడు దంతాలపల్లి మండల కేంద్రంలోని మహాత్మ జ్యోతిబాపూలే ఆశ్రమ పాఠశాలలో హెల్త్ సూపర్ వైజర్ గా పనిచేస్తున్న పార్థసారథిగా గుర్తించారు. మర్డర్ మిస్టరీని ఛేదించడం కోసం నాలుగు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపిన జిల్లా ఎస్పీ రామ్ నాథ్ .. రెండు రోజుల వ్యవధిలోనే మర్డర్ మిస్టరీని చేధించారు.. వివాహేతర సంబంధమే హత్యకు కారణమని తేల్చారు..

మృతుడి భార్య స్వప్న తన ప్రియుడు విద్యాసాగర్ తో కలసి హత్యకు సుపారీ ఇచ్చినట్లు నిర్ధారించారు.. ప్రియుడు విద్యాసాగర్ ప్రభుత్వ ఉపాధ్యాయుడు.. వీళ్ళ వివాహేతర సంబంధం వ్యవహారం భర్తకు తెలియడంతో అతన్ని అడ్డు తొలగించుకోవాలని స్వప్న.. ఆమె ప్రియుడు ప్లాన్ రచించారు. వాళ్ల చేతికి మట్టి అంటకుండా నలుగురు సభ్యుల హంతక ముఠాకు సుపారీ ఇచ్చారు.. ఐదు లక్షల డీల్ కుదుర్చుకున్నారు. హత్యకు ముందు కొంత, హత్య అనంతరం మిగిలిన డబ్బు అందించేలా డీల్ చేసుకుని.. మర్డర్ స్కెచ్ వేశారు.

వినయ్ కుమార్, శివకుమార్, వంశీతో పాటు మరోవ్యక్తికి సుపారీ ఇచ్చారు.. వారిని సంప్రదించిన తరువాత గత నెలలో ఒకసారి రెక్కీ నిర్వహించారు.. హత్యకు ప్లాన్ చేశారు.. కాని ప్లాన్ బెడిసికొట్టింది. ఉగాది, రంజాన్ సెలవులు రావడంతో సెలవు దినాలను హత్యకు డేట్ ఫిక్స్ చేశారు.. మృతుడు పార్థసారథి భద్రాచలంలోని తన ఇంటికి వెళ్లి తిరిగి దంతాలపల్లికి వస్తున్న క్రమంలో మార్గ మధ్యలో కాపుకాసి అతి కిరాతకంగా హత్య చేశారు.. మృతుని బంధువులు భార్య తాటి స్వప్న పై అనుమానం వ్యక్తం చేయడంతో పోలీసుల విచారణలో అసలు కథ వెలుగులోకి వచ్చింది.

వివాహేతర సంబందానికి భర్త అడ్డుగా ఉన్నాడని హత మార్చారు.. గురువారం స్వప్న, ఆమె ప్రియుడు ప్రభుత్వ ఉపాధ్యాయుడు విద్యాసాగర్ ను అరెస్ట్ చేసిన పోలీసులు ఈరోజు సుఫారి గ్యాంగ్ లోని ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.. పరారీలో ఉన్న మరొకరి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.. నిందితుల వద్ద మారణాయుధాలు, సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఈ సింపుల్‌ ట్రిక్‌తో.. గుడ్డు కుళ్లిపోయిందో.. లేదో తెలుసుకోండి!
ఈ సింపుల్‌ ట్రిక్‌తో.. గుడ్డు కుళ్లిపోయిందో.. లేదో తెలుసుకోండి!
ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్న 10 మంది స్టార్లు ఎవరో తెలుసా!
ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్న 10 మంది స్టార్లు ఎవరో తెలుసా!
నేను ఇప్పుడు తెలంగాణ వాన్ని: వెంకయ్య నాయుడు
నేను ఇప్పుడు తెలంగాణ వాన్ని: వెంకయ్య నాయుడు
అమ్మాయికి మొగుడు... అత్తకు యముడు... ఏకంగా గొంతు కోసి..
అమ్మాయికి మొగుడు... అత్తకు యముడు... ఏకంగా గొంతు కోసి..
గురు, శుక్రుల అనుకూలత.. ఆ రాశుల వారికి హద్దుల్లేని సంపద ఖాయం..!
గురు, శుక్రుల అనుకూలత.. ఆ రాశుల వారికి హద్దుల్లేని సంపద ఖాయం..!
మెస్సీ వచ్చిన ఆ రోజు కోల్‌కతా స్టేడియంలో ఏం జరిగింది ?
మెస్సీ వచ్చిన ఆ రోజు కోల్‌కతా స్టేడియంలో ఏం జరిగింది ?
కొత్త ఏడాది ఈ రాశుల వారి కుటుంబాల్లో భారీగా శుభ కార్యాలు..!
కొత్త ఏడాది ఈ రాశుల వారి కుటుంబాల్లో భారీగా శుభ కార్యాలు..!
రైతన్నలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇకపై నేరుగా ఇంటికే యూరియా!
రైతన్నలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇకపై నేరుగా ఇంటికే యూరియా!
టీ20 వరల్డ్ కప్ టికెట్‌ను మెస్సీకి బహూకరించిన ఐసీసీ ఛైర్మన్ జై షా
టీ20 వరల్డ్ కప్ టికెట్‌ను మెస్సీకి బహూకరించిన ఐసీసీ ఛైర్మన్ జై షా
సమాధులే ఇంటి దేవతలు.. ఏపీలోని ఈ వింత గ్రామం గురించి మీకు తెలుసా
సమాధులే ఇంటి దేవతలు.. ఏపీలోని ఈ వింత గ్రామం గురించి మీకు తెలుసా