వైరస్ కోళ్లకేనా.. మనకు కూడానా? చిన్నారి మృతికి బర్డ్‌ఫ్లూతో లింక్ ఉందా?
వచ్చాక జాగ్రత్తలు చెప్పడం, జాగ్రత్తపడడం బహుశా మనందరికీ అలవాటైపోయిందనే చెప్పాలి. అసలు రాకుండా ఏం చేయాలి, ఎలాంటి జాగ్రత్తలు పాటించాలన్న విషయంలో వస్తున్న అలసత్వం కారణంగానే ఇంత అనర్ధం జరుగుతోంది. ఇంతకీ బర్డ్‌ఫ్లూను మరీ అంత సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం ఉందా? బర్డ్‌ఫ్లూ మనుషుల నుంచి మనుషులకు సోకదు అని కొందరు వైద్యులు చెబుతున్నారు. కాని, సోకుతుంది అని పరిశోధకులు చెబుతున్నారు. ఇందులో ఏది నిజం? అసలు.. బర్డ్‌ఫ్లూకు మెడిసిన్ ఉందా?

ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు జిల్లా నరసరావుపేటలో ఓ రెండేళ్ల చిన్నారి మరణం.. ఇప్పుడు దేశాన్ని కలవరపెడుతోంది. ఆ మరణం సాధారణమైంది కాదు. అసాధారణమైంది. ఎప్పుడో 2021లో అలాంటి మరణం సంభవించింది. మళ్లీ నాలుగేళ్ల తరువాత అదే రీతిలో కన్ను మూసింది. బర్డ్‌ఫ్లూ ఆ రెండేళ్ల పాపను బలి తీసుకుంది. జనరల్‌గా కొందరు డాక్టర్లు ఏం చెప్పేవాళ్లు? బర్డ్‌ఫ్లూతో పెద్దగా కంగారు పడక్కర్లేదు, అంత ప్రమాదకరం, తీవ్రతరం కాదు అని చెప్పేవాళ్లు. ఔనా కాదా? మరి రెండేళ్ల చిన్నారి చనిపోవడం, వెంటనే కేంద్రం నుంచి వైద్య బృందం దిగడం, ఇదంతా చిన్న విషయమేం కాదు కదా..! ప్రమాదకరం, తీవ్రతరం కాదని ఎలా చెప్పగలం. రెండు మూడు రోజుల క్రితం వరకు కూడా వందల సంఖ్యలో కోళ్లు చనిపోయాయి. బర్డ్‌ఫ్లూ లేదు అని అధికారికంగా కన్ఫామ్ చేయలేదు. అలాంటప్పుడు.. సైలెంట్ కిల్లర్‌గా మారలేదని ఏంటీ గ్యారెంటీ? ప్రజలకు ఈ భరోసా ఇచ్చేదెవరు? చైనాలో కరోనా వైరస్ గురించి విన్న కొత్తలో.. అది మనదేశంలోకి రాదనుకున్నాం. వచ్చింది. మన ఎండలకు అది బతకదు అనుకున్నాం. బతికింది. పారాసిటమాల్, ఫినాయిల్‌తో చంపేయొచ్చన్నారు. అది మనల్నే చంపింది. ఫస్ట్‌వేవ్ వచ్చింది. సెకండ్‌వేవ్‌కి మరింత బలం పుంజుకుని విజృంభించింది. చివరికి అందరికీ సోకిన తరువాత.. అప్పుడు కరోనా ఉధృతి తగ్గింది. ఈ భూమ్మీద దేన్నైనా నమ్మకూడంది ఏవైనా ఉన్నాయంటే అందులో వైరస్ కూడా ఒకటి. బర్డ్‌ఫ్లూ గురించి కొన్నేళ్ల క్రితం ఏం విన్నాం. అది...