Andhra News: ఏపీలో నామినేటెడ్ పదవుల జాతర.. జనసేన, బీజేపీకి ఎన్నంటే..
ఆంధ్రప్రదేశ్‌లో నామినేటెడ్ పదవుల భర్తీ ప్రక్రియ జోరుగా సాగుతోంది. ఇటీవల 47 మార్కెట్ కమిటీలకు ఛైర్మన్లను ప్రకటించగా, లేటెస్టుగా మరో 38 మార్కెట్ కమిటీలకు నియామకాలను ప్రభుత్వం పూర్తి చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 38 మార్కెట్ కమిటీలకు కొత్త ఛైర్మన్లను నియమిస్తూ గెజిట్ విడుదల చేసింది ప్రభుత్వం.

ఆంధ్రప్రదేశ్‌లో నామినేటెడ్ పదవుల భర్తీ ప్రక్రియ జోరుగా సాగుతోంది. ఇటీవల 47 మార్కెట్ కమిటీలకు ఛైర్మన్లను ప్రకటించగా, లేటెస్టుగా మరో 38 మార్కెట్ కమిటీలకు నియామకాలను ప్రభుత్వం పూర్తి చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 38 మార్కెట్ కమిటీలకు కొత్త ఛైర్మన్లను నియమిస్తూ గెజిట్ విడుదల చేసింది ప్రభుత్వం. ఇందులో తెలుగుదేశం పార్టీకి చెందిన 31 మంది నేతలకు, జనసేనకు చెందిన ఆరుగురికి, బీజేపీ తరఫున ఒక్కరికి అవకాశమిచ్చారు. మరోవైపు మిగిలిన మార్కెట్ కమిటీలకు కూడా త్వరలోనే ఛైర్మన్లను ప్రకటించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 47 మార్కెట్ కమిటీలకు ఛైర్మన్ల నియామకాలు పూర్తయ్యాయి. ఇందులో 37 చోట్ల టీడీపీకి చెందినవారికి, 8 చోట్ల జనసేన నేతలకు, 2 చోట్ల బీజేపీ నేతలకు పదవులు దక్కినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.
గతంలో 47 మార్కెట్ కమిటీలకు గాను మొత్తంగా సభ్యులతో కలిపి 705 నామినేటెడ్ పదవులు భర్తీ చేశారు. తాజా నియామకాలతో కలిపి ఇప్పటివరకు మొత్తం 85 మార్కెట్ కమిటీలకు ఛైర్మన్ల నియామక ప్రక్రియ పూర్తయింది. మిగిలినవాటిపై కూడా ప్రభుత్వవర్గాల్లో చర్చలు కొనసాగుతున్నాయని సమాచారం. చాలా రోజులుగా ఈ జాబితా కోసం కూటమి లోని మూడు పార్టీల నేతలు వేచి చూస్తున్నారు. సుదీర్ఘ కసరత్తు తర్వాత జాబితాను ప్రకటించారు.
అభ్యర్థుల ఎంపికకు ప్రజాభిప్రాయ సేకరణ చేసి తుది ఎంపిక చేసినట్లు కూటమి నేతలు వెల్లడించారు. త్వరలోనే మిగిలిన మార్కెట్ కమిటీల ఛైర్మన్లను కూడా ప్రకటిస్తామని స్పష్టం చేశారు. నామినేటెడ్ పదవుల కోసం కేవలం టీడీపీ నుంచే భారీ సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. గత ఏడాది సెప్టెంబరులో నామినేటెడ్ పోస్టుల భర్తీకి కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. మూడు పార్టీలకు ప్రాధాన్యత – సామాజిక, ప్రాంతీయ సమీకరణాలను లెక్కలోకి తీసుకుని తాజా జాబితాను ప్రకటించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..