Video: పొలాల్లోకి దూసుకెళ్లి బోల్తాపడ్డ ఆర్టీసీ బస్సు… కొబ్బరిచెట్టుకు ఢీకొని తలకిందులుగా పల్టీ
అనకాపల్లి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. యలమంచిలి మండలం పురుషోత్తపురంలో ఆర్టీసీ బస్సు పల్టీ కొట్టింది. జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్న ఏపీఎస్‌ఆర్టీసీ బస్సు అదుపుతప్పి పంటపొలాల్లోకి దూసుకెళ్లింది. పొలంలో ఉన్న కొబ్బరి చెట్టును ఢీకొని బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఏడుగురు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను హుటాహుటిన అమలాపురం...

అనకాపల్లి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. యలమంచిలి మండలం పురుషోత్తపురంలో ఆర్టీసీ బస్సు పల్టీ కొట్టింది. జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్న ఏపీఎస్‌ఆర్టీసీ బస్సు అదుపుతప్పి పంటపొలాల్లోకి దూసుకెళ్లింది. పొలంలో ఉన్న కొబ్బరి చెట్టును ఢీకొని బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఏడుగురు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను హుటాహుటిన అమలాపురం ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో అందులో 21 మంది ప్రయాణీకులు ఉన్నారు.
టెక్కలి నుంచి రాజమండ్రి వెళుతోండగా ఈ ఘటన జరిగింది. బైక్‌ను తప్పించబోయిన బస్సు అదుపుతప్పి పొలాల్లోకి దూసుకెళ్లినట్లు తెలుస్తోంది. ఎవరికీ ఎలాంటి ప్రాణాపాయం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఉన్నతాధికారులకు డ్రైవర్ రోధిస్తూ సమాచారం అందించారు. బస్సు బోల్తాపడిన విషయం తెలిసిన స్థానికులు భారీ ఎత్తున చేరుకున్నారు. దీంతో రోడ్డుపై ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నారు. యాక్సిడెంట్ ఎలా జరిగిందనే దానిపై డ్రైవర్‌ను ఆరా తీస్తున్నారు.
వీడియో చూడండి: