నడి రోడ్డులో స్కూటీపై యువకుల స్టంట్స్.. చివరికి ట్విస్ట్ అదిరింది..!
అన్నమయ్య జిల్లా కేంద్రమైన రాయచోటి పట్టణంలో అల్లరి మూకల చేష్టలు పేట్రేగిపోతున్నాయి. వాహనాలతో విన్యాసం.. ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు ప్రస్తుత యువత.. ఆకతాయిగా వ్యవహరించి వాహనదారులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. భయంకరమైన స్టంట్లు చేస్తూ ప్రాణాలను లెక్కచేయకుండా తల్లిదండ్రులకు కొరకరాని కొయ్యగా తయారవుతున్నారు. భయం భక్తి లేకుండా విచ్చలవిడిగా చెలరేగిపోతున్నారు.

వాహనాలతో విన్యాసం.. ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు ప్రస్తుత యువత.. ఆకతాయిగా వ్యవహరించి వాహనదారులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. భయంకరమైన స్టంట్లు చేస్తూ ప్రాణాలను లెక్కచేయకుండా తల్లిదండ్రులకు కొరకరాని కొయ్యగా తయారవుతున్నారు. భయం భక్తి లేకుండా విచ్చలవిడిగా చెలరేగిపోతున్నారు.
అన్నమయ్య జిల్లా కేంద్రమైన రాయచోటి పట్టణంలో అల్లరి మూకల చేష్టలు పేట్రేగిపోతున్నాయి. పట్టణ ప్రధాన రహదారులపై ద్విచక్రవాహనాలపై ప్రమాదకరంగా సాహస విన్యాసాలు చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాట మాడుతున్నారు. ద్విచక్ర వాహనాలకు సైలెన్సర్లు తొలగించి పెద్ద పెద్ద శబ్దాలతో రహదారిపై వెళ్లేవారిని భయబ్రాంతులకు గురిచేస్తున్నారు. పోలీసులు రాత్రివేళ గస్తీ కాసే సమయంలోనూ ఇలాంటి ప్రమాదకర విన్యాసాలు చేస్తుండడం గమనార్హం. ఈ క్రమంలోనే రాయచోటి పట్టణంలోని రింగ్ రోడ్డుపై ఇద్దరు యువకులు ద్విచక్ర వాహనంపై అతి వేగంగా వెళ్లడమే కాకుండా వాహనం ముందు చక్రంపైకి లేపి, ఒకే చక్రంతో ప్రమాదకరంగా ప్రయాణిస్తున్న వీడియో ఇప్పుడు హల్ చల్ చేస్తోంది.
రాయచోటి-మదనపల్లి రూట్‌లో బైక్‌పై స్టంట్ చేసిన ఇద్దరి యువకులపై పోలీసులు కేసు నమోదు చేశారు. గురువారం(ఏప్రిల్ 3) సాయంత్రం రాయచోటి-మదనపల్లి రూట్‌లో స్కూటీపై వేగంగా, నిర్లక్ష్యంగా స్టంట్లు చేస్తూ ఉండే ఇద్దరు యువకులపై కేసు నమోదు చేసి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకున్నారు. సదరు యువకులతోపాటు డ్రైవింగ్ లైసెన్స్ లేని యువకులకు బండిని ఇచ్చిన యజమానిని కూడా ముద్దాయిగా చేర్చారు. రాయచోటి ప్రజలందరికీ పోలీస్ తరఫున విజ్ఞప్తి చేశారు. తమ పిల్లలకు డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా ఎవరూ కూడా ఎలాంటి బైక్స్ ఇవ్వద్దని సూచించారు. తద్వారా వారు అతివేగంగా ప్రయాణించి ఏదైనా జరిగితే అది ఆ తల్లిదండ్రులకే బాధను కలిగిస్తుందని, దీనిని దృష్టిలో పెట్టుకుని తల్లిదండ్రులు వారి పిల్లల పట్ల జాగ్రత్త వహించాలని పోలీసులు కోరారు.. లేదని వాహనాలు పిల్లలకు ఇస్తే ఇక నుంచి తల్లిదండ్రులపై కేసు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరించారు.
వీడియో చూడండి..
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..