Video: రోబోకే దిమ్మతిరిగేలా బొమ్మ చూపించిన కెప్టెన్ కూల్.. తలా ఫర్ ఏ రీజన్ అంటున్న ఫ్యాన్!
ఐపీఎల్ 2025లో ధోని మైదానంలోకి వస్తున్న సమయంలో రోబోటిక్ కుక్కను చిలిపితనంతో పక్కకు పెట్టిన దృశ్యం వైరల్‌గా మారింది. ఈ సరదా సంఘటనతో ఫ్యాన్స్ "చంటోడిలా మారిన కెప్టెన్ కూల్" అంటూ కామెంట్లు చేశారు. అదే మ్యాచ్‌లో ధోని అద్భుత ప్రదర్శన చేస్తూ 26 పరుగులు చేసి సీఎస్కేకు విజయాన్ని అందించాడు. 43ఏళ్ల వయసులోనూ ధోని చూపించిన ఆటతీరు అభిమానుల హృదయాలను మరోసారి గెలుచుకుంది.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఎప్పుడూ కొత్త ఆవిష్కరణలకు, వినూత్న శైలులకు వేదికగా నిలుస్తోంది. 2025 సీజన్‌లో ఈ క్రమంలోనే కొత్త సంచలనంగా మారింది రోబోటిక్ కెమెరా డాగ్. ఐపీఎల్ నిర్వహకులు పరిచయం చేసిన ఈ హైటెక్ నాలుగు కాళ్ల గాడ్జెట్ అభిమానుల దృష్టిని పూర్తిగా ఆకర్షించగా, ఆటగాళ్లను కూడా తన చిలిపితనంతో అలరించింది. అయితే అందులోనూ అత్యంత విశేషంగా మారింది మన ఎంఎస్ ధోనితో జరిగిన చిన్న సరదా సంఘటన. లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్‌కు ముందు మైదానంలోకి అడుగుపెడుతున్న సమయంలో, ధోని ఎదురుగా నడుస్తున్న రోబో కుక్కను తన స్టైల్లో చక్కగా పక్కకు పెట్టాడు. ఆ గాడ్జెట్ తన దారిని అడ్డుకుంటే, ధోని చేత్లోకి తీసుకొని మెల్లగా పక్కకు జరిపాడు. ఆ హాస్యాస్పద క్షణం మైదానంలో ఉన్న ఆటగాళ్లను నవ్వేసేలా చేసింది, సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ఈ చిన్న సంఘటనతో ధోని మళ్లీ పిల్లవాడిగా మారినట్టు ఫీలయ్యారు అభిమానులు. “కెప్టెన్ కూల్” తన చిలిపితనంతో అందరినీ అలరించాడు. ఐపీఎల్ ప్రతి సీజన్‌లో ఏదో కొత్తదనాన్ని తీసుకురావడంలో ముందుంటుంది. ఈసారి ఆ హైటెక్ డాగ్‌కి ధోని చేసిన హాస్యప్రదమైన స్పందన ఎంతో ప్రత్యేకంగా నిలిచింది. ఫ్యాన్స్ అతని స్వభావాన్ని, చిలిపి ముద్రను మళ్ళీ గుర్తు చేసుకున్నారు.
ఇదే మ్యాచ్‌లో ధోని తన పాత ఫామ్‌ను మరోసారి ప్రదర్శించాడు. లక్నో సూపర్ జెయింట్స్ జట్టుతో జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్‌లో, మొదట బౌలర్ల సాహసంతో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ప్రత్యర్థిని 166 పరుగులకే పరిమితం చేసింది. లక్ష్య ఛేదనలో ఆరంభం మంచి ఇచ్చినా మధ్యలో వికెట్లు కోల్పోయి కాస్త ఒత్తిడికి లోనైంది. కానీ చివర్లో శివం దూబే, ఎంఎస్ ధోనీల అద్భుత భాగస్వామ్యం జట్టును గెలుపు దిశగా నడిపించింది. శివం దూబే 43 పరుగులతో అజేయంగా నిలిచాడు, ధోని తన క్లాసిక్ ఫినిషింగ్ టచ్‌ను చూపిస్తూ కేవలం 11 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌తో 26 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఈ విజయం ద్వారా సీఎస్కే తమ ఐదో ఓటమికి ముగింపు పలికింది.
ఈ మ్యాచ్‌లో ధోనికి లభించిన “ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్” అవార్డు ద్వారా మరోసారి చరిత్ర రాసాడు. 43 సంవత్సరాల వయసులో ఈ అవార్డును అందుకుంటూ ఐపీఎల్ చరిత్రలో ఈ ఘనత సాధించిన అతిపెద్ద వయస్సు గల ఆటగాడిగా నిలిచాడు. ఇదివరకు ప్రవీణ్ తంబే పేరిట ఉన్న రికార్డును ధోని చెరిపేసాడు. ఆటపై అతనికి ఉన్న అభిమానం, నిబద్ధత, స్థిరత్వం అంతులేనివి. ఆటలో తాను చేసే చిన్న చిన్న చర్యలు కూడా అభిమానుల హృదయాలను గెలుచుకుంటుండటం మాహీ ప్రత్యేకత. ఐపీఎల్‌లో ధోనితోపాటు ఉండే ప్రతి క్షణం ఒక జ్ఞాపకంగా మారుతోంది.
Dhoni + Robo Dog Cam = Pure Entertainment.
Calm as ever, but the mischief is unmatched man’s having more fun than the camera.
Dhoni off the field is a walking sitcom calm face, killer wit. #CaptainCool #MSD #CSK #OffFieldVibes
— iceman❄️❄️ (@TheIceMaster07) April 15, 2025
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..