AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PBKS vs KKR మాజీ జట్టుపై టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న శ్రేయాస్.. KKRకి డేంజరస్ పేసర్ అరంగేట్రం!

ఐపీఎల్ 2025లో పంజాబ్ కింగ్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్‌లో KKR తరఫున డేంజరస్ పేసర్ అన్రిచ్ నార్టే అరంగేట్రం చేయడం ఆసక్తికర అంశంగా మారింది. శ్రేయస్ తన మాజీ జట్టుతో తలపడుతూ కెప్టెన్సీ నైపుణ్యాన్ని నిరూపించుకునేందుకు సిద్ధమయ్యాడు. రెండు జట్లు గెలుపుపై దృష్టి పెట్టి పోటీ పటిష్టంగా మలచుకున్నాయి.

PBKS vs KKR మాజీ జట్టుపై టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న శ్రేయాస్.. KKRకి డేంజరస్ పేసర్ అరంగేట్రం!
Pbks Vs Kkr
Follow us
Narsimha

|

Updated on: Apr 15, 2025 | 7:24 PM

ఏప్రిల్ 15న మహారాజా యాదవీంద్ర సింగ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఐపీఎల్ 2025 సీజన్‌లో 31వ మ్యాచ్‌ మొదలు కానుంది. ఈ హోరాహోరీ పోరులో పంజాబ్ కింగ్స్ (PBKS) తమ ప్రత్యర్థి కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR)తో తలపడనుంచి. ఈ మ్యాచ్‌లో పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ టాస్ గెలిచాడు. టాస్ అనంతరం అతడు ముందుగా బ్యాటింగ్ ఎంచుకోవడాన్ని ప్రకటించాడు. శ్రేయస్ మాట్లాడుతూ, గత రెండు మ్యాచ్‌ల్లో కూడా ముందుగా బ్యాటింగ్ చేసిన జట్లు విజయం సాధించాయి కాబట్టి అదే దిశగా ముందుకెళ్లాలని నిర్ణయించామని తెలిపాడు. “వికెట్ బాగా కనిపిస్తోంది, అవుట్ ఫీల్డ్ కూడా చక్కగా ఉంది. మేము ఫీల్డింగ్ సమయంలో పూర్తి ఫోకస్ పెట్టి క్యాచ్‌లను మిస్ కాకుండా చూసుకోవాలి” అని శ్రేయస్ స్పష్టం చేశాడు.

ఈ మ్యాచ్‌లో ఆసక్తికరమైన అంశాల్లో ఒకటి అన్రిచ్ కు కోల్‌కతా నైట్ రైడర్స్ తరఫున తొలి మ్యాచ్ కావడం. అతడి అరంగేట్రం పై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. మరొకవైపు పంజాబ్ కింగ్స్ మాత్రం తమ గత పరాజయాలను మరిచి గెలుపు బాటలోకి రావాలని ఉత్సాహంగా ఉంది. శ్రేయస్ అయ్యర్ తన మాజీ జట్టైన కోల్‌కతాతో తలపడటమే కాకుండా, కేప్టెన్సీ బాధ్యతల్లో కూడా ఉన్నందున అతడి నిర్ణయాలు ఎంతో కీలకంగా మారాయి.

ఈ హై వోల్టేజ్ మ్యాచ్‌లో రెండు జట్లూ తమ సమర్థతను నిరూపించుకోవాలన్న ధృఢ సంకల్పంతో మైదానంలోకి దిగాయి. ఒకవైపు KKR నూతన ఆటగాడు అన్రిచ్ ఎలాంటి ప్రదర్శన ఇస్తాడో చూడాలి, మరోవైపు శ్రేయస్ అయ్యర్ తన మాజీ జట్టుపై గెలుపుతోనే తన కెప్టెన్సీ శైలికి ముద్ర వేయాలన్న ఆత్మవిశ్వాసంతో కనిపించాడు. అభిమానులు కూడా ఈ మ్యాచ్‌లో విజయం ఎవరి సొంతమవుతుందో ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు.

PBKS vs KKR: ప్లేయింగ్ XIలు కోల్‌కతా నైట్ రైడర్స్ ప్లేయింగ్ XI: క్వింటన్ డి కాక్ (WK), సునీల్ నరైన్, అజింక్యా రహానే (c), వెంకటేష్ అయ్యర్ (vc), రింకు సింగ్, ఆండ్రీ రస్సెల్, రమణదీప్ సింగ్, వైభవ్ అరోరా, అన్రిచ్ నార్టే, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి.

పంజాబ్ కింగ్స్ ప్లేయింగ్ XI: ప్రియాంష్ ఆర్య, ప్రభ్‌సిమ్రాన్ సింగ్ (WK), శ్రేయాస్ అయ్యర్ (c), జోష్ ఇంగ్లిస్, నెహాల్ వధేరా, శశాంక్ సింగ్, గ్లెన్ మాక్స్‌వెల్, మార్కో జాన్సెన్, జేవియర్ బార్ట్‌లెట్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్.

మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..