Water 2

వేసవిలో మీకూ వేడి నీళ్లు తాగే అలవాటుందా? జర భద్రం..

15 April 2025

image

TV9 Telugu

ఎండలో బయటకు వెళ్లి... ఇంట్లోకి రాగానే ఓ గ్లాసు చల్లని నీరు తాగితే ఎంత హాయిగా ఉంటుందో కదూ.. ముఖ్యంగా వేసవిలో వేడిని తట్టుకోవడానికి శరీరానికి తగినంత నీటిని తాగుతూ హైడ్రేటెడ్‌గా ఉండాలి

TV9 Telugu

ఎండలో బయటకు వెళ్లి... ఇంట్లోకి రాగానే ఓ గ్లాసు చల్లని నీరు తాగితే ఎంత హాయిగా ఉంటుందో కదూ.. ముఖ్యంగా వేసవిలో వేడిని తట్టుకోవడానికి శరీరానికి తగినంత నీటిని తాగుతూ హైడ్రేటెడ్‌గా ఉండాలి

వేసవి తాపం నుంచి సేద తీరడానికి చాలా మంది చల్లని పానియాలు తాగుతుంటారు. ఆనందంగా ఉండాలన్నా, యాక్టివ్‌గా ఉంటూ మన రోజువారీ పనులన్నింటినీ చకచకా చక్కబెట్టాలన్నా నీళ్లే ఇందనం

TV9 Telugu

వేసవి తాపం నుంచి సేద తీరడానికి చాలా మంది చల్లని పానియాలు తాగుతుంటారు. ఆనందంగా ఉండాలన్నా, యాక్టివ్‌గా ఉంటూ మన రోజువారీ పనులన్నింటినీ చకచకా చక్కబెట్టాలన్నా నీళ్లే ఇందనం

అయితే కొంత మంది చాలా మంది శీతాకాలంలో మాదిరి వేసవి కాలంలోనూ వేడి నీళ్లు తాగుతుంటారు. ముఖ్యంగా మాట్లాడటంలో ఇబ్బంది, సంగీతానికి సంబంధించి సాధన చేసేవారు ప్రతి సీజన్‌లోనూ వేడి నీటిని కూడా తాగుతారు

గోరువెచ్చని నీరు త్రాగడం వల్ల జీర్ణక్రియ సరిగ్గా జరుగుతుంది. బరువును నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది. గొంతును శుభ్రంగా ఉంచుతుంది. గొంతు నొప్పి, కఫం పేరుకుపోవడం వంటి సమస్యలను నియంత్రిస్తుంది

TV9 Telugu

నిజానికి, వేసవి రోజుల్లో కూడా వేడి నీళ్లు తాగవచ్చు. ఇది శరీరం నుంచి విషాన్ని బయటకు పంపడానికి సహాయపడుతుంది. అయితే అతిగా వేడి నీరు తాగడం ఆరోగ్యానికి హానికరం

TV9 Telugu

వేసవి రోజుల్లో కూడా వేడినీరు తాగే అలవాటు ఉంటే ఆరోగ్యానికి హాని కలగకుండా చూసుకోవాలి. ముఖ్యంగా కొన్ని ఆరోగ్య సమస్యలున్న వారు వేసవిలో వేడి నీరు అస్సలు తాగకూడదు

TV9 Telugu

అసిడిటీ సమస్య ఉన్నవారు వేసవిలో ఉదయం పూట వేడినీరు తాగకూడదు. రోజు మొత్తం సాధారణ ఉష్ణోగ్రత కలిగిన నీటిని తాగడానికి ప్రయత్నించడం మంచిది. అలాగే కడుపులో పూతలు, అల్సర్ సమస్యలు, నోటిలో బొబ్బలు ఉన్నవారు వేడినీళ్లు తాగకూడదు. లేకుంటే సమస్య మరింత పెరుగుతుంది

TV9 Telugu

అలాగే వేసవిలో చాలా మంది చల్లటి నీటిని అతిగా తాగడం కూడా మంచిది కాదు. ఇది జీర్ణక్రియలో సమస్యలను కలిగిస్తుంది. బరువు పెరుగుతుంది. గుండెను కూడా దెబ్బతీస్తుంది. గొంతు నొప్పికి కారణమవుతుంది