IPL 2025: 43 ఏళ్ళ వయసులో రికార్డులను బద్దలు కొడుతున్న ధోని! షేన్ వార్న్, క్రిస్ గేల్ లను వెనక్కి నెట్టిన తలా
ఐపీఎల్ 2025లో సీఎస్కే లక్నోపై 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. వరుసగా 5 ఓటముల తరువాత ఈ గెలుపు, జట్టుకు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. ఈ మ్యాచ్‌లో ఎంఎస్ ధోని అజేయంగా 26 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు పొందాడు. 43 ఏళ్ల వయసులో ఈ అవార్డు సాధించడం ద్వారా ధోని చరిత్ర సృష్టించాడు. అయితే ఈ అవార్డు ఎంఎస్ ధోనికి చాలా ప్రత్యేకమైనది. 2019లో చెపాక్ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్‌పై చేసిన 44 పరుగుల ఇన్నింగ్స్ తరువాత, దాదాపు 6 సంవత్సరాల అనంతరం ఆయనకు మరోసారి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ధోని కెప్టెన్‌గా ఇది 17వ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కావడం గమనార్హం.

ఐపీఎల్ 2025 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తిరిగి గెలుపు బాట పట్టింది. లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన 30వ మ్యాచ్‌లో CSK 5 వికెట్ల తేడాతో విజయం సాధించగా, ఈ విజయానికి ప్రధాన కారకుడిగా నిలిచినది ఎంఎస్ ధోని. వరుసగా 5 మ్యాచ్‌ల్లో ఓటమి పాలైన సీఎస్కే ఈ మ్యాచ్‌లో విజయం సాధించడంతో అభిమానుల్లో కొత్త జోష్ నెలకొంది. గత ఏడాది లక్నో చేతిలో ఎదురైన ఓటమికి ఇదే మైదానంలో ప్రతీకారం తీర్చింది. 167 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సీఎస్కే, మూడు బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని చేధించి విజయాన్ని సాధించింది. ఈ మ్యాచ్‌లో ధోని 11 బంతుల్లో అజేయంగా 26 పరుగులు చేసి మ్యాచ్అంతా ఉత్కంఠభరితంగా మార్చాడు. ఈ విజయంలో అతని ఫినిషింగ్ టచ్ కీలకం అయింది.
ధోనికి ఈ ప్రదర్శన కారణంగా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఇదే సమయంలో ధోని 11 ఏళ్ల ఐపీఎల్ రికార్డును బద్దలుచేస్తూ, ఈ అవార్డును గెలుచుకున్న అతిపెద్ద వయస్సు గల ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. 43 సంవత్సరాల 280 రోజుల వయస్సులో ధోని ఈ ఘనత సాధించాడు. ఇంతకు ముందు 2014లో ప్రవీణ్ తంబే 42 సంవత్సరాల 208 రోజుల వయస్సులో ఈ రికార్డును తన పేరుచేసుకున్నాడు. ఇప్పుడా రికార్డును ధోని తనదానిగా మలుచుకున్నాడు. ఈ జాబితాలో ధోనితో పాటు ప్రవీణ్ తంబే, షేన్ వార్న్, ఆడమ్ గిల్‌క్రిస్ట్, క్రిస్ గేల్ వంటి దిగ్గజాలు ఉన్నారు.
ఈ మ్యాచ్‌లో ప్రారంభంలో షేక్ రషీద్ (27), రచిన్ రవీంద్ర (37) తొలి వికెట్‌కు 52 పరుగులు జోడించి మంచి ఆరంభాన్ని ఇచ్చారు. కానీ మధ్యలో సీఎస్కే 4 వికెట్లు కోల్పోవడంతో స్కోరు స్థిరంగా ముందుకు సాగలేదు. 111 పరుగుల వద్ద సగం మంది ఆటగాళ్లు పెవిలియన్ చేరగా, ధోని ఇన్నింగ్స్‌ను చక్కదిద్దేందుకు ముందుకొచ్చాడు. ధోనికి శివం దూబే అద్భుతంగా మద్దతిచ్చాడు. అతను 43 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఇద్దరి భాగస్వామ్యం జట్టుకు విజయం తెచ్చిపెట్టింది.
అయితే ఈ అవార్డు ఎంఎస్ ధోనికి చాలా ప్రత్యేకమైనది. 2019లో చెపాక్ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్‌పై చేసిన 44 పరుగుల ఇన్నింగ్స్ తరువాత, దాదాపు 6 సంవత్సరాల అనంతరం ఆయనకు మరోసారి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ధోని కెప్టెన్‌గా ఇది 17వ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కావడం గమనార్హం. ఆటతీరు, విజయం పట్ల ధోనిలో ఉన్న ఆత్మస్థైర్యం, స్థిరత్వం మరోసారి నిరూపితమయ్యాయి. ఈ వయసులోనూ మ్యాచ్‌ను గెలిపించే తరహాలో ఆటతీరు కనబరచడం ద్వారా ధోని తన అభిమానుల మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్నాడు.
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..