Telangana: బీఆర్ఎస్ పార్టీ పెడితే టీఆర్ఎస్ సంగతేంటి?.. జాతీయ రాజకీయాలపై కేసీఆర్ చాణక్య వ్యూహం ఇదేనా?..

Telangana: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ ఎజెండాతో పాటు రెండు జెండాలను పట్టుకున్నారా? జాతీయ రాజకీయాల కోసం కొత్త పార్టీ పెడుతున్నారా?

Telangana: బీఆర్ఎస్ పార్టీ పెడితే టీఆర్ఎస్ సంగతేంటి?.. జాతీయ రాజకీయాలపై కేసీఆర్ చాణక్య వ్యూహం ఇదేనా?..
Trs
Follow us

|

Updated on: Jun 11, 2022 | 6:45 PM

Telangana: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ ఎజెండాతో పాటు రెండు జెండాలను పట్టుకున్నారా? జాతీయ రాజకీయాల కోసం కొత్త పార్టీ పెడుతున్నారా? మరి తెలంగాణ రాష్ట్ర సమితి సంగతేంటి? భారత్ రాష్ట్ర సమితిలో విలీనం చేస్తారా? లేక రెండు పార్టీలను నడిపిస్తారా? ఇప్పుడిదే తెలంగాణ వ్యాప్తంగా తీవ్ర చర్చ నడుస్తోంది.

భారత్ రాష్ట్ర సమితి నిన్నటి నుంచి తెలంగాణలో బాగా వినిపిస్తున్న పేరు. టీఆర్ఎస్ పార్టీ నేతలు కూడా సోషల్ మీడియాలో ఈ పేరుతో కేసీఆర్ జాతీయ పార్టీ పెడుతున్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం మొదలుపెట్టారు. నిజానికి కేసీఆర్ కూడా నేషనల్ పాలిటిక్స్ వైపు స్పీడ్ పెంచారు. పార్టీ ముఖ్యులతో సమావేశమై దేశాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు సిద్ధం కావాలని సూచించారు. పార్టీ పేరు చెప్పకపోయినా జాతీయ స్థాయిలో మరో పార్టీ పెడతాం అని స్పష్టం చేశారు.

కొత్త పార్టీ ఎందుకు ఉన్న పార్టీతోనే జాతీయ రాజకీయాలు చేయొచ్చు కదా అని చాలామంది సందేహం వ్యక్తం చేస్తున్నారు. కానీ ఒక ప్రాంతం పేరుతో ఏర్పాటైన తెలంగాణ రాష్ట్ర సమితి ఇతర రాష్ట్రాల వాళ్ళు అంగీకరించడం చాలా కష్టం. అన్ని ప్రాంతాలను అన్ని వర్గాలను కలుపుకునేలా పార్టీ పేరు ఉంటేనే దేశంలో మనుగడ ఉంటుంది. అందుకే కేసిఆర్ మరో పార్టీ పెడతానంటూ ప్రయత్నాలు మొదలు పెట్టారు. అయితే, ఇక్కడే పార్టీ కార్యకర్తలకు ఓ సందేహం కూడా కలుగుతుంది. భారత్ రాష్ట్ర సమితి పేరుతో కొత్త పార్టీ పెడితే మరి తెలంగాణ రాష్ట్ర సమితి సంగతి ఏంటి? అనేదే అసలు సందేహం.

ఇవి కూడా చదవండి

కేసీఆర్‌కు ప్రాణం లాంటిది టీఆర్ఎస్ పార్టీ. ఆ మాటకు వస్తే తెలంగాణ ప్రజలకు గొంతుక, ఉద్యమ బావుటా. టీఆర్ఎస్ పార్టీ ని అలాగే లైవ్‌లో ఉంచి మరో పార్టీని స్థాపిస్తే తీవ్ర గందరగోళం ఏర్పడుతుంది. రెండు పార్టీలకు రెండు గుర్తులు ఉంటాయి. రెండు జెండాలు, రెండు ఎజెండాలు ఉంటాయి. కేసీఆర్ జాతీయ అధ్యక్షుడిగా ఇక్కడ టీఆర్ఎస్‌కి మరో అధ్యక్షుడిని నియమించాలి. ఎన్నికల సమయంలో రెండు గుర్తులతో అసెంబ్లీ, పార్లమెంట్‌కు పోటీ చేయడం మొదటికే మోసం వచ్చే ప్రమాదం ఉంది. కనుక రెండు జెండాలతో ముందుకెళ్లడం కష్టమైన పని. రెండు పార్టీలు పొత్తుతో పోటీచేసినా ఏ పార్టీ ప్రచారం ఆ పార్టీ చేసుకుంటుంది. కానీ ఇక్కడ జాతీయ పార్టీ, ప్రాంతీయ పార్టీ నేతలు ఒక్కరే కావడంతో రెండు గుర్తులను ప్రజల్లోకి ప్రమోట్ చేయడం తీవ్ర గందరగోళానికి దారితీస్తుంది.

వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకునే సీఎం కేసీఆర్ కొత్త పార్టీ పెట్టాలని అంశాన్ని తెరపైకి తీసుకువచ్చారు. భారత్ రాష్ట్ర సమితి పేరుతో కొత్త పార్టీని ప్రారంభించి ప్రజల్లోకి తీసుకువెళ్ళిన తర్వాత టీఆర్ఎస్ ని బీఆర్‌ఎస్ లో విలీనం చేయాలనేది ఆయన ఆలోచనగా కనిపిస్తోంది. పాత నేతలే, పాత కార్యకర్తలే కొత్త పార్టీలో కనిపించడం, ప్రజల్లోకి బాగా వెళ్లిన కార్ గుర్తు నే టిఆర్ఎస్ పార్టీ గుర్తుగా ఎంచుకోవడం లాంటివి చేస్తే పార్టీకి ఇబ్బంది ఉండదని కేసీఆర్ భావిస్తున్నట్లు సమాచారం.

రిపోర్టర్: రాకేష్, టీవీ9 తెలుగు.

మరిన్ని పొలిటికల్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు