AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nalgonda: కాంగ్రెస్‌ గూటికి టీఆర్ఎస్ ముఖ్యనేత?.. కొత్త రచ్చకు దారి తీసిన ప్లెక్సీ..!

Nalgonda: నల్లగొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ నేత వేముల వీరేశం ఆ పార్టీని వీడుతున్నారా?

Nalgonda: కాంగ్రెస్‌ గూటికి టీఆర్ఎస్ ముఖ్యనేత?.. కొత్త రచ్చకు దారి తీసిన ప్లెక్సీ..!
Congress
Shiva Prajapati
|

Updated on: Jun 11, 2022 | 5:47 PM

Share

Nalgonda: నల్లగొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ నేత వేముల వీరేశం ఆ పార్టీని వీడుతున్నారా? ఆయన త్వరలోనే కాంగ్రెస్ గూటికి చేరుతారా? అంటే స్థానిక నాయకులు అవుననే అంటున్నారు. దానికి సాక్షిగా కాంగ్రెస్ నేతల మధ్య వెలసిన ఆయన ఫోటో ప్లెక్సీని చూపుతున్నారు. అవును.. నార్కట్‌పల్లి మండలం అమ్మనబోలు వద్ద ఏర్పాటు చేసిన పలు ప్లెక్సీలు టీఆర్ఎస్‌లో కలకలం సృష్టించాయి. కాంగ్రెస్ పార్టీ నేతల ప్లెక్సీలో టీఆర్ఎస్ నకిరెకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం ఫోటో ఉండటం తాజా చర్చకు దారి తీసింది. ఆలయ ప్రారంభోత్సవానికి పీసీసీ రేవంత్ రెడ్డి, ఎంపీ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి లకు స్వాగతం పలుకుతున్నట్లుగా ఏర్పాటు చేసిన కాంగ్రెస్ ప్లెక్సీలో వేముల వీరేశం ఫోటో కూడా పెట్టారు. ఇప్పుడిదే హాట్ టాపిక్‌గా మారింది. కొంతకాలంగా వీరేశం కాంగ్రెస్ గూటికి వెళ్తున్నారంటూ జిల్లా వ్యాప్తంగా జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇలాంటి నేపథ్యంలో తాజా ప్లెక్సీ ఇష్యూతో వేముల వీరేశం కాంగ్రెస్‌లో చేరడం దాదాపు ఖాయం అని స్థానిక నేతలు భావిస్తున్నారు.

ఇదిలాఉండగా.. అభిమానం కొద్ది తమ నేత ఫోటోను ప్లెక్సీలో పెట్టుకున్నారని, ఆయన టీఆర్ఎస్‌ను వీడబోరంటూ వీరేశం అనుచరులు చెబుతున్నారు. తమ నాయకుడిపై కొందరు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గంలో ఆయనకు పెరుగుతున్న ప్రజాభిమానాన్ని చూసి ఓర్వలేని వారే ఇలాంటి ప్రచారాలు చేస్తున్నారని అంటున్నారు. మరోవైపు వేముల వీరేశం కాంగ్రెస్‌లో చేరే ఛాన్సెస్ ఉన్నాయంటూ స్థానిక కాంగ్రెస్ నేతలు సైతం చెవులు కొరుక్కుంటున్నారు. ఆ నేపథ్యంలోనే ఈ ప్లెక్సీ వెలిసిందని చెబుతున్నారు. మరి వారు అలా, వీరు ఇలా అభిప్రాయపడుతున్న నేపథ్యంలో.. వేముల వీరేశం ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే దానిపై కాలమే సమాధానం చెబుతుంది. ఎందుకంటే.. రాజకీయాలు ఎప్పుడు ఏ టర్న్ తీసుకుంటాయో ఎవరూ ఊహించలేరు కదా మరి!

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Follow Us
100 అడుగుల లోయలో పడిన ఆర్టీసీ బస్సులు.. స్పాట్‌లోనే 15 మంది మృతి
100 అడుగుల లోయలో పడిన ఆర్టీసీ బస్సులు.. స్పాట్‌లోనే 15 మంది మృతి
లీటర్ పెట్రోల్ రూ. 82 మాత్రమే.. ఎక్కడో తెలుసా..? మన దేశంలోనే..
లీటర్ పెట్రోల్ రూ. 82 మాత్రమే.. ఎక్కడో తెలుసా..? మన దేశంలోనే..
నేను రోడ్డున పడ్డప్పుడు వచ్చి కలిసిన ఏకైక నటుడు అతను..
నేను రోడ్డున పడ్డప్పుడు వచ్చి కలిసిన ఏకైక నటుడు అతను..
పోలీస్, ఆర్మీ అధికారుల యూనిఫామ్‌పై ఈ తాడు ఎందుకు ఉంటుందో తెలుసా?
పోలీస్, ఆర్మీ అధికారుల యూనిఫామ్‌పై ఈ తాడు ఎందుకు ఉంటుందో తెలుసా?
మే నెలలో బ్యాంకులకు భారీగా సెలవులు.. 9 రోజులు క్లోజ్! లిస్ట్ ఇదే!
మే నెలలో బ్యాంకులకు భారీగా సెలవులు.. 9 రోజులు క్లోజ్! లిస్ట్ ఇదే!
ఐపీఎల్‌లో సరికొత్త చరిత్ర సృష్టించిన శ్రేయాస్ అయ్యర్ టీం..
ఐపీఎల్‌లో సరికొత్త చరిత్ర సృష్టించిన శ్రేయాస్ అయ్యర్ టీం..
NEET UG 2026 పరీక్షకు డ్రెస్ కోడ్ తప్పరిసరి.. ఇలాచేస్తే నో ఎంట్రీ
NEET UG 2026 పరీక్షకు డ్రెస్ కోడ్ తప్పరిసరి.. ఇలాచేస్తే నో ఎంట్రీ
వింటేజ్ పంత్ విధ్వంసం చూశారా.. ఒంటిచేత్తో కళ్లు చెదిరే సిక్సర్..!
వింటేజ్ పంత్ విధ్వంసం చూశారా.. ఒంటిచేత్తో కళ్లు చెదిరే సిక్సర్..!
అందం చూసి మోసపోకండి.. మీరు తినే అరటిపండు అసలైందేనా?
అందం చూసి మోసపోకండి.. మీరు తినే అరటిపండు అసలైందేనా?
భార్యపై అనుమానం.. కవల కుమార్తెల గొంతు కోసి హత్య చేసిన తండ్రి!
భార్యపై అనుమానం.. కవల కుమార్తెల గొంతు కోసి హత్య చేసిన తండ్రి!