Borewell Miracle: కరవుకు నెలవైన ఉమ్మడి అనంతపురం జిల్లాలో అద్భుతం చోటుచేసుకుంది. శ్రీ సత్యసాయి జిల్లా అమలాపురం మండలం కొర్రెవు గ్రామంలో రైతు మాలింగప్ప వేసిన బోరు నుండి ఆకాశాన్ని తాకేలా నీళ్లు ఉబికివచ్చాయి. మడకశిర వంటి ప్రాంతంలో వేల అడుగుల లోతుకు నీటి జాడ దొరకని చోట, ఈ జలధార అందరినీ ఆశ్చర్యపరిచింది.