AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bus Accident :100 అడుగుల లోయలో పడిన ఆర్టీసీ బస్సు.. స్పాట్‌లోనే 15 మంది మృతి

జమ్మూ కశ్మీర్‌లోని ఉధంపూర్ జిల్లాలో సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రామ్‌నగర్ ప్రాంతంలో ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు అదుపుతప్పి సుమారు 100 అడుగుల లోతులో ఉన్న లోయలోకి పడిపోయింది. ఈ ప్రమాదంలో అక్కికక్కడే 15 మంది మృతి చెందగా మరికొంత మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు.

Bus Accident :100 అడుగుల లోయలో పడిన ఆర్టీసీ బస్సు.. స్పాట్‌లోనే 15 మంది మృతి
Dhampur Bus Accident
Anand T
|

Updated on: Apr 20, 2026 | 12:40 PM

Share

100 అడుగుల లోతున్న లోయలోకి బస్సు దూకెళ్లడంతో సుమారు 15 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయిన ఘటన జమ్మూకశ్మీర్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ప్రయాణికులతో రామ్‌నగర్ నుండి ఉధంపూర్ వెళ్తున్న బస్సు వెళ్తున్న ఓ బస్సు ఉదయం10 గంటల ప్రాంతంలో కాగోర్ట్ గ్రామం సమీపంలోని ఒక టర్నింగ్‌ వద్దకు రాగానే అదుపుతప్పి పక్కనే ఉన్న 100 అడుగుల లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో సుమారు 15 మంది ప్రయాణికులు అక్కడికక్కడే మరణించారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు.

సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ సిబ్బందితో సహా వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఉధంపూర్ ఆసుపత్రికి తరలించారు. వీరిలో పలువురి పరిస్థితి అత్యంత క్లిష్టంగా ఉందని మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

మరోవైపు ఈ ఘోర ప్రమాద ఘటనపై జమ్మూ కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. రామ్ నగర్ నుండి ఉధంపూర్‌కు ప్రయాణిస్తున్న ప్రయాణీకుల బస్సు ప్రమాదానికి గురికావడం పట్ల తాను తీవ్ర మనస్తాపానికి గురయ్యానని ఆయన పేర్కొన్నారు.

వీడియో చూడండి..

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us