AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రూ.2కే కోడి గుడ్లు.. కొనేందుకు ఎగబడ్డ జనాలు! కాసేపటికే అసలు యవ్వారం రట్టు

ఓ అంగకుడు రాత్రిపూట కోడి గుడ్ల లోడ్‌తో వచ్చి కేవలం రూ.2లకే గుడ్డు అమ్ముతున్నట్లు ప్రకటించాడు. దీంతో ఆఫర్ నచ్చిన జనాలు తక్కువ ధరకే గుడ్లు లభిస్తుండటంతో కొనేందుకు ఆసక్తి చూపారు. స్థానికులు ఎగబడిమరీ కొంటుంటే కొందరికి ఎందుకో అనుమానం వచ్చి ఓ గుడ్డును పగలగొట్టి చూశారు..

రూ.2కే కోడి గుడ్లు.. కొనేందుకు ఎగబడ్డ జనాలు! కాసేపటికే అసలు యవ్వారం రట్టు
Man Arrested For Selling Rotten Eggs
Srilakshmi C
|

Updated on: Apr 20, 2026 | 10:15 AM

Share

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 19: కోడిగుడ్డు ప్రస్తుతం మార్కెట్‌ ధర ఒకటి రూ.6 పలుకుతుంది. అయితే ఓ అంగకుడు రాత్రిపూట కోడి గుడ్ల లోడ్‌తో వచ్చి కేవలం రూ.2లకే గుడ్డు అమ్ముతున్నట్లు ప్రకటించాడు. దీంతో ఆఫర్ నచ్చిన జనాలు తక్కువ ధరకే గుడ్లు లభిస్తుండటంతో కొనేందుకు ఆసక్తి చూపారు. స్థానికులు ఎగబడిమరీ కొంటుంటే కొందరికి ఎందుకో అనుమానం వచ్చి ఓ గుడ్డును పగలగొట్టి చూశారు. అంతే అసలు యవ్వారం బయటపడింది. ఈ సంఘటన హైదరాబాద్‌లోని బొల్లారం డివిజన్‌ పరిధిలోని జ్యోతి థియేటర్‌ సమీపంలో శనివారం రాత్రి చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే..

బొల్లారం జ్యోతి థియేటర్‌ సమీపంలో శనివారం రాత్రి ఓ గుర్తు తెలియని వ్యక్తి ట్రాలీ ఆటోలో వచ్చి గుడ్లను విక్రయించేందుకు ప్రయత్నించాడు. ఒక్కోగుడ్డు కేవలం రూ.2కే విక్రయిస్తున్నట్లు ప్రకటించాడు. మార్కెట్లో డజను రూ.70 నుంచి రూ.80 పలుకుతున్న గుడ్లు తక్కువ రేటుతో వస్తుండటంతో జనాలు ఎగబడి మరీ కొనడం ప్రారంభించారు. అప్పటికే పలువురు కొనుగోలు చేశారు కూడా. అయితే ఇంత తకువ ధరకే గుడ్లు అమ్మడం చూసిన కొందరికి అనుమానం వచ్చింది. తక్కువ ధరకే గుడ్లు విక్రయించడం ఏంటని ఆలోచించిన జనాలు ఓ గుడ్డును పగలగొట్టారు.

అంతే దాని నుంచి వింత వాసన, నల్లని పదార్థం కనిపించడంతో ఖంగుతిన్నారు. వెంటనే సదరు వ్యక్తిని దొరకపుచ్చకుని పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకొని స్టేషన్‌కు తరలించారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో గుడ్ల అమ్మకందారుడు కొనుగోలు చేసిన వారందరికీ తిరిగి డబ్బులు ఇచ్చేశాడు. మోసం బయటపడకపోతే అక్కడి జనాల వద్ద డబ్బు దండుకుని కుళ్లిన గుడ్లను వారికి అంటగట్టేవాడు. సిటీలో ఇలాంటి మోసాలు చాలానే జరుగుతున్నాయి. అందువల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తక్కవు ధరకు వస్తున్నాయని ఆశపడి మోసపోవద్దని హెచ్చరిస్తున్నారు. కుళ్లిన గుడ్లను అమాయక జనాలకు అమ్మేందుకు ప్రయత్నించిన నిందితుడిని అవి ఎక్కడి నుంచి తీసుకువచ్చాడు, ఎక్కడెక్కడ ఇలాంటి అమ్మకాలు జరుగుతున్నాయో కనుగొనేందుకు పోలీసులు విచారణ చేపట్టారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
'నీట్‌ యూజీ 2026 పరీక్ష రద్దు.. దర్యాప్తుకు సహకరిస్తాం..' ఎన్టీయే
'నీట్‌ యూజీ 2026 పరీక్ష రద్దు.. దర్యాప్తుకు సహకరిస్తాం..' ఎన్టీయే
నేను బీజేపీకి, మోడీకి సపోర్ట్ చేస్తా.. యాంకర్ రష్మీ పోస్ట్ వైరల్
నేను బీజేపీకి, మోడీకి సపోర్ట్ చేస్తా.. యాంకర్ రష్మీ పోస్ట్ వైరల్
ఆరుగురు కెప్టెన్లు ఒకటే తప్పు.. రూల్స్ చాలా స్ట్రిక్ట్ గురూ
ఆరుగురు కెప్టెన్లు ఒకటే తప్పు.. రూల్స్ చాలా స్ట్రిక్ట్ గురూ
ఇంట్లో టమాటాలు త్వరగా పాడవుతున్నాయా.. వారం రోజులైనా ఫ్రెష్‌గా..
ఇంట్లో టమాటాలు త్వరగా పాడవుతున్నాయా.. వారం రోజులైనా ఫ్రెష్‌గా..
తీగ మల్లెపూలు బుట్టలు బుట్టలుగా పూయాలా.. అద్భతమైన చిట్కాలు ఇవే
తీగ మల్లెపూలు బుట్టలు బుట్టలుగా పూయాలా.. అద్భతమైన చిట్కాలు ఇవే
ప్రపంచంలో ఏ దేశం దగ్గర ఎక్కువ బంగారం ఉంది..? భారత్ ఏ స్థానంలో ఉంద
ప్రపంచంలో ఏ దేశం దగ్గర ఎక్కువ బంగారం ఉంది..? భారత్ ఏ స్థానంలో ఉంద
ఒకే ఫోన్ నంబర్‌తో బల్క్ బుకింగ్స్.. శ్రీవాణి టికెట్ల పేరిట..
ఒకే ఫోన్ నంబర్‌తో బల్క్ బుకింగ్స్.. శ్రీవాణి టికెట్ల పేరిట..
ప్రపంచం పొదుపు బాటలో.. మోదీ పిలుపు వెనుక గ్లోబల్ అలర్ట్!
ప్రపంచం పొదుపు బాటలో.. మోదీ పిలుపు వెనుక గ్లోబల్ అలర్ట్!
డీజే వాడితే రెండు లక్షలు జరిమానా.. ఎందుకంటే?
డీజే వాడితే రెండు లక్షలు జరిమానా.. ఎందుకంటే?
ఈ పూలు పగటిపూట కాదు.. చంద్రుని వెలుగులోనే తమ అందాన్ని చూపిస్తాయి!
ఈ పూలు పగటిపూట కాదు.. చంద్రుని వెలుగులోనే తమ అందాన్ని చూపిస్తాయి!