AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Fuel Prices: లీటర్ పెట్రోల్ రూ. 82, డీజిల్ రూ. 78.05 మాత్రమే.. ఎక్కడో తెలుసా..? మన దేశంలోనే..

Petrol, Diesel Prices: గ్లోబల్ మార్కెట్‌లో క్రూడ్ ఆయిల్ ధరల పెరుగుదల నేపథ్యంలో మున్ముందు దేశవ్యాప్తంగా ధరల పెంపు ఉండే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే ప్రైవేట్ కంపెనీలు ధరలు సవరించగా, ప్రభుత్వ రంగ సంస్థలు కూడా అదే బాటలో నడిచే సూచనలు ఉన్నాయి..

Subhash Goud
|

Updated on: Apr 20, 2026 | 12:09 PM

Share
 Petrol, Diesel Prices: ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా గ్లోబల్ మార్కెట్‌లో బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర 115 డాలర్లు దాటిపోయింది. దీని ప్రభావంతో ఇప్పటికే పలు ప్రైవేట్ ఆయిల్ కంపెనీలు ధరలు పెంచగా, దేశవ్యాప్తంగా పెట్రోల్ ధరలు ఎప్పుడైనా పెరగవచ్చనే ఆందోళన నెలకొంది. ప్రస్తుతం హైదరాబాద్, ముంబై వంటి నగరాల్లో పెట్రోల్ రూ. 107-110 మధ్యలో ఉంది. కానీ, ఆశ్చర్యకరంగా మన దేశంలోని ఒక ప్రాంతంలో మాత్రం లీటర్ పెట్రోల్ కేవలం రూ. 82.46లకే లభిస్తోంది.

1 / 5
 ఎక్కడ ఇంత తక్కువ ధర? దేశంలోని ప్రధాన మెట్రో నగరాలతో పోలిస్తే దాదాపు రూ. 25 వరకు తక్కువ ధరకే పెట్రోల్ లభిస్తున్న ఆ ప్రాంతం అండమాన్ నికోబార్ దీవులు. తాజా గణాంకాల ప్రకారం ఇక్కడ ధరలు ఇలా ఉన్నాయి: పెట్రోల్: రూ. 82.46 (లీటరుకు), డీజిల్: రూ. 78.05 (లీటరుకు) అండమాన్ నికోబార్‌తో పాటు దాద్రా నగర్ హవేలీ, డామన్ డయ్యూ వంటి కేంద్రపాలిత ప్రాంతాల్లో కూడా మిగిలిన రాష్ట్రాల కంటే ఇంధన ధరలు తక్కువగానే ఉన్నాయి.

2 / 5
 అక్కడ అంత తక్కువగా ఉండటానికి కారణాలేంటి? భారతదేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ప్రాంతాన్ని బట్టి మారుతుంటాయి. దీనికి ప్రధానంగా మూడు కారణాలు ఉన్నాయి. వ్యాట్ (VAT) లేకపోవడం: పెట్రోలియం ఉత్పత్తులు ఇంకా జీఎస్‌టీ (GST) పరిధిలోకి రాలేదు. దీంతో ప్రతి రాష్ట్రం తన అవసరాలకు అనుగుణంగా 'వాల్యూ యాడెడ్ టాక్స్' (VAT) విధిస్తుంది. కొన్ని రాష్ట్రాల్లో ఇది 35% వరకు ఉంటుంది. అయితే అండమాన్ వంటి కేంద్రపాలిత ప్రాంతాల్లో రాష్ట్ర ప్రభుత్వాల జోక్యం ఉండదు, స్థానిక పన్నులు చాలా తక్కువగా ఉంటాయి.

3 / 5
 కేంద్రం పరిధిలో ఉండటం: ఇక్కడ కేవలం కేంద్ర ప్రభుత్వం విధించే ఎక్సైజ్ డ్యూటీ మాత్రమే ఉంటుంది. అదనపు సెస్‌లు, రోడ్డు అభివృద్ధి పన్నులు వంటివి రాష్ట్రాలతో పోలిస్తే ఇక్కడ చాలా తక్కువ. రవాణా, కమీషన్: ఇంధన రవాణా ఖర్చులు, డీలర్ల కమీషన్ కూడా ధరపై ప్రభావం చూపుతాయి. ఇతర రాష్ట్రాల్లో కాలుష్య నియంత్రణ పన్ను, సామాజిక సంక్షేమ పన్నుల పేరుతో భారీగా వసూలు చేస్తుండటంతో అక్కడ ధరలు సెంచరీ దాటేశాయి.

4 / 5
 గ్లోబల్ మార్కెట్‌లో క్రూడ్ ఆయిల్ ధరల పెరుగుదల నేపథ్యంలో మున్ముందు దేశవ్యాప్తంగా ధరల పెంపు ఉండే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే ప్రైవేట్ కంపెనీలు ధరలు సవరించగా, ప్రభుత్వ రంగ సంస్థలు కూడా అదే బాటలో నడిచే సూచనలు ఉన్నాయి. ఇలాంటి తరుణంలో అండమాన్ వంటి ప్రాంతాల్లో తక్కువ ధరలు ఉండటం అక్కడి ప్రజలకు పెద్ద ఊరట అనే చెప్పాలి.

5 / 5
Follow Us
మాన్‌సూన్ దెబ్బకు రైతుల్లో టెన్షన్.. ఇప్పుడు సీన్ మారింది! ఖరీఫ్‌

రబ్బర్ తెల్లగా వస్తే టైర్ ఎందుకు నల్లగా ఉంటుంది?

FDలో డబ్బులు పెడుతున్నారా? వయసును బట్టి మారే ఈ రూల్స్ తెలుసుకోండి

ఇరుముడి సినిమాలో కనిపించిన ఈ అమ్మడు ఎవరో తెలుసా.?

శ్రావణ సోమవారం: మార్కండేయుడిని మృత్యువు నుంచి కాపాడిన శివుడు..

ఓరేయ్.. ఎంతపని చేశావురా.. అందరూ తినే ఆయిల్‌ ట్యాంక్‌లోకి దిగి

శ్రీలంక పై గెలిస్తే డబ్ల్యూటీసీ పట్టికలో భారత్ ప్లేస్ ఇదే

దేశంలో పెరుగుతున్న H1N1 కేసులు.. ICMR కీలక ప్రకటన

మహిళను ముక్కలుగా నరికి బిర్యానీ గిన్నెలో దాచిపెట్టారు..

పునాది నుంచి స్లాబ్ వరకు ఒక పిల్లర్ వేయడానికి ఎంత ఖర్చు అవుతుంది?