AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అన్నీ కోల్పోయి రోడ్డున పడ్డప్పుడు వచ్చి ఓ బంగారు గొలుసు ఇచ్చిన నటుడు అతను..

ఓ ఆడియో లాంచ్‌ కార్యక్రమంలో దర్శకుడు పూరి జగన్నాథ్ హాస్యనటుడు అలీతో తనకున్న దశాబ్దాల అనుబంధాన్ని వివరించారు. కష్టాల్లో తాను ఎదుర్కొన్న ఆర్థిక ఇబ్బందుల సమయంలో అలీ అండగా నిలిచిన విధానాన్ని గుర్తుచేసుకున్నారు. కేవలం సినిమా నటుడిగా కాకుండా, మనుషుల కోసం నిలబడే నిజమైన హీరో అలీ అని పూరి కొనియాడారు.

అన్నీ కోల్పోయి రోడ్డున పడ్డప్పుడు వచ్చి ఓ బంగారు గొలుసు ఇచ్చిన నటుడు అతను..
Puri Jagannadh
Ram Naramaneni
|

Updated on: Apr 20, 2026 | 12:02 PM

Share

ఓ ఆడియో లాంచ్ వేడుకలో ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్, హాస్యనటుడు అలీ గురించి చేసిన భావోద్వేగ ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది. అలీతో తనకు దశాబ్దాల తరబడి ఉన్న అనుబంధాన్ని, ఆయన తన జీవితంలో పోషించిన కీలక పాత్రను పూరి వివరించారు. పదేళ్ల వయసు నుంచే అలీకి తాను వీరాభిమానినని పూరి తెలిపారు. సీతాకోకచిలుక సినిమా చూసిన తర్వాత, తుని గంగాధర్ మ్యూజికల్ పార్టీతో అలీ వస్తున్నాడని తెలిసి, అప్పుడు పదేళ్ల వయసులో ఒక్కడినే 50 కిలోమీటర్లు ప్రయాణించి అలీని చూడడానికి వెళ్లానని గుర్తుచేసుకున్నారు. అప్పట్లో అలీ అమితాబ్ బచ్చన్ పాటలకు డాన్స్ చేసేవాడని, తనకంటే పొట్టిగా ఉండేవారని పూరి ఆనాటి జ్ఞాపకాలను పంచుకున్నారు. తాను దర్శకుడిగా మారిన తర్వాత అలీతో కలిసి అనేక విజయవంతమైన చిత్రాలను తీశానని పూరి పేర్కొన్నారు. తమ కలయికలో వచ్చిన సినిమాలు ఎన్నో విజయాలు సాధించాయని తెలిపారు. తన జీవితంలో సంతోషం వచ్చినా, కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, ఫెయిల్యూర్ వచ్చినా అలీ తనతోడుగా నిలిచారని పూరి స్పష్టం చేశారు.

“నాకు ఫెయిల్యూర్‌లో ఉండి.. బాదలో ఉన్నప్పుడు తనే వస్తాడు. ఒక పెగ్గు పోస్తాడు, ఓ భుజం తట్టి వెళ్లిపోతాడు. నాకు హిట్ వచ్చింది, ఒక బొకే పట్టుకొని వస్తాడు. హగ్ చేసుకొని వెళ్లిపోతాడు. చెప్పకుండా వచ్చి కలిసే ఏకైక మనిషి అలీ” అని పూరి అలీతో తనకున్న అనుబంధాన్ని వివరించారు. అలీ తనకు ఆర్థికంగా అండగా నిలిచిన ఒక సందర్భాన్ని పూరి గుర్తుచేసుకున్నారు. ఒకానొక దశలో తను  ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొని, మొత్తం ఆస్తిపాస్తులు అమ్మివేసి, తన చివరి ఆఫీసును కూడా అమ్మివేయాలని నిర్ణయించుకున్న సమయంలో అలీ వచ్చారని పూరి తెలిపారు. ఆ రోజు అలీ తన జేబులో నుంచి ఒక డిజైన్ ఉన్న బంగారు ఆభరణాన్ని తీసి, దానికి కుంకుమ పెట్టి, “ఇది మెడలో వేసుకో. నీకు దేవుడి మీద నమ్మకం లేకపోతే జోబులో పెట్టుకో. పోయినవన్నీ మళ్లీ వస్తాయి” అని చెప్పి, ఆలింగనం చేసుకొని వెళ్లిపోయారని పూరి వివరించారు. ఆ బంగారం రెండు, మూడు లక్షల రూపాయల విలువ ఉంటుందని, అప్పట్లో ఆ మాత్రం డబ్బులు కూడా తన వద్ద లేవని పూరి పేర్కొన్నారు. అలీ ఆశీస్సులతో రెండేళ్లలో మళ్లీ అన్నీ తిరిగి పొందానని భావోద్వేగంగా చెప్పారు. అలీని కేవలం సినిమా నటుడు మాత్రమే కాదని, నిజంగా తన మనుషుల కోసం నిలబడడే రియల్ హీరో అలీ అని పూరి కొనియాడారు. తన ఇస్మార్ట్ శంకర్ చిత్రంలో అలీ లేకపోవడంపై ప్రేక్షకులు తనను ప్రశ్నించారని, అందుకే తదుపరి చిత్రంలో అలీకి తప్పకుండా అవకాశం ఇస్తానని పూరి హామీ ఇచ్చారు.

Ali Puri Jagannadh

Ali Puri Jagannadh

Also Read Anantha Sriram: ‘ఆ పాట 100 మిలియన్ కొట్టింది.. రాయల్టీనే రూ.19 లక్షలు వచ్చింది’ 

Follow Us
'నీట్‌ యూజీ 2026 పరీక్ష రద్దు.. దర్యాప్తుకు సహకరిస్తాం..' ఎన్టీయే
'నీట్‌ యూజీ 2026 పరీక్ష రద్దు.. దర్యాప్తుకు సహకరిస్తాం..' ఎన్టీయే
నేను బీజేపీకి, మోడీకి సపోర్ట్ చేస్తా.. యాంకర్ రష్మీ పోస్ట్ వైరల్
నేను బీజేపీకి, మోడీకి సపోర్ట్ చేస్తా.. యాంకర్ రష్మీ పోస్ట్ వైరల్
ఆరుగురు కెప్టెన్లు ఒకటే తప్పు.. రూల్స్ చాలా స్ట్రిక్ట్ గురూ
ఆరుగురు కెప్టెన్లు ఒకటే తప్పు.. రూల్స్ చాలా స్ట్రిక్ట్ గురూ
ఇంట్లో టమాటాలు త్వరగా పాడవుతున్నాయా.. వారం రోజులైనా ఫ్రెష్‌గా..
ఇంట్లో టమాటాలు త్వరగా పాడవుతున్నాయా.. వారం రోజులైనా ఫ్రెష్‌గా..
తీగ మల్లెపూలు బుట్టలు బుట్టలుగా పూయాలా.. అద్భతమైన చిట్కాలు ఇవే
తీగ మల్లెపూలు బుట్టలు బుట్టలుగా పూయాలా.. అద్భతమైన చిట్కాలు ఇవే
ప్రపంచంలో ఏ దేశం దగ్గర ఎక్కువ బంగారం ఉంది..? భారత్ ఏ స్థానంలో ఉంద
ప్రపంచంలో ఏ దేశం దగ్గర ఎక్కువ బంగారం ఉంది..? భారత్ ఏ స్థానంలో ఉంద
ఒకే ఫోన్ నంబర్‌తో బల్క్ బుకింగ్స్.. శ్రీవాణి టికెట్ల పేరిట..
ఒకే ఫోన్ నంబర్‌తో బల్క్ బుకింగ్స్.. శ్రీవాణి టికెట్ల పేరిట..
ప్రపంచం పొదుపు బాటలో.. మోదీ పిలుపు వెనుక గ్లోబల్ అలర్ట్!
ప్రపంచం పొదుపు బాటలో.. మోదీ పిలుపు వెనుక గ్లోబల్ అలర్ట్!
డీజే వాడితే రెండు లక్షలు జరిమానా.. ఎందుకంటే?
డీజే వాడితే రెండు లక్షలు జరిమానా.. ఎందుకంటే?
ఈ పూలు పగటిపూట కాదు.. చంద్రుని వెలుగులోనే తమ అందాన్ని చూపిస్తాయి!
ఈ పూలు పగటిపూట కాదు.. చంద్రుని వెలుగులోనే తమ అందాన్ని చూపిస్తాయి!