AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bank Holidays: మే నెలలో బ్యాంకులకు భారీగా సెలవులు.. 9 రోజులు క్లోజ్! హాలిడేస్ లిస్ట్ ఇదే!

Bank Holidays in May 2026: బ్యాంక్ శాఖలు మూతపడినప్పటికీ.. నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, యూపీఐ (UPI) సేవలు 24 గంటలూ అందుబాటులో ఉంటాయి. ఏదైనా ముఖ్యమైన బ్యాంకు పని ఉంటే చివరి నిమిషం వరకు ఆగకుండా, కనీసం ఒక వారం ముందే పూర్తి చేసుకోవడం..

Subhash Goud
|

Updated on: Apr 20, 2026 | 11:46 AM

Share
Bank Holidays in May 2026: మే నెలలో బ్యాంకు లావాదేవీలు నిర్వహించే వారికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కీలక సమాచారం అందించింది. పండుగలు, వారాంతపు సెలవుల కారణంగా వచ్చే నెలలో మొత్తం 9 రోజుల పాటు బ్యాంకులు పని చేయవు. ఈ సెలవుల జాబితాను గమనించకుండా ప్లాన్ చేసుకుంటే ఇబ్బందులు తప్పవు.

1 / 5
 వారాంతపు సెలవులే ఎక్కువ: ఈ ఏడాది మే నెలలో సెలవుల సంఖ్య పెరగడానికి ప్రధాన కారణం ఆదివారాలు. ఈ నెలలో ఏకంగా ఐదు ఆదివారాలు రావడం విశేషం. ఆదివారాలు: మే 3, 10, 17, 24, 31 తేదీలలో బ్యాంకులు మూతపడతాయి. అలాగే రెండో, నాలుగో శనివారాలు: మే 9 (రెండో శనివారం), మే 23 (నాలుగో శనివారం) తేదీల్లో కూడా బ్యాంకులు పని చేయవు.

2 / 5
 పండుగ సెలవులు: వారాంతపు సెలవులతో పాటు మే నెలలో కొన్ని ముఖ్యమైన పండుగ సెలవులు కూడా ఉన్నాయి: మే 1 (మే డే/కార్మిక దినోత్సవం): నెల ఆరంభంలోనే మే డే సందర్భంగా ఏపీ, తెలంగాణతో పాటు చాలా రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవు ఉంటుంది. మే 27 (బక్రీద్): ముస్లిం సోదరులు జరుపుకునే ఈ పెద్ద పండుగ సందర్భంగా దేశవ్యాప్తంగా దాదాపు అన్ని బ్యాంకులు మూతపడతాయి.

3 / 5
 ఖాతాదారులు గమనించాల్సిన విషయాలు: నగదు కొరత: వరుస సెలవుల వల్ల ఏటీఎంలలో నగదు త్వరగా ఖాళీ అయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా పెళ్లిళ్ల సీజన్ కావడంతో నగదు అవసరాలు ఎక్కువగా ఉంటాయి, కాబట్టి ముందే సిద్ధం చేసుకోవడం మంచిది. ఇక చెక్కుల క్లియరెన్స్: బ్యాంకులకు సెలవు ఉన్న రోజుల్లో చెక్కుల క్లియరెన్స్ ప్రక్రియ జరగదు. దీనివల్ల వ్యాపార లావాదేవీలు ఆలస్యం అయ్యే ప్రమాదం ఉంది.

4 / 5
 డిజిటల్ బ్యాంకింగ్: బ్యాంక్ శాఖలు మూతపడినప్పటికీ.. నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, యూపీఐ (UPI) సేవలు 24 గంటలూ అందుబాటులో ఉంటాయి. ఏదైనా ముఖ్యమైన బ్యాంకు పని ఉంటే చివరి నిమిషం వరకు ఆగకుండా, కనీసం ఒక వారం ముందే పూర్తి చేసుకోవడం శ్రేయస్కరం. ఈ సెలవుల జాబితాను దృష్టిలో ఉంచుకుని మీ ఆర్థిక ప్రణాళికను సిద్ధం చేసుకోండి.

5 / 5
Follow Us
US F1 వీసా స్లాట్‌ కోసం రూ.20 వేలు డిమాండ్.. ఇంటర్వ్యూ రద్దు

వెంటిలేటర్‌పై ప్రాణాలతో పోరాడుతోన్న 'అగ్గిపెట్టె మచ్చ'..ఏమైందంటే?

ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో సీబీఐ సోదాలు..!

గురు నక్షత్ర గోచారంతో వీరికి కొత్త అవకాశాలు, ఆర్థిక లాభాలు

టెర్మినేటర్ సీన్ రిపీట్! వేడి లావాలోకి దూకేసిన హ్యూమనాయిడ్ రోబోలు

ఆకాశవాణి భవన్‌ వద్ద హైటెన్షన్.. రాహుల్‌గాంధీ సహా కాంగ్రెస్ నేతల అరెస్ట్..!

బంగారం ధర 26% పతనం.. ఇదే కొనడానికి సరైన సమయమా? వేచి ఉండాలా?

అంతర్జాతీయ వేధింపుల గ్యాంగ్‌ వెనుక భారతీయుడు!

‘కోర్టు’ హీరోయిన్ కొత్త సినిమా ట్రైలర్
‘కోర్టు’ హీరోయిన్ కొత్త సినిమా ట్రైలర్
హాయిగా నిద్రపోండి-లక్షల్లో గెలుచుకోండి! వినూత్న స్లీప్ కాంపిటీషన్