పొలిటికల్ కమాండర్‎లా మారిన సీఎం రేవంత్.. ఢిల్లీ హైకమాండ్ సపోర్ట్‎ వెనుక అసలు కారణం ఏంటి..

తెలంగాణ కాంగ్రెస్‌లో రేవంత్‌రెడ్డి కమాండర్‌గా మారారా? హైకమాండ్‌ రేవంత్‌ మాటకే ఎక్కువ విలువ ఇస్తోందా? అధిష్టానం అండతో ఎంపీ టిక్కెట్లు అనుచరులకే కట్టుబెట్టుకుంటున్నారా? వయా ఢిల్లీ ఫార్ములాతో మంత్రులకు సైతం చెక్‌ పెడుతున్నారా? ఇంతకీ.. తెలంగాణ కాంగ్రెస్‌లో అసలేం జరుగుతోంది? ఎంపీ అభ్యర్థుల ఎంపిక విషయంలో రేవంత్‌ స్ట్రాటజీ ఏంటి?

పొలిటికల్ కమాండర్‎లా మారిన సీఎం రేవంత్.. ఢిల్లీ హైకమాండ్ సపోర్ట్‎ వెనుక అసలు కారణం ఏంటి..
Cm Revanth
Follow us

|

Updated on: Apr 20, 2024 | 7:34 AM

తెలంగాణ కాంగ్రెస్‌లో రేవంత్‌రెడ్డి కమాండర్‌గా మారారా? హైకమాండ్‌ రేవంత్‌ మాటకే ఎక్కువ విలువ ఇస్తోందా? అధిష్టానం అండతో ఎంపీ టిక్కెట్లు అనుచరులకే కట్టుబెట్టుకుంటున్నారా? వయా ఢిల్లీ ఫార్ములాతో మంత్రులకు సైతం చెక్‌ పెడుతున్నారా? ఇంతకీ.. తెలంగాణ కాంగ్రెస్‌లో అసలేం జరుగుతోంది? ఎంపీ అభ్యర్థుల ఎంపిక విషయంలో రేవంత్‌ స్ట్రాటజీ ఏంటి?

తెలంగాణ రాజకీయాలు వాడీవేడిగా కొనసాగుతున్నాయి. పార్లమెంట్‌ ఎన్నికల నేపథ్యంలో అన్ని పార్టీలూ ప్రచారంలో దూకుడు పెంచాయి. ఒకవైపు ప్రచారం.. మరోవైపు నామినేషన్లతో బిజీబిజీగా గడుపుతున్నారు ఆయా పార్టీల నేతలు. ఈ క్రమంలోనే.. సీఎం రేవంత్‌రెడ్డి సైతం స్పీడ్‌ పెంచారు. నామినేషన్ల పర్వం నడుస్తుండడంతో నాగర్‌కర్నూల్‌, మహబూబాబాద్‌ సభలతో అభ్యర్థుల తరపున ప్రచారానికి శ్రీకారం చుట్టారు. అయితే.. అభ్యర్థుల ఎంపిక నుంచి ప్రచారం వరకు సీఎం రేవంత్‌రెడ్డి ఏకచత్రాధిపత్యం వహిస్తున్నట్లు కాంగ్రెస్‌ పార్టీ శ్రేణుల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. అందుకు.. భువనగిరి ఎంపీ అభ్యర్థి ఎంపిక, పాత టీడీపీ నేతలకు ఇస్తోన్న ప్రాధాన్యతే నిదర్శనంగా చెప్తున్నారు. నిజానికి.. భువనగిరి ఎంపీ టిక్కెట్‌ కోసం ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తీవ్ర ప్రయత్నాలు చేశారు. ఆయన సతీమణి లక్ష్మికి ఎంపీ టిక్కెట్‌ తెచ్చుకునేందుకు ఢిల్లీ లెవెల్లోనూ పోరాటం సాగించారు. కానీ.. సీఎం రేవంత్‌రెడ్డి మాత్రం తన అనుచరుడైన చామల కిరణ్‌కుమార్‌రెడ్డికే ఇప్పించుకున్నారు. అటు.. భువనగిరి కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థిగా చామల కిరణ్‌కుమార్‌రెడ్డి పేరును రేవంత్‌రెడ్డి అధిష్టానానికి పంపడంతో ఆయనకే ఆమోద్ర ముద్ర వేసింది.

మరోవైపు.. తెలంగాణలో నామినేషన్ల వేళ ఇప్పుడు ఖమ్మం పార్లమెంట్‌ అభ్యర్థి ఎంపిక కూడా టీ.కాంగ్రెస్‌కు పెద్ద టాస్క్‌గా మారింది. ప్రస్తుతం.. ఖమ్మం, కరీంనగర్‌, హైదరాబాద్‌.. ఈ మూడు పార్లమెంట్‌ నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపిక రేవంత్‌రెడ్డికి సవాల్‌గా తయారైంది. అటు.. నామినేషన్లకు గడువు దగ్గర పడుతుండడంతో ముగ్గురు ఎంపీ అభ్యర్థులకు సంబంధించిన కసరత్తు చివరి దశకు చేరుకుంది. అయితే.. ఖమ్మం జిల్లా నుంచి ముగ్గురు సీనియర్‌ మంత్రులు వారి కుటుంబ సభ్యుల కోసం పట్టుబడుతుండగా.. అధిష్టానం మాత్రం.. ఖమ్మం కమ్మ సామాజికవర్గానికి పట్టున్న జిల్లా కావడంతో ఆ ఈక్వేషన్స్‌ మేరకే క్యాండేట్‌ను డిసైడ్‌ చేయాలని భావిస్తోంది. గతంలో కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేతలే విజయం సాధించిన చరిత్ర ఉండడంతో ఆ సామాజికవర్గానికే టిక్కెట్ ఇవ్వాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే.. సీనియర్‌ నేత మండవ వెంకటేశ్వరరావు వైపు కాంగ్రెస్‌ అధిష్టానం మొగ్గు చూపినట్లు ప్రచారం జరుగుతోంది.

ఇవి కూడా చదవండి

ఇక.. కమ్మ ఓటు బ్యాంకు, టీడీపీ బలంగా ఉండడంతో ఆయా సమీకరణాలతో ఖమ్మంలో గెలుపు ఈజీ అవుతుందని టీ.కాంగ్రెస్‌ నేతలు భావిస్తున్నారు. అయితే.. ఖమ్మం టిక్కెట్‌ విషయంలోనూ సీఎం రేవంత్‌రెడ్డే చక్రం తిప్పుతున్నట్లు గట్టిగా టాక్‌ వినిపిస్తోంది. సీఎం రేవంత్‌రెడ్డికి కాంగ్రెస్‌ అధిష్టానం ఇస్తోన్న ప్రిపరెన్సే అందుకు కారణంగా తెలుస్తోంది. వరుస పరిణామాలతో హైకమాండ్‌ సైతం రేవంత్‌ మాటకే ఎక్కువ విలువ ఇస్తున్నందన్న చర్చ లేకపోలేదు. దీని ద్వారా.. మంత్రులకు సైతం సీఎం రేవంత్‌ చెక్‌ పెడుతున్నారనే ప్రచారం పొలిటికల్‌ సర్కిల్స్‌లో జోరుగా సాగుతోంది. అయితే.. ఖమ్మం ఎంపీ టిక్కెట్‌ కోసం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గట్టిగా పట్టుబడుతున్నారు. కానీ.. వయా ఢిల్లీ ఫార్ములాతో మినిస్టర్స్‌ను సైతం రేవంత్‌ సైడ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక.. భువనగిరి, ఖమ్మం ఎంపీ టిక్కెట్ల విషయంలోనే కాదు.. మెజార్టీ స్థానాల్లో రేవంత్‌ తీసుకొచ్చిన వలస, పాత టీడీపీ నేతలకే టిక్కెట్లు ఇస్తున్నారనే ఆరోపణలు, విమర్శలు సైతం వ్యక్తం అవుతున్నాయి. మొత్తంగా.. టీ.కాంగ్రెస్‌ రాజకీయాలు.. వన్‌ అండ్‌ ఓన్లీ సీఎం రేవంత్‌ అన్నట్లే కొనసాగుతున్నాయి. ఢిల్లీ హైకమాండ్‌ దగ్గర పట్టు సాధించే కొద్దీ.. రేవంత్‌ కమాండర్‌గా మారిపోతున్నారు. అయితే.. ఆయా పరిణామాలపై రాబోయే రోజుల్లో మంత్రులు, సీనియర్స్‌ నుంచి ఎలాంటి రియాక్షన్స్‌ వస్తాయో చూడాలి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..