Watch Video: ఆ పరిస్థితి వస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా: దానం నాగేందర్

కాగా లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 12 నుంచి 14 సీట్లు వస్తాయని దానం నాగేందర్ ధీమా వ్యక్తంచేశారు. రేవంత్ రెడ్డి బీజేపీలో చేరుతారని జరుగుతున్న విష ప్రచారాన్ని ప్రజలు నమ్మబోరన్నారు. కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న ఆరు గ్యారెంటీలకు ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తోందన్నారు.

Watch Video: ఆ పరిస్థితి వస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా: దానం నాగేందర్

|

Updated on: Apr 19, 2024 | 6:50 PM

తాను ఎంపీగా గెలిచినా.. ఖైరతాబాద్ ప్రజలకు అందుబాటులో ఉంటానని అన్నారు సికింద్రాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి దానం నాగేందర్. సికింద్రాబాద్ ఎంపీగా గెలిచినా ఖైరతాబాద్ నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తానని చెప్పారు. ఇచ్చిన వాగ్ధానాలను నెరవేర్చలేని పరిస్థితి వస్తే రాజకీయాల నుంచే తప్పుకుంటానన్నారు. విద్వేషపూరిత రాజకీయాలతో లబ్ధి పొందాలనుకునే వారికి ఎన్నికల్లో బుద్ధి చెప్పాలన్నారు. దేశంలో అనేక సంస్థలను స్థాపించి వేలాది మందికి ఉద్యోగాలు కల్పించింది కాంగ్రెస్ పార్టీనే అన్నారు. సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలలో విస్తృత ప్రచారాన్ని నిర్వహించనున్నట్లు చెప్పారు.

కాగా లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 12 నుంచి 14 సీట్లు వస్తాయని దానం ధీమా వ్యక్తంచేశారు. రేవంత్ రెడ్డి బీజేపీలో చేరుతారని జరుగుతున్న విష ప్రచారాన్ని ప్రజలు నమ్మబోరన్నారు. కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న ఆరు గ్యారెంటీలకు ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తోందన్నారు.

Follow us