Weekend Hour: లీకురత్నాలు.. తెలంగాణ రాజకీయాల్లో TSPSC లీక్స్ ప్రకంపనలు
తెలంగాణలో ప్రకంపనలు సృష్టిస్తోంది TSPSC పేపర్ లీకేజ్ వ్యవహారం. అభ్యర్ధులకు ఎలాంటి నష్టం జరగకుండా కీలక నిర్ణయాలు తీసుకున్న ప్రభుత్వం.. అటు రాజకీయంగా వస్తున్న విమర్శలకు కూడా చెక్ పెడుతోంది.
తెలంగాణలో ప్రకంపనలు సృష్టిస్తోంది TSPSC పేపర్ లీకేజ్ వ్యవహారం. అభ్యర్ధులకు ఎలాంటి నష్టం జరగకుండా కీలక నిర్ణయాలు తీసుకున్న ప్రభుత్వం.. అటు రాజకీయంగా వస్తున్న విమర్శలకు కూడా చెక్ పెడుతోంది. ఖచ్చితంగా ప్రభుత్వ వైఫల్యం ఉందని విపక్షాలు ఆరోపిస్తుంటే.. ఇద్దరు వ్యక్తులు చేసిన తప్పును ప్రభుత్వానికి ఆపాదించడంపై మండిపడుతోంది అధికారపక్షం. అటు సిట్ విచారణలో స్పీడు పెంచితే… ఇటు లీకేజీలో రాజకీయ కుట్ర కోణాన్ని తెరమీదకు తీసుకొచ్చాయి పార్టీలు.
తెలంగాణలో TSPSC లీకేజి ప్రకంపనలు హీటెక్కిస్తున్నాయి. ఇప్పటికే ఈ కేసులో నిందితులను అరెస్టు చేసి విచారణ చేపట్టిన సిట్ కీలక ఆధారాలు సేకరిస్తోంది. అటు ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్షకు ఆదేశించారు. రివ్యూ చేసిన మంత్రులు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇప్పటికే రద్దు చేసిన పరీక్షలకు అభ్యర్ధులు మళ్లీ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని.. అందరికీ మెటీరియల్ కూడా ఉచితంగా అందిస్తామని తెలిపారు కేటీఆర్. స్టడీ సర్కిల్స్ 24గంటలు అందబాటులో ఉంచి అభ్యర్ధులు పరీక్షలకు ప్రిపేర్ అయ్యేలా సకల ఏర్పాట్లు చేస్తామన్నారు. ఇద్దరు దుర్మార్గులు చేసిన తప్పుకు 30లక్షల మంది యువత ఇబ్బంది పడటం దురదృష్టకరమన్న మంత్రి కేటీఆర్.. నిందితులు, వారి వెనకున్న కింగ్‌పిన్‌లను వదిలే ప్రసక్తే లేదన్నారు. బీజేపీ కుట్ర కోణంపైనా కేటీఆర్ అనుమానం వ్యక్తం చేశారు. గతంలో నోటిఫికేషన్ల సందర్భంగా బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు… నిందితుల్లో బీజేపీ క్రియాశీల కార్యకర్త ఉండటంపై పోలీసులు దృష్టి పెట్టి సమగ్ర విచారణ జరిపించాలన్నారు.
నిందితుల్లో ఒకరైన రేణుక కుటుంబసభ్యులు ముఖ్యంగా ఆమె తల్లి బీఆర్ఎస్ సర్పంచ్ కాదా అంటూ ప్రశ్నించారు బండి సంజయ్. మొత్తం వ్యవహారంలో నైతిక బాధ్యత వహించి కేటీఆర్ రాజీనామా చేయాల్సిందే అన్నారు బీజేపీ చీప్. రాష్ట్రంలో సాంకేతిక అంశాలకు సంబంధించి ఏదైనా ఐటీ మంత్రి పరిధిలో ఉంటుందని ఇందుకు భిన్నంగా కేటీఆర్ తనకు సంబంధం లేదనడం ఏంటని నిలదీసింది కాంగ్రెస్.
విపక్షాలు చేస్తున్న ఆరోపణలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు మంత్రి కేటీఆర్. గుజరాత్, మధ్యప్రదేశ్‌లో జరిగిన పేపర్ లీకుల్లో ఎంతమంది మంత్రులు రాజనామాలుచేశారని ప్రశ్నించారు.
TSPSC కేసులో నిజాలు బయటకు రావాల్సి ఉంది. ఈలోగా ఇది రాజకీయంగా రచ్చకు కారణమవుతోంది. ప్రభుత్వంపై విపక్షాలు మూకుమ్మడి దాడి చేస్తుంటే… అంతే స్ట్రాంగ్‌గా కౌంటర్ ఇస్తోంది బీఆర్ఎస్. ఇంతకీ ఇందులో రాజకీయ కుట్ర కోణం ఉందా?
వీకెండ్ అవర్ విత్ మురళీ కృష్ణ వీడియో చూడండి..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..