Telangana Rains: తెలంగాణ ప్రజలకు అలర్ట్.. మూడు రోజులు ఈ ప్రాంతాల్లో వర్షాలు..
నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. జూన్ 4న కేరళలోకి ప్రవేశించే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల్లో మరో వారం రోజుల్లో రుతుపవనాలు ప్రవేశిస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.

నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. జూన్ 4న కేరళలోకి ప్రవేశించే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల్లో మరో వారం రోజుల్లో రుతుపవనాలు ప్రవేశిస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. మరోవైపు విదర్భ నుంచి తమిళనాడు వరకు కొనసాగుతున్న ద్రోణి కొనసాగుతోంది. దీని ప్రభావంతో తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాగల 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉందని పేర్కొంది. ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.
రాష్ట్రంలోని నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, యాదాద్రి భువనగిరి, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో భారీ వర్షాలు, నిర్మల్, నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులతో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. ఈ మేరకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది.
ఈ క్రమంలో ఉత్తర తెలంగాణలో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని పేర్కొంది. ఇదిలాఉంటే.. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మంగళవారం వర్షాలు కురిశాయి.




మరిన్ని తెలంగాణ వార్తల కోసం..