Summer Effect: సెగలు కక్కుతున్న సూర్యుడు.. ఎండలతో జాగ్రత్త.. మరికొద్ది రోజులు ఇంతే..

ఏపీ, తెలంగాణలో సూర్యుడు చెలరేగిపోతున్నాడు. గతేడాది కంటే ఈ సారి ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 9 దాటాక బయటకు రావాలంటేనే ప్రజలు భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. రోజు రోజుకు ఉష్ణోగ్రతలు భారీగా నమోదవుతున్నాయి. సాధారణం కంటే 2 నుంచి 5 డిగ్రీలపైనే ఉష్ణోగ్రతలు నమోదు అవుతుండడంతో కొత్త రికార్డ్‌లు క్రియేట్‌ అవుతున్నాయి.

Summer Effect: సెగలు కక్కుతున్న సూర్యుడు.. ఎండలతో జాగ్రత్త.. మరికొద్ది రోజులు ఇంతే..
Summer
Follow us

| Edited By: Srikar T

Updated on: Apr 27, 2024 | 5:26 PM

ఏపీ, తెలంగాణలో సూర్యుడు చెలరేగిపోతున్నాడు. గతేడాది కంటే ఈ సారి ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 9 దాటాక బయటకు రావాలంటేనే ప్రజలు భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. రోజు రోజుకు ఉష్ణోగ్రతలు భారీగా నమోదవుతున్నాయి. సాధారణం కంటే 2 నుంచి 5 డిగ్రీలపైనే ఉష్ణోగ్రతలు నమోదు అవుతుండడంతో కొత్త రికార్డ్‌లు క్రియేట్‌ అవుతున్నాయి. తెలంగాణలో పలు జిల్లాల్లో వడగాలులు వీస్తుండగా.. భద్రాచలం, రామగుండంలో ఐతే.. అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ క్రమంలోనే.. తెలంగాణలో మరో మూడు రోజుల పాటు కొన్ని జిల్లాల్లో అక్కడక్కడా వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. పొడి వాతావరణం కారణంగా గత కొన్ని రోజుల కంటే రెండు నుంచి మూడు డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. పగటి ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరగడంతో ఉదయం 11 గంటల నుంచి 3గంటల వరకు అవసరమైతే తప్ప బయటకు రాకూడదని వాతావరణశాఖ తెలిపింది.

ఇక.. ఆంధ్రప్రదేశ్‌లోనూ ఎండలు మండిపోతున్నాయి. రాయలసీమ, కోస్తాంధ్రలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పలు జిల్లాల్లో మాడు పగిలేలా ఎండలు కాస్తుండడంతో ప్రజలు ఇంట్లో నుంచి బయటకు రావాలంటే జంకుతున్నారు. అటు.. అనూహ్య వాతావరణ మార్పులతో ఎండలు పెరిగి.. వడగాలులు వీస్తున్నాయి. వడగాలులు, ఉక్కపోతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇదిచాలదన్నట్లు.. వచ్చే మూడు రోజులు ఎండలు మరింత పెరిగే అవకాశం ఉందని.. అవసరమైతే తప్ప బయటకు రావొద్దని వాతావరణ శాఖ హెచ్చరించడంతో ప్రజలు మరింత భయపడిపోతున్నారు. శుక్రవారం 56 మండలాల్లో తీవ్ర వడగాలులు, 174 మండలాల్లో వడగాల్పులు వీచినట్లు వాతావరణశాఖ తెలిపింది. సాధారణం కంటే ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతుండడంతో ప్రజలు అలెర్ట్‌గా ఉండాలని హెచ్చరిస్తోంది.

Latest Articles
పెరుగుతో ఇవి కలిపి తిన్నారంటే.. ఇక అంతే.!
పెరుగుతో ఇవి కలిపి తిన్నారంటే.. ఇక అంతే.!
అదును చూసి పులిపై దాడి చేసిన ఎలుగుబంటి..! ట్విస్ట్ ఏంటంటే..
అదును చూసి పులిపై దాడి చేసిన ఎలుగుబంటి..! ట్విస్ట్ ఏంటంటే..
సీఎం జగన్ లండన్ టూర్ అనుమతిపై ఉత్కంఠ.. కోర్టు తీర్పు ఎప్పుడంటే..
సీఎం జగన్ లండన్ టూర్ అనుమతిపై ఉత్కంఠ.. కోర్టు తీర్పు ఎప్పుడంటే..
కర్మలను బట్టే శిక్షలు.. ఏ తప్పుకు ఎటువంటి శిక్ష విధిస్తారో తెలుసా
కర్మలను బట్టే శిక్షలు.. ఏ తప్పుకు ఎటువంటి శిక్ష విధిస్తారో తెలుసా
కాలిఫోర్నియా రోడ్లపై పరుగులు పెడుతున్న ఇండియన్‌ ఆటో..!వీడియోవైరల్
కాలిఫోర్నియా రోడ్లపై పరుగులు పెడుతున్న ఇండియన్‌ ఆటో..!వీడియోవైరల్
పెళ్లైన 4 రోజులకే పుట్టింటికొచ్చిన నవవధువు.. అసలు విషయం తెలిస్తే.
పెళ్లైన 4 రోజులకే పుట్టింటికొచ్చిన నవవధువు.. అసలు విషయం తెలిస్తే.
తనపై యుద్ధానికి వచ్చిన పాండవులను శపించిన శివుడు.. కలియుగంలో జన్మ
తనపై యుద్ధానికి వచ్చిన పాండవులను శపించిన శివుడు.. కలియుగంలో జన్మ
గుప్పెడంత మ‌న‌సు నటి అసభ్యకర వీడియోలు వైరల్..
గుప్పెడంత మ‌న‌సు నటి అసభ్యకర వీడియోలు వైరల్..
తమిళిసైపై ఈసీకి ఫిర్యాదు.. కోడ్ ఉల్లంఘించారంటున్న బీఆర్ఎస్..
తమిళిసైపై ఈసీకి ఫిర్యాదు.. కోడ్ ఉల్లంఘించారంటున్న బీఆర్ఎస్..
ఇంట్లోంచి వెళ్లిపోతానన్న కావ్య.. నిజం చెప్పబోయిన సుభాష్..
ఇంట్లోంచి వెళ్లిపోతానన్న కావ్య.. నిజం చెప్పబోయిన సుభాష్..