YSRCP: అమ్మఒడి పథకానికి 2 వేలు పెంపు.. వైసీపీ మేనిఫెస్టో హైలెట్స్ ఇవే..

వైసీపీ మేనిఫెస్టో విడుదలైంది. ఇందుకు సంబంధించిన వివరాలను ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ వెల్లడించారు. 2019లో ఇచ్చిన హామీల్లో 99 శాతం అమలు చేశామని ముఖ్యమంత్రి జగన్ వెల్లడించారు. ఆంధ్రా రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా...గడిచిన 58 నెలల కాలంలో అమలు చేశామని చెప్పారు.

YSRCP: అమ్మఒడి పథకానికి 2 వేలు పెంపు.. వైసీపీ మేనిఫెస్టో హైలెట్స్ ఇవే..
Cm Ys Jagan
Follow us
Ram Naramaneni

|

Updated on: Apr 27, 2024 | 2:22 PM

– మేనిఫెస్టోలో మళ్లీ జగన్‌ తన మార్క్ చూపించారు. 2 పేజీల్లోనే తాము ఏం చేస్తామో చెప్తూ 2024 మేనిఫెస్టో రిలీజ్‌ చేశారు. ప్రస్తుతమున్న పథకాలు కొనసాగిస్తూ ఇంకా ఏమేమి చేస్తారో వివరించారు.

— అమ్మఒడి పథకానికి 2 వేలు పెంచారు. ప్రస్తుతం రూ.15వేలు ఉంటే అది 17వేలకు పెంచుతామని హామీ ఇచ్చారు.

— ఇక రెండు విడతల్లో పెన్షన్‌ పెంచుతామన్నారు. 3 వేల నుంచి ఆ మొత్తాన్ని 3500కి పెంచుతామన్నారు. 2028లో రూ.250, 2029లో రూ.250 చొప్పున పెన్షన్‌ పెరుగుతుంది.

— ఇక రైతు భరోసా రూ.16వేలకు పెంచుతారు. ప్రస్తుతం 13 వేల 500 ఉంది. ఇది 16 వేలు అవుతుంది.

— చేయూత, కాపునేస్తం, ఈబీసీ నేస్తం లాంటి పథకాల్ని యధాతథంగా కొనగాగిస్తున్నట్టు ప్రకటించారు.

— గ్రామంలో 50 శాతం ఎస్సీ జనాభా, 500 ఇళ్లు ఉంటే ప్రత్యేక పంచాయతీ ఏర్పాటు చేస్తారు.

— విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో ప్రస్తుతమున్న పథకాలు యధాతథంగా అమలవుతాయి.

— యువత శిక్షణ కోసం 175 నియోజకవర్గాల్లో స్కిల్‌ హబ్‌లు ఏర్పాటు చేస్తారు.

— తిరుపతిలో స్కిల్‌ యూనివర్సిటీ ఉంటుంది.

— ఐదేళ్లలో పోలవరం ప్రాజెక్ట్‌ పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.

— లా నేస్తం, నేతన్న నేస్తం, వాహనమిత్ర, మత్స్యకార భరోసా పథకాలు యధాతథంగా ఉంటాయి.

— ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలకు విదేశీ విద్య పథకం కింద ఆర్థిక సాయం అందిస్తారు.

— ప్రభుత్వ ఉద్యోగులకు వైద్యం, ఇళ్ల నిర్మాణానికి సాయం చేస్తారు.

— హార్బర్లు, ఎయిర్‌పోర్టుల నిర్మాణం వేగంగా పూర్తి చేస్తారు.

— కులవృత్తులకు జగనన్న చేదోడు కొనసాగిస్తారు.

— ఎస్సీ, ఎస్టీ కాలనీలకు ఉచిత కరెంట్

— రాష్ట్రవ్యాప్తంగా హార్ట్‌, కేన్సర్‌ కేర్‌ సెంటర్లు

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…