Telangana: వంతెన పై నుంచి వాగులో పడిపోయిన వాహనం.. నలుగురు మృతి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో నలుగురు మృతి చెందడం కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్‌లోని టి. నర్సాపురం మండలం తిరుమలదేవి పేట గ్రామానికి చెందిన వారు ఓ టెంపో వాహనంలో భద్రాచలం రామాలయానికి వచ్చారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో నలుగురు మృతి చెందడం కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్‌లోని టి. నర్సాపురం మండలం తిరుమలదేవి పేట గ్రామానికి చెందిన వారు ఓ టెంపో వాహనంలో భద్రాచలం రామాలయానికి వచ్చారు. దర్శనం అయ్యాక తిరిగి వెళ్తున్నారు. ఈ టెంపో వాహనంలో 12 మంది కుటుంబ సభ్యులు ఉన్నారు. అయితే బూర్గంపాడు వద్దకు రాగానే ప్రమాదవశాత్తు వాహనం అదుపుతప్పి ఓ వంతెన పై నుంచి వాగులోపడిపోయింది.
ఈ దుర్ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు చిన్నారులకు తీవ్రంగా గాయాలయ్యాయి. గాయాలైనవారికి ప్రస్తుతం బూర్గంపాడు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తు్న్నారు. మృతులు సందీప్ (10), ప్రదీప్ (10), శ్రీనివాసరావు(40), దుర్గారావు(43) గా పోలీసులు గుర్తించారు.




మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.
