TS Staff Nurse Exam Date: తెలంగాణ 5,204 స్టాఫ్‌నర్సు పోస్టులకు రాత పరీక్ష తేదీ వెల్లడీ.. ఇంతకీ ఎప్పుడంటే..
తెలంగాణ వైద్యారోగ్య శాఖలో వివిధ విభాగాల్లో దాదాపు 5,204 స్టాఫ్‌నర్స్ పోస్టులకు రాత పరీక్ష తేదీని తెలంగాణ మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (MHSRB) ప్రకటించింది. ఆగస్టు 2వ తేదీన పరీక్ష నిర్వహించనున్నట్లు..

Telangana Staff Nurse Exam Date 2023: తెలంగాణ వైద్యారోగ్య శాఖలో వివిధ విభాగాల్లో దాదాపు 5,204 స్టాఫ్‌నర్స్ పోస్టులకు రాత పరీక్ష తేదీని తెలంగాణ మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (MHSRB) ప్రకటించింది. ఆగస్టు 2వ తేదీన పరీక్ష నిర్వహించనున్నట్లు బోర్డు వెల్లడించింది. ఈ నియామక పరీక్ష ద్వారా మొత్తం 5,204 స్టాఫ్‌నర్సు పోస్టులను భర్తీ చేయనున్నారు. హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్‌లలోని కేంద్రాల్లో మూడు షిఫ్టుల్లో ఆన్‌లైన్ విధానం (సీబీటీ)లో నిర్వహిస్తారు. జులై 23 నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. పరీక్ష సమయం 80 నిమిషాలు.
కాగా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 40,926 మంది అభ్యర్ధులు స్టాఫ్‌నర్స్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారు. ఒక్కోపోస్టుకు గరిష్ఠంగా ఎనిమిది మంది పోటీపడుతున్నారు. అభ్యర్ధులకు కేటాయించిన సెషన్‌లో మాత్రమే పరీక్షకు అనుమతిస్తామని బోర్డు తన ప్రకటనలో వెల్లడించింది.




మరిన్ని కెరీర్ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
