Telangana: ఆ జాతరలో ఫ్లెక్సీలే హైసెక్యూరిటీ.. ఎందుకో తెలిస్తే వావ్ అంటారు

అసలు ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయో కానీ.. చూసే ప్రతిఒక్కరూ షాక్ అవ్వక తప్పదు.. సంక్రాంతి సందర్భంగా వరంగల్ జిల్లాలో జరిగే ఐనవోలు మల్లికార్జున స్వామి క్షేత్రంలో ఎక్కడ చూసినా కొండముచ్చు ఫ్లెక్సీలే... సహజంగా భక్తులను దొంగలున్నారు జాగ్రత్త అని ఎలా అప్రమత్తం చేస్తారో..

Telangana: ఆ జాతరలో ఫ్లెక్సీలే హైసెక్యూరిటీ.. ఎందుకో తెలిస్తే వావ్ అంటారు
Telangana
Follow us
G Peddeesh Kumar

| Edited By: Ravi Kiran

Updated on: Jan 15, 2025 | 1:59 PM

అసలు ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయో కానీ.. చూసే ప్రతిఒక్కరూ షాక్ అవ్వక తప్పదు.. సంక్రాంతి సందర్భంగా వరంగల్ జిల్లాలో జరిగే ఐనవోలు మల్లికార్జున స్వామి క్షేత్రంలో ఎక్కడ చూసినా కొండముచ్చు ఫ్లెక్సీలే… సహజంగా భక్తులను దొంగలున్నారు జాగ్రత్త అని ఎలా అప్రమత్తం చేస్తారో అలాగే జాతర ప్రాంగణంలో భారీఎత్తున కొండముచ్చు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.. కోతుల బెడద నుండి నివారణ కోసం ఏర్పాటుచేసిన కొండముచ్చు ఫ్లెక్సీలు బలే సత్ఫలితాలనిచ్చాయి.. అధికారులు, భక్తులు ఊపిరి పీల్చుకున్నారు. సహజంగా వేలాదిమంది గుమి కూడే జాతర నిర్వహణలో పోలీసుల భద్రత ఒక భాగం… యువజన సంఘాలు… స్కౌట్, యూత్ సెక్యూరిటీ సహజంగా చూస్తుంటాం.. కానీ కోతుల నివారణకు ఓ వింత ఆలోచన ఐనవోలు మల్లికార్జున స్వామి క్షేత్రంలో చూపరులను ఆశ్చర్య పరుస్తుంది… సంక్రాంతి సందర్భంగా జరిగే ఈ మహా జాతరలో చాలా ప్రాంతాల్లో ఇలా కొండముచ్చుల ఫ్లెక్సీలు కనిపిస్తాయి… కారణం ఏంటో తెలుసా? కొండముచ్చు కనబడితే ఆ పరిసర ప్రాంతాల్లోకి కోతులు రావు.

ఐనవోలు దేవస్థానం అధికారుల ప్రయత్నం నిజంగానే సత్ఫలితాలను ఇచ్చింది.. ఐనవోలు జాతర ప్రాంగణంలో కొబ్బరికాయలు కొట్టే స్థలం చుట్టూ కొండముచ్చు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.. జాతర ప్రాంగణంలో అక్కడక్కడ చాలా ప్రాంతాల్లో దొంగలున్నారు. జాగ్రత్త అని ఎలా ఫ్లెక్సీ ఏర్పాటు చేస్తారో.. అలాగే కొండముచ్చు ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేశారు.. కొండముచ్చు ఫ్లెక్సీలు ఉన్న పరిసర ప్రాంతాల్లోకి కోతులు దరిదాపుల్లోకి రావడం లేదు. దీంతో భక్తులు, అధికారులు పోలీసులు అంతా ఊపిరి పిలుచుకున్నారు. ప్రతి జాతరలో కోతుల బెడద నుండి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న అధికారులు ఈసారి కొండముచ్చు ఫ్లెక్సీల ఏర్పాటు సక్సెస్ అవడంతో ఊపిరి పీల్చుకున్నారు.. భక్తులు కూడా కోతుల బెడద నుండి విముక్తి లభించిందని ఆనందం వ్యక్తం చేశారు.. ఎవరి ఆలోచన ఏమో కానీ ఈ కొండముచ్చు ఫ్లెక్సీల ఐడియా బాగుందని అంతా ప్రశంసించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి