ఆయ్.! మేం గోదారోల్లమండీ.. కొత్త అల్లుడికి 120 వంటకాలతో బాహుబలి విందు

సంక్రాంతి పండగ తెలుగువారికి పెద్ద పండుగ. కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. ముఖ్యంగా కొత్త అల్లుడికి వివిధ రకాల ఐటమ్స్, స్వీట్స్‌తో ఘనంగా మర్యాదలు చేస్తూ ఉంటారు. అత్తింటివారు.. ఇది గోదావరి జిల్లాల్లో ఈ సంప్రదాయం కనిపిస్తూ ఉంటుంది. తెలంగాణలో కూడా ఇటువంటి మర్యాదలు చేస్తున్నారు.

ఆయ్.! మేం గోదారోల్లమండీ.. కొత్త అల్లుడికి 120 వంటకాలతో బాహుబలి విందు
Viral
Follow us
N Narayana Rao

| Edited By: Ravi Kiran

Updated on: Jan 15, 2025 | 1:12 PM

ఖమ్మం జిల్లా వైరాలో నివసిస్తున్న బాలాజీ జ్యూయలరీ షాప్ నిర్వాహకులు నందిగామ భాస్కరరావు సుజాత దంపతుల రెండో కుమార్తె మధుశ్రీకి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం సుధాపల్లి గ్రామానికి చెందిన కొనకొల్ల సందీప్‌తో ఇటీవల కాలంలో వివాహం జరిగింది. తెలుగువారి ఇష్టమైన పండుగ సంక్రాంతి కావడంతో కొత్త అల్లుడు దంపతులకు అతిధి మర్యాదలు చేశారు. అత్తింటివారు 120 రకాల వంటకాలతో రకరకాల స్వీట్లు వంటకాలను వడ్డించి నూతన దంపతులకు విందు ఇచ్చారు.

ఈ సందర్భంగా పెళ్లి కుమార్తె తల్లిదండ్రులు నందిగామ భాస్కరరావు సుజాత దంపతులు మాట్లాడుతూ.. ‘తెలుగువారి ఇష్టమైన పండుగ సంక్రాంతి పండుగ కావటంతో నూతన దంపతులను ఆనందపరిచేందుకు 120 రకాల వంటకాలను తయారు చేయడం జరిగిందని తెలిపారు. తెలుగువారికి ఇది గొప్ప పండుగని ప్రతి ఒక్కరూ ఆనందంతో గడపాలని కోరారు. వేడుకలు నూతన దంపతుల తల్లిదండ్రులు బంధువులు పాల్గొని ఘనంగా సంక్రాంతి వేడుక జరుపుకున్నారు’.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి